నెపోటిజంపై షాకింగ్ కామెంట్స్ చేసిన వారుసుడు!
బాలీవుడ్ లో నెపోటిజంపై ఏ రేంజ్ లో చర్చ జరుగుతుందో చెప్పాల్సిన పనిలేదు. నిత్యం ఏదో రూపంలో నెపోటి జం అంశం చర్చకొస్తుంటుంది.
బాలీవుడ్ లో నెపోటిజంపై ఏ రేంజ్ లో చర్చ జరుగుతుందో చెప్పాల్సిన పనిలేదు. నిత్యం ఏదో రూపంలో నెపోటి జం అంశం చర్చకొస్తుంటుంది. అలా వచ్చిన ప్రతీ సారి బ్యాక్ గ్రౌండ్ ఉన్న నటులంతా వారసత్వ కంటే తమ ప్రతిభతోనే పెకొచ్చామని చెబుతుంటారు. వారసత్వం అనేది తమకు ఎంట్రీకార్డు వరకే పరిమితమని అంతకు మించి వారసత్వంతో తాము సాధించింది పెద్దగా లేదని చెబుతుంటారు. అయితే తొలిసారి మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ అందుకు భిన్నంగా స్పందించి షాక్ ఇచ్చారు. నిజంగా ఆ స్పందన చూస్తే ఎంతో నిజాయితీ కనిపిస్తుంది.
సాధారణంగా స్టార్ కిడ్స్ ఈ పదం వింటేనే అసహనానికి లోనవుతుంటారు. కానీ జునైద్ మాత్రం తనకు ఆ పదం పట్ల ఎలాంటి ద్వేషం లేదని స్పష్టం చేశారు. తాను ఆమిర్ ఖాన్ కుమారుడిని కాబట్టే పరిశ్రమలో తనకు ఇన్ని అవకాశాలు దక్కుతున్నాయనేది నగ్న సత్యమని ఒప్పుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జునైద్ ఖాన్ ఇటీవల నటించిన `లవ్యప`, `ఏక్ దిన్` చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ `వరుసగా రెండు ఫ్లాపులు వచ్చినా? నాకు ఇంకా అవకాశాలు వస్తున్నాయంటే దానికి ప్రధాన కారణం నా కుటుంబ నేపథ్యమే.
నిర్మాతలు ఎప్పుడూ సులభంగా మార్కెట్ చేయగలిగే నటులనే ఎంచుకుంటారు. వారికి స్టార్ కిడ్స్ అయితే ప్రమోషన్ పరంగా కలిసి వస్తుంది. అందుకే టాలెంట్ కంటే ఒక్కోసారి మార్కెట్ వాల్యూకే ప్రాధాన్యత దక్కుతుంది అని కుండబద్దలు కొట్టారు. విక్కీ లాల్వానీతో జరిగిన సంభాషణలో జునైద్ మరింత లోతుగా విశ్లేషించారు. నిర్మాతలు తమ సినిమాను అమ్ముకోవడానికి ప్రయత్నిస్తారని తెలిసిన ముఖాలు ఉంటే ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడం సులభమని వారు భావిస్తారని అన్నారు. నేపోటిజం అనేది పరిశ్రమలో ఒక భాగమని దీని గురించి విసుగు చెందాల్సిన పని లేదని అభిప్రాయపడ్డారు.
తాను నటించిన `మహారాజ్` సినిమాకు మంచి ప్రశంసలు వచ్చినా? థియేట్రికల్ రిలీజ్‌లు ఫ్లాప్ కావడం బాధాకరమన్నారు. `రెండు ఫ్లాపుల తర్వాత కూడా పని దొరుకుతోంది. నన్ను పని చేసుకోనివ్వండి` అని జునైద్ ఖాన్ చమత్కరించారు. అలాగే డాడ్ ఆమిర్ ఖాన్ గురించి మాట్లాడారు. `ఏక్ దిన్ సినిమా ఫలితం పట్ల తన తండ్రి ఇంకా అసంతృప్తిగానే ఉన్నారని వెల్లడించారు. భవిష్యత్తులో తన తండ్రి ప్రమేయం లేకుండానే స్వతంత్రంగా నిర్ణయా లు తీసుకోవాలని జునైద్ నిర్ణయించుకున్నారు. ఆమిర్ ఖాన్ ఐదేళ్లలో ఒక సినిమా చేస్తారన్నారు.
కానీ ఒక కొత్త నటుడిగా తనకు ఎక్కువ సినిమాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే తండ్రి ప్రొడక్షన్ మీద ఆధార పడకూడదని భావిస్తున్నట్లు జునైద్ చెప్పారు. అలాగే జునైద్ ఖాన్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండరన్నది తెలిసిందే. దీనిపై కూడా జునైద్ స్పందించారు. `నాకు సోషల్ మీడియాలో గుర్తింపు లేకపోయినా నిర్మాతలు అవకాశాలు ఇస్తున్నారు. సాధారణ నటులకు ఇది సాధ్యం కాదు. ఇది పూర్తిగా నేను ఏ కుటుంబం నుంచి వచ్చాననే దానిపై ఆధారపడి ఉంది` అని తన ప్రివిలేజ్‌ను అంగీకరించారు. ఒక నటుడు తనలో లోపాలను, ప్లస్ పాయింట్లను ఎంతో హుందాగా ఒప్పుకోవడం జునైద్‌లోని పరిణతిని చాటిచెబుతోంది.