తారక్ ఏంటి అలా ఉన్నాడు? ఏమైంది?

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.;

Update: 2025-07-14 09:41 GMT

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. వెంటవెంటనే సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఇప్పటికే పలు చిత్రాలను లైనప్ లో చేర్చుకున్నారు. రీసెంట్ గా వార్-2 మూవీని కంప్లీట్ చేశారు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు.

పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఆ మూవీ షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది జూన్ 25న రిలీజ్ కానుండగా.. జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుతున్నారు మేకర్స్. తారక్ కూడా వరుస షెడ్యూల్స్ లో పాల్గొంటున్నారు. తాజాగా కోట శ్రీనివాసరావు కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు.

అనారోగ్య సమస్యలతో ఆదివారం ఉదయం కోట శ్రీనివాసరావు తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్ నగర్ లోని తన నివాసంలో కన్నుమూశారు. ఆ నేపథ్యంలో తారక్.. కోట ఇంటికి వెళ్లారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ధైర్యం కూడా చెప్పారు. ఆ తర్వాత బయటకు వచ్చి మీడియాతో తారక్ మాట్లాడారు.

ఆ సమయంలో కోటతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రతి పాత్రకు తనదైన శైలిలో ప్రాణం పోసిన మహా నటుడు కోట అంటూ కొనియాడారు. తన సినీ ప్రయాణంలో ఆయనతో నటించిన, పంచుకున్న క్షణాలు ఎప్పటికీ చిరస్మరణీయమని తెలిపారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీంతో తారక్ లుక్ హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఆయన ఆ సమయంలో చాలా బరువు తగ్గినట్లు.. సన్నగా కనిపించారనే చెప్పాలి. ముఖంలో కళ అస్సలు లేనట్లే ఉంది. అది గమనించిన అభిమానులు, సినీ ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏమైందన్న అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకంత తగ్గారని అడుగుతున్నారు.

అయితే మరికొందరు మాత్రం.. ఏమవ్వలేదని చెబుతున్నారు. ప్రశాంత్ నీల్ సినిమాలోని లుక్ అయ్యి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. అంతకుముందు కొద్ది రోజుల క్రితం కూడా ఇలాగే జరిగింది. ఓ వేడుకకు తారక్ రాగా.. ఏమైందని అంతా కలవరపడ్డారు. ఇప్పుడు మరోసారి రిపీట్ అయింది. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ ఏమైనా రెస్పాండ్ అవుతారేమో వేచి చూడాలి.

Tags:    

Similar News