వార్-2 క్లిక్ అయితే.. తెలుగులో కూలీ పరిస్థితేంటి?

ఇప్పుడు వార్-2ను కూడా పెద్ద ఎత్తున రిలీజ్ చేయనున్నారు. ఎందుకుంటే నాగవంశీ గురించి అందరికీ తెలిసిందే.;

Update: 2025-07-06 08:30 GMT
వార్-2 క్లిక్ అయితే.. తెలుగులో కూలీ పరిస్థితేంటి?

టాలీవుడ్ స్టార్ హీరో, మ్యాన్ ఆఫ్ ది మాసెస్ జూనియర్ ఎన్టీఆర్.. వార్-2 మూవీతో మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ప్రముఖ యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా స్పై జోనర్ లో రూపొందుతున్న వార్-2 సినిమాకు ప్రముఖ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.

వార్-2 మూవీతోనే తారక్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుండగా.. ప్రముఖ నటుడు హృతిక్ రోషన్ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కీలక పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. ఆగస్టు 14వ తేదీన సినిమాను తెలుగుతో పాటు హిందీలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా.. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు మేకర్స్.

అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో స్టార్ అండ్ యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ వార్-2ను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ వార్-2 హక్కులను సొంతం చేసుకున్నట్లు, హ్యాట్రిక్ లోడింగ్ అన్నట్లు రీసెంట్ గా పోస్ట్ పెట్టారు. తారక్ గత చిత్రాలు అరవింద సమేత వీర రాఘవ, దేవరను ఆయన రిలీజ్ చేశారు.

ఇప్పుడు వార్-2ను కూడా పెద్ద ఎత్తున రిలీజ్ చేయనున్నారు. ఎందుకుంటే నాగవంశీ గురించి అందరికీ తెలిసిందే. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా దూకుడుగా ఉంటారు. భారీ సంఖ్యలో థియేటర్స్ లో సినిమాలు విడుదల చేస్తుంటారు. అయితే వార్-2 రిలీజ్ రోజే విడుదల కానున్న కూలీ మూవీకి ఇప్పుడు తక్కువ స్క్రీన్స్ దొరుకుతాయని టాక్.

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఆ సినిమా కూడా ఆగస్టు 14వ తేదీన రిలీజ్ అవ్వనుంది. యాక్షన్ థ్రిల్లర్ గా రానున్న కూలీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది. తెలుగులో కూడా సందడి చేయనుంది. ఇప్పటికే ఆడియన్స్ లో భారీ బజ్ క్రియేట్ చేసుకుందనే చెప్పాలి.

కానీ వార్-2 ఎఫెక్ట్ తో కూలీ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో స్క్రీన్స్ మాత్రం తక్కువ దొరికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీనిపై అధికారికంగా తెలియకపోయినా.. ఏమైనా జరగవచ్చు. కానీ అది నిజమైతే.. వార్-2 మూవీకి అనుకున్నట్లు పాజిటివ్ టాక్ వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో కూలీ బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడం కష్టమయ్యే ఛాన్స్ ఉంది. మరేం జరుగుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News