వార్-2.. అదే జరిగితే తారక్ కు తిరుగులేదు!

టాలీవుడ్ స్టార్ హీరో, మ్యాన్ ఆఫ్ ది మాసెస్ జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు బాలీవుడ్ డెబ్యూ మూవీతో థియేటర్స్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే.;

Update: 2025-08-14 07:15 GMT

టాలీవుడ్ స్టార్ హీరో, మ్యాన్ ఆఫ్ ది మాసెస్ జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు బాలీవుడ్ డెబ్యూ మూవీతో థియేటర్స్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. బీ టౌన్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఆయన చేసిన వార్-2 సినిమాతో నేడే (గురువారం) ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విక్రమ్ గా సినిమాలో కనిపించారు తారక్.

అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన వార్-2 మూవీని యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మించారు. యష్ రాజ్ ఫిల్మ్ యూనివర్స్ లో భాగంగా స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వార్-2 మూవీ రూపొందగా.. ఇప్పటికే సినిమాను చూసిన నెటిజన్లు, సినీ ప్రియులు.. సోషల్ మీడియాలో రివ్యూ ఇస్తూ పోస్టులు పెడుతున్నారు.

అయితే ఇప్పటికే తారక్ నటించిన సినిమాలు నార్త్ లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. మంచి క్రేజ్ కూడా సంపాదించుకున్నారు. దేవరతో నార్త్ లో అనుకున్నంతగా సక్సెస్ అవ్వలేదు. అలా అని పూర్తిగా ఏం కాదు. ఇప్పుడు సోలోగా బీ టౌన్ లో వార్-2తో సందడి చేస్తున్నారు.

వార్-2 సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు ఎన్టీఆర్. ఎందుకంటే మూవీ ఆయనకు చాలా కీలకమని చెప్పాలి. ఒకవేళ వార్-2 బ్లాక్ బస్టర్ హిట్ అయితే తారక్ కు బాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వస్తాయని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. చాలా మేకర్స్.. తమ అప్ కమింగ్ మూవీస్ కోసం తారక్ పేరును పరిశీలిస్తారు.

అదే సమయంలో ఎన్టీఆర్ యాక్టింగ్ అండ్ డ్యాన్స్ స్కిల్స్ గురించి అందరికీ తెలిసిందే. దీంతో వార్-2 మంచి హిట్ అయితే.. చాలామంది దర్శక నిర్మాతలు ఆయనను సంప్రదించడం పక్కా. అయితే ఇప్పటికే యష్ రాజ్ ఫిల్మ్స్.. తమ బ్యానర్ పై రూపొందే ఓ మూవీ కోసం తారక్ ను లాక్ చేసినట్లు గట్టిగా టాక్ వినిపిస్తోంది.

ఆ సినిమాలో తారక్ సోలో హీరోగా నటిస్తున్నారని తెలుస్తోంది. ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు వార్ సీక్వెల్ రిజల్ట్ పై అందరి ఫోకస్ ఉంది. తారక్ ఎంట్రీ సినిమాలో అదిరిపోయిందని అనేక మంది కామెంట్స్ పెడుతున్నారు. ఆయన యాక్టింగ్ వేరే లెవెల్ అని అంటున్నారు. మరి ఎలాంటి హిట్ ను సొంతం చేసుకుంటారో వేచి చూడాలి.

Tags:    

Similar News