ఇద్దరి చేతుల్లో ఒకే పుస్తకం దేనికి సంకేతం?
తారక్ కి జోడీగా మంజిమా మోహన్ ని ఎంపిక చేస్తున్నారా? అన్నట్లు కథనాలు మొదలయ్యాయి. మురుగన్ కు ఇద్దరు భార్యలు.;
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పట్టాలెక్కడానికి మరో ఏడాదిన్నర సమయం పట్టే అవకాశం ఉంది. కానీ తారక్ మాత్రం అప్పుడే ప్రిపరేషన్ మొదలు పెట్టినట్లు కనిపిస్తుంది. తాజాగా ఇటీవలే తారక్ ఆనంద్ బాల సుబ్రమణియన్ రాసిన లార్డ్ మురుగ అనే దేవుడి పుస్తకం తారక్ చేతుల్లో కనిపించే సరికి సంగతి అర్ద మైంది. పాత్రకు సంబంధించి తనవంతు బాధ్యతగా ఖాళీ సమయంలో పుస్తక పఠనం మొదలు పెట్టాడు.
తద్వారా జ్ఞానంతో పాటు, పాత్రకు సంబంధించి ఆత్మను పట్టుకునే అవకాశం కలుగుతుంది. అందుకే తారక్ డ్రాగన్ తో బిజీగా ఉన్నా ఖాళీ సమయాన్ని మాత్రం వృద్దం చేయకుండా పని చేస్తున్నాడు. తాజాగా ఇదే పుస్తకంతో మలయాళం నటి మంజిమా మోహన్ కూడా రెండు రోజుల క్రితం ప్రత్యక్షమైంది. దీంతో తారక్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ లో తాను కూడా భాగమవుతుందా? అన్న సందేహాలు సోషల్ మీడియా వేదికగా మొదల య్యాయి. ఏంటి ఈ యాధృశ్చికం అంటూ రకరకాల ఊహాగానాలకు తావిచ్చినట్లు అయింది.
తారక్ కి జోడీగా మంజిమా మోహన్ ని ఎంపిక చేస్తున్నారా? అన్నట్లు కథనాలు మొదలయ్యాయి. మురుగన్ కు ఇద్దరు భార్యలు. వారిలో ఒకరు దేవసేన కాగా, మరొకరు వల్లి. దేవసేన ఇంద్రుడి కుమార్తె, వల్లి ఒక గిరిజన నాయకుడి కుమార్తె. ఈ నేపథ్యంలో మంజిమను ఓ పాత్రకు తీసుకున్నట్లు ఈ క్రమంలోనే ఆమె కూడా ప్రిపరేషన్ మొదలు పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. మరి ఈ పుస్తకం చదవడం యాదృశ్చికంగా జరిగుతుందా? త్రివిక్రమ్ ఆదేశాల మేరకు సన్నద్ధం అవుతుందా? అన్నది క్లారిటీ రావాలి.
మంజిమా మోహన్ టాలీవుడ్ కు సుపరిచితమే. యువ నాగ చైతన్య నటించిన `సాహసం శ్వాసగా సాగిపో` సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. అటుపై ఎన్టీఆర్ బయోపిక్ లో నారా భువనేశ్వరి పాత్రలో నటిం చింది. కానీ ఆ తర్వాత మళ్లీ తెలుగు సినిమాల్లో కనిపించలేదు. మాలీవుడ్ లో చాలా సినిమాలు చేసింది. తమిళ నటుడు గౌతమ్ కార్తీక్ ను ప్రేమ వివాహం చేసుకుంది. రెండేళ్లగా సినిమాలకు దూరంగా ఉంటుంది. మరి తారక్-గురూజీ సినిమా తో కంబ్యాక్ అవుతుందా? అన్నది క్లారిటీ రావాలి.