పాకిస్తాన్‌లో 'దురంధ‌ర్' త‌ర్వాత 'డ్రాగ‌న్‌'కే ఆ రికార్డ్?

ఇండియా - పాక్ యుద్ధ స‌మ‌యంలో కూడా ఖాన్ లు దాయాదికి వ్య‌తిరేకంగా స్పందించ‌క‌పోవ‌డానికి అక్క‌డ ఉన్న భారీ అభిమానగ‌ణం ఒక కార‌ణం.

Update: 2026-05-23 05:30 GMT

ఖాన్ ల త్ర‌యానికి పాకిస్తాన్ లో ఉన్న క్రేజ్- ఇమేజ్ గురించి తెలిసిందే. ఇండియా - పాక్ యుద్ధ స‌మ‌యంలో కూడా ఖాన్ లు దాయాదికి వ్య‌తిరేకంగా స్పందించ‌క‌పోవ‌డానికి అక్క‌డ ఉన్న భారీ అభిమానగ‌ణం ఒక కార‌ణం. ఖాన్ ల‌కు స్వ‌త‌హాగానే దేశ‌భ‌క్తి మెండుగా ఉన్నా కానీ, దానిని ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోవ‌డానికి కార‌ణం దాయాది దేశంలోని పెచ్చుమీరిన‌ అభిమానం, మార్కెట్ కి సంబంధించిన స్టాటిస్టిక్స్ కూడా ఒక కార‌ణం. ఖాన్ ల పాకిస్తానీ పిచ్చిపై ఆప‌రేష‌న్ సింధూర్ స‌హా చాలా యుద్ధ స‌మ‌యాల్లో బోలెడంత చ‌ర్చ సాగింది. ఖాన్ లు తీవ్ర‌వాదాన్ని వ్య‌తిరేకించినా పాక్ ని ఉగ్ర‌వాదిగా చూడ‌ర‌నేది కొంద‌రి అభిప్రాయం.

ఇదిలా ఉంటే అందుకు భిన్నంగా పాకిస్తాన్ లో అభిమానం సంపాదించుకుంటున్న టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ వ్య‌వ‌హారం ఇటీవ‌లి కాలంలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే దీనికి కార‌ణం.. అత‌డు న‌టిస్తున్న డ్రాగ‌న్ మూవీ. కేజీఎఫ్ - కేజీఎఫ్ 2- స‌లార్ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రాల‌తో పాకిస్తాన్ లోను అభిమానుల‌ను సంపాదించుకున్న ప్ర‌శాంత్ నీల్ కూడా దీని వెన‌క‌ ఒక కార‌ణం. ఇప్పుడు ఎన్టీఆర్ తో నీల్ తీస్తున్న డ్రాగ‌న్ కోసం ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా పాకిస్తానీ అభిమాని వేచిచూస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. ఎన్టీఆర్ బ‌ర్త్ డే ఉత్స‌వాల‌ను కుటుంబంతో సెల‌బ్రేట్ చేసుకున్న స‌ద‌రు పాకిస్తానీ అభిమాని ఆ కేక్ పై డ్రాగ‌న్ పై త‌న‌కు ఉన్న ఆస‌క్తిని కూడా రాసాడు.

అదంతా స‌రే కానీ.. ఇటీవ‌లి కాలంలో పాకిస్తాన్ లో అత్య‌ధికంగా పైర‌సీలో డౌన్ లోడ్ చేసుకుని వీక్షించిన సినిమాగా దురంధ‌ర్, దురంధ‌ర్ 2 చిత్రాలు సంచ‌ల‌నం సృష్టించాయి. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ డ్రాగ‌న్ ఆ రికార్డుల్ని బ్రేక్ చేయ‌డం ఖాయ‌మ‌ని ఈ అభిమానం చెబుతోంది. అయితే ఎన్టీఆర్ - నీల్ బృందానికి ఒక పెద్ద అస్సెట్ ఏమిటి? అంటే.. డ్రాగ‌న్ చిత్రాన్ని ఎలాంటి ఇబ్బందీ లేకుండా పాకిస్తాన్ లో కూడా భారీగా రిలీజ్ చేసుకునేందుకు అవ‌కాశం ఉంది. అయితే ఇందులో దేశ‌భ‌క్తి ఎలిమెంట్ ని పాకిస్తాన్ పై శ‌త్రుత్వం అనే ఎజెండాతో చూపించ‌నంత‌వ‌ర‌కూ ఓకే. ఒక‌వేళ ఇందులో దాయాది దేశానికి చెందిన ఉగ్ర మూక‌ల్ని హైలైట్ చేస్తే దురంధ‌ర్ కి ప‌ట్టిన గ‌తే ప‌డుతుంది.

దీనికంటే ముఖ్యంగా ఆలోచించాల్సిన విష‌యం.. ప్ర‌తిష్ఠాత్మ‌క‌ `డ్రాగ‌న్` సినిమాని కూడా పాకిస్తాన్ లో కేవ‌లం పైర‌సీలోనే డౌన్ లోడ్ చేసుకుని రికార్డులు సృష్టిస్తారు. అలా కానివ్వ‌కుండా...పాకిస్తాన్ లోని అత్యుత్త‌మ డిస్ట్రిబ్యూష‌న్ నెట్ వ‌ర్క్ ద్వారా డ్రాగ‌న్ ని ఆ దేశంలో భారీగా రిలీజ్ చేయ‌డానికి నీల్ బృందం ఏం చేస్తుందో చూడాలి. అలాగే ఇరాన్ వ‌ర్సెస్ అమెరికా- ఇజ్రాయేల్ వార్ స‌మ‌యంలో పాకిస్తాన్ కి అత్యంత ఫాలోవ‌ర్స్ ఉన్న గ‌ల్ఫ్ దేశాల‌లోను దురంధ‌ర్ ఫ్రాంఛైజీ సినిమాల‌ను రికార్డ్ స్థాయిలో వీక్షించారు. పాకిస్తాన్,గ‌ల్ఫ్ లో భార‌తీయ సినిమాల‌కు ఉన్న ఇమేజ్ దృష్ట్యా డ్రాగ‌న్ లాంటి భారీ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టాండార్డ్ చిత్రాన్ని పైర‌సీ పాలు కాకుండా కాపాడ‌టం ముఖ్యం. దీనికోసం తెలుగు ఫిలింఛాంబ‌ర్, అలాగే సౌతిండియ‌న్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్, భార‌తీయ సినిమాల‌న్నిటినీ కంట్రోల్ చేస్తున్న ఒక పెద్ద అసోసియేష‌న్ ఏం చేయ‌బోతోన్నాయ‌నేది వేచి చూడాలి.

Tags:    

Similar News