వార్ 2 రిజల్ట్.. అంత అతని మంచికే..

భారీ అంచనాలతో వచ్చిన వార్ 2 బాక్సాఫీస్ వద్ద చతికిలపడిపోయింది. అనుకున్న రేంజ్ స్పందన ఈ సినిమాకు రాలేదు.;

Update: 2025-08-26 21:30 GMT

భారీ అంచనాలతో వచ్చిన వార్ 2 బాక్సాఫీస్ వద్ద చతికిలపడిపోయింది. అనుకున్న రేంజ్ స్పందన ఈ సినిమాకు రాలేదు. బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇద్దామనుకున్న తారక్ కు ఇది నిరాశనే మిగిల్చింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా ఫీల్ అయ్యింటారు. కానీ, ఇది ఒక రకంగా తారక్ మంచికే. దీనిపై ఆయన ఫ్యాన్స్ కూడా హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఎందుకు అంటారా?

అయితే వార్ 2 సినిమా కచ్చింగా సూపర్ హిట్ అవుతుంది అన్న నమ్మకంతో తారక్ యశ్ రాజ్ ఫిల్మ్ స్పై యూనివర్స్ లో భాగమయ్యారు. ఈ సినిమాలో తారక్ పోషించిన విక్రమ్ ఏజెంట్ పాత్రను యూనివర్స్ లో భాగం చేద్దమని అనుకున్నారు. అలాగే సింగిల్ హీరోగా సినిమాకు కూడా హామీ ఇచ్చారట. ఒకవేళ ఇది మంచి విజయం సాధించి ఉంటే.. అదే బ్యానర్ లో ఎన్టీఆర్ మరో రెండు, మూడు సినిమాలు చేయాల్సి వచ్చేది.

కానీ వార్ 2 ఈ లెక్కలను తారుమారు చేసింది. అదే హిట్టై ఉంటే.. ఎన్టీఆర్ మళ్లీ మళ్లీ బాలీవుడ్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఉన్న మార్కెట్ పరిస్థితుల్లో టాలీవుడ్ స్టార్ హీరోలు.. బాలీవుడ్ దర్శకులతో సినిమాలు చేయడం సేఫ్ కాదు. అక్కడ ఉన్న ఖాన్ హీరోలు అట్లీ, లోకేష్ కనగరాజ్ లాంటి సౌత్ దర్శకులతో పని చేసేందుకు ఇష్టపడుతుంటే.. మన వాళ్లు అయాన్ ముఖర్జీ లాంటి బేస్ లేని డైరెక్టర్ ను నమ్ముకోవడం పెద్ద రిస్క్ అవుతుంది.

అందుకే తారక్ అప్ కమింగ్ లైనప్ లో అటువాంటి వాళ్లు లేకపోవడమే మంచిది. ఎందుకంటే ఎన్టీఆర్ ఇప్పుడు.. వరుసగా ప్రశాంత్ నీల్, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, నెల్సన్ దిలీప్ కుమార్ వంటి దర్శకులతో పని చేయనున్నారు. అదే బాలీవుడ్ లో ఇలాంటి పవర్ ఫుల్ డైరెక్టర్లు ఎవరు ఉన్నారు. ఎంత వెతికినా మన డైరెక్టర్లకు సమానంగా ఉన్నవాళ్లు బాలీవుడ్ లో అయితే కనిపించడం లేదు.

ఇక అందుకే వార్ 2 ఎంత దారుణంగా పోయినా సరే ఫ్యాన్స్ కలత చెందాల్సిన పని లేదు. యష్ రాజ్ ఫిల్మ్స్ డిసెంబర్ లో ఆలియా భట్ అల్ఫా సినిమా రిజల్ట్ ను బట్టి స్పై యూనివర్స్ ను ఎలా విస్తరించాలనేది డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక టైగర్ వర్సెస్ పఠాన్ దాదాపు రావడం కష్టం. దీనిపై సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ ఇద్దరూ ఆసక్తి చూపించడం లేదని టాక్.

అలాగే టైగర్ 4 కూడా కష్టమే అంటున్నారు. పఠాన్ 2 సైతం ఇప్పటికీ ఎలాంటి అఫీషియల్ అప్డేట్ నోచుకోలేదు. వార్ 2 ఫలితం చూశాక, వార్ 3 గగనమే. అవేంజర్స్ రేంజ్ లో స్పై యూనివర్స్ ను విస్తరించాలనుకుంటే ప్లాన్ రివర్స్ అయ్యింది. అందుకే వేరే నటీనటులతో వెబ్ సిరీస్ చేయాలన్న ప్లాన్ లో ఉన్నట్లు సమాచారం.

Tags:    

Similar News