సూపర్ హీరోగా డేంజరెస్ హీరో!
బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం 'ది డిప్లోమాట్' తో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. చాలా కాలం తర్వాత వచ్చిన సోలో సక్సెస్ ఇది.;
బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం 'ది డిప్లోమాట్' తో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. చాలా కాలం తర్వాత వచ్చిన సోలో సక్సెస్ ఇది. దీంతో కొత్త ప్రాజెక్ట్ ల విషయంలో మరింత జాగ్రత్తగా వహిస్తున్నాడు. ప్రస్తుతం `తెహ్రాన్`, `తారీక్` లాంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. రెండు ఆన్ సెట్స్ లో ఉన్నాయి. ఈ రెండు చిత్రాల రిలీజ్ అనం తరం భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడు. ఏకంగా ఓ సూపర్ హీరో థ్రిల్లర్ కథాంశంలోనే నటించబోతున్నాడు.
మరోసారి `పర్మాణు` కాంబినేషన్ చేతులు కలుపుతుంది. అభిషేక్ శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. భారీ కాన్వాస్ పై భారీ బడ్జెట్ తో నిర్మించడానికి సర్వం సిద్దం చేస్తున్నారు. ఈ సినిమాతో ప్రేక్ష కులకు థియేటర్లో కొత్త అనుభూతి అందించబోతున్నారు. ఇంతకీ ఏంటా కథ అంటే వివరాల్లోకి వెళ్లా ల్సిందే. అదే 'ముంకీ మాన్'. అభిషేక్ రాసిన పుస్తకం ఆధారంగా ఈ సినిమా మూల కథని తీసుకుంటున్నారు.
2026 లో మొదలవుతుంది. ఈ పుస్తకం 2012లో రాసారు. ఢిల్లీలో జరిగిన ఓ సంఘటన స్పూర్తితో రాయబడింది. 2001 వేసవిలో ఢిల్లీలో ఒక జీవి కొన్ని సమస్యలను సృష్టిస్తోందని అలజడి మొదలైంది. కానీ ఆ జీవి గుర్తించనవి విధంగా ఉంది. ఆ జీవి అకస్మాత్తుగా రావడం.. అదృశమవ్వడం జరిగింది. ఇలాంటి అంశాలను జోడీస్తూ ఓ సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెరకెక్కించనున్నారు. ఈ సినిమా కోసం100-150 కోట్ల కేటాయిస్తున్నారు.
సినిమాకి భారీ ఎత్తున సీజీ, విఎఫ్ ఎక్స్ అవసరం పడుతుంది. ఈ నేపథ్యంలో భారీ బడ్జెట్ వెచ్చిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా మొదలవుతుంది. కానీ ఎప్పుడు పూర్తవుతుంది? ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఇతర నటీనటులు ఎవరు? సాంకేతిక బృందం ఏంటి? అన్నది మాత్రం ఇంకా బయటకు రాలేదు. కానీ జాన్ అబ్రహాం-అభిషేక్ మాత్రం సీరియస్ గా వర్క్ చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి.