జెలో 168క్యారెట్ల నెక్లెస్ డిజైన్‌కి 1800 గంటలు
జెలో లుక్ కి తగ్గ ఆభరణాన్ని ఎంపిక చేసుకుంది. భారతీయ మహారాణిలోని ఔన్నత్యాన్ని ప్రతిబింబించేలా అందమైన పచ్చల ఆభరణం ప్రత్యేక ఆకర్షణగా మారింది.;
భారతీయ సంస్కృతి - సాంప్రదాయం విలువ ఎంతో అంతర్జాతీయ సెలబ్రిటీలు కూడా తెలుసుకుంటున్నారు. మన దేశంలోని కుభేరుల పెళ్లిళ్లలో ప్రదర్శనల కోసం వచ్చినప్పుడు కనీసం 4 రోజుల నుంచి 7రోజుల వరకూ ఇక్కడే ఉండి, భారతీయ వెడ్డింగ్ కల్చర్ గురించి తెలుసుకుని, పెళ్లిలో ప్రదర్శనలతో అలరించి మరీ వెళుతున్నారు. వెళ్లేప్పుడు భారీగా ప్యాకేజీలు కూడా అందుకుంటున్నారు.
ఇదే కేటగిరీలో ఇంతకుముందు రిహానా, మొన్నటికి మొన్న జెన్నిఫర్ లోపెజ్ వంటి అంతర్జాతీయ పాప్ గాయనీమణులు తమ ప్రదర్శనలతో రక్తి కట్టించారు. అలాగే అమెరికన్ షోలతో పాపులరైన కిమ్ కర్ధాషియన్-కోలీ కర్థాషియన్ లాంటి అందగత్తెలు కూడా అంబానీల ఈవెంట్లలో మెరిసారు. కొన్ని దశాబ్ధాలుగా ఈ కల్చర్ ఇలానే కొనసాగుతోంది. భారతదేశంలోని ప్రముఖుల ఇళ్లలో వేడుకల్లో నృత్యం చేసేందుకు అంతర్జాతీయ పాప్ స్టార్లు ఆసక్తిని కనబరచడం ఎప్పుడూ చర్చనీయాంశమే.
ఇటీవలే తెలుగమ్మాయి, ఎన్నారై నేత్ర మంతెన - వంశీ గాదిరాజు పెళ్లిలో మరో ప్రముఖ పాప్ స్టార్ జెన్నిఫర్ లోపేజ్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. jloగా సుప్రసిద్ధురాలైన ఈ గాయని ఇటీవల భారతదేశాన్ని సందర్శించినప్పుడు ఇనాయ బ్లష్ - ఎంఎం శారీలో హృదయాలను గెలుచుకుంది. ఈ చీర కోసం ఉపయోగించిన డిజైనర్ వర్క్ నిజంగా ఆశ్చర్యపరుస్తోంది. స్పటికాలతో అలంకరించిన కట్ వర్క్ పల్లు ప్రత్యేక ఆకర్షణ. ఈ డిజైన్ మనీష్ మల్హోత్రా సిగ్నేచర్ లుక్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజవంశపు మహారాణిలా ఖరీదైన నెక్లెస్‌తో లుక్ ఎంతో వైబ్రేంట్ గా కనిపిస్తోంది.
జెలో లుక్ కి తగ్గ ఆభరణాన్ని ఎంపిక చేసుకుంది. భారతీయ మహారాణిలోని ఔన్నత్యాన్ని ప్రతిబింబించేలా అందమైన పచ్చల ఆభరణం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ ఆభరణంలో రంగు రాళ్లు చాలా ప్రత్యేకతతో ఆకట్టుకున్నాయి. 168 క్యారెట్లకు పైగా పచ్చలతో.. దాదాపు 1,800 గంటలకు పైగా సమయం తీసుకుని రూపొందించిన ఈ షో పీస్ `మనీష్ మల్హోత్రా జువెలరీ` బ్రాండ్ నుంచి ఎంపిక చేసుకున్న స్పెషల్ పీస్. రెండు విభిన్నమైన ఆకుపచ్చ రంగులతో.. చెవిపోగులు, సిగ్నేచర్ పామ్ కఫ్‌లు, డైమండ్ బ్యాంగిల్, ఉంగరంతో మహారాణినే తలపిస్తోంది జెలో.
పెళ్లిలో వివాదం:
నేత్ర మంతెన- వంశీ గాదిరాజు పెళ్లి వేదికపై అంతర్జాతీయ పాప్ గాయని జెన్నిఫర్ లోపేజ్ డ్యాన్సింగ్ విన్యాసాలను యూత్ అంత తేలిగ్గా మార్చిపోలేరు. అయితే జెలో ధరించిన దుస్తులు చాలా విమర్శలకు దారితీశాయి. ఉదయ్ పూర్ పెళ్లికి నిప్పంటించింది! అంటూ కొందరు సాంప్రదాయవాదులు విరుచుకుపడ్డారు. ఈ వీడియోలలో బాడీ హగ్గింగ్ డిజైనర్ దుస్తులలో జెన్నిఫర్ ఒంపు సొంపులు హైలైల్ అయ్యాయి.
ఇండియన్ స్టైల్ వెడ్డింగ్ లో ఇలాంటి బోల్డ్ అవతారం సరికాదని వారించే ప్రయత్నం చేసారు. అయితే జెలోని ప్రశంసించే ఒక వర్గం మాస్ ఆడియెన్ కూడా లేకపోలేదు. చాలా మంది తెలుగు అభిమానులు జెన్నిఫర్ బ్రేక్ డ్యాన్సులకు అవాక్కయ్యారు. అద్భుతమైన బ్రేక్ డ్యాన్సులతో జెన్నిఫర్ అదరగొట్టిందని ప్రశంసలు కురిసాయి. అయితే ఎప్పుడూ బోల్డ్ లుక్ లో కనిపించే జెలో ఇప్పుడిలా భారతీయ ట్రెడిషన్ లో ఆభరణాలు ధరించి కనిపించడం ఆకట్టుకుంటోంది.