జయం రవి సంసారాన్ని ముంచిన ఆ `ఇడ్లీ నటి` ఎవరు? కోలీవుడ్‌లో గుసగుసలు!
భార్య ఆర్తీతో విడాకుల వ్యవహారంలో నటుడు జయం రవి చెన్నైలో నిర్వహించిన ప్రెస్ మీట్ కోలీవుడ్‌లో ఒక పెద్ద తుఫానును రేపింది.
భార్య ఆర్తీతో విడాకుల వ్యవహారంలో నటుడు జయం రవి చెన్నైలో నిర్వహించిన ప్రెస్ మీట్ కోలీవుడ్‌లో ఒక పెద్ద తుఫానును రేపింది. ఈ ఉద్వేగభరితమైన సమావేశంలో ఆయన ఎవరి పేరునూ నేరుగా ప్రస్తావించకుండా తన సంసారం విచ్ఛిన్నం కావడానికి `మూడు అక్షరాల పేరున్న ఒక నటి` కారణమంటూ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఆమెను పదే పదే `ఇడ్లీ నటి` (ఇడ్లీ నడిగై) అని సంబోధించడం ఇప్పుడు తమిళ సోషల్ మీడియాలో అతిపెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ``ఆ నటి నా కుటుంబాన్ని నాశనం చేసింది.. నా గురించి మాట్లాడే ఏ నైతిక హక్కు ఆమెకు లేదు. సమాజం ముందు ఆమె ఒక నకిలీ ఫెమినిస్ట్‌గా చలామణి అవుతోంది`` అని జయం రవి ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ రహస్య నటి ఎవరనే దానిపై నెటిజన్లు ఆన్‌లైన్ డిటెక్టివ్‌లుగా మారిపోయారు.
జయం రవి వ్యాఖ్యలు వెలువడిన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియా లలో ``ఎవరా మూడు అక్షరాల ఇడ్లీ నటి?`` అనే ప్రశ్నలతో నిండిపోయాయి. గాసిప్ రాయుళ్లు, అభిమానులు... పాత ఇంటర్వ్యూలు, పబ్లిక్ ఈవెంట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఆమె ఐడెంటిటీని డీకోడ్ చేసే పనిలో పడ్డారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. జయం రవి భార్య ఆర్తీకి అత్యంత ఆప్తురాలిగా ఉంటూ ఈ వైవాహిక వివాదంలో ఆమె వెనుక నిలబడిన ఒక ప్రముఖ నటినే రవి లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. జయం రవి నేరుగా ఆమె పేరు చెప్పకపోయినా.. ఆయన ఇచ్చిన క్లూస్ కోలీవుడ్ సర్కిల్స్‌లో కార్చిచ్చును రగిల్చాయి.
ఈ వివాదం అంతకంతకూ ముదరడానికి కొన్ని గంటల ముందే.. సింగర్ - స్పిరిచువల్ హీలర్ కెనీషా.. జయం రవితో తన రిలేషన్‌షిప్‌కు బ్రేకప్ చెప్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. ఈ కథలోకి నేను ప్రేమతో వచ్చాను.. కానీ ఇప్పుడు మౌనంగా వెనుదిరుగుతున్నాను! అని పేర్కొంటూ ఆన్‌లైన్ బుల్లీయింగ్, మేనిప్యులేషన్ల వల్లే తాను చెన్నైని, సోషల్ మీడియాను వదిలి వెళ్తున్నట్లు కెనీషా రాసుకొచ్చింది. ఆమె పోస్ట్ పరోక్షంగా ఆర్తీని, ఆమె వెనుక ఉన్నవారిని టార్గెట్ చేసినట్లుగా ఉండటంతో.. దానికి కంటిన్యూషన్‌గా జయం రవి ప్రెస్ మీట్‌లో చేసిన `ఇడ్లీ నటి` వ్యాఖ్యలు మరింత ఎక్స్‌ప్లోసివ్‌గా మారాయి.
మీడియా ముందు జయం రవి మానసికంగా పూర్తిగా కుంగిపోయినట్లు కనిపించారు. గత రెండేళ్లుగా తాను పాటించిన మౌనాన్ని అందరూ బలహీనతగా చూశారని కన్నీరు పెట్టుకున్నారు. తన పిల్లలను కనీసం చూడనివ్వడం లేదని, స్కూల్లో కూడా బాడీగార్డ్స్ పెట్టి తనను దూరం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా ``నిజానికి ఆర్తీని పెళ్లి చేసుకోవద్దని మా తల్లిదండ్రులు నా కాళ్లు పట్టుకుని బ్రతిమాలారు.. నేనే వినకుండా తప్పు చేశాను`` అంటూ తన వ్యక్తిగత జీవితంలోని అత్యంత షాకింగ్ విషయాలను కూడా ఆయన బయటపెట్టారు. తనపై వస్తున్న మహిళా ద్వేషి అనే ముద్రను ఆయన తీవ్రంగా ఖండించారు.
ప్రస్తుతం ఒకరిపై ఒకరు చేసుకుంటున్న క్రిప్టిక్ ఆరోపణలు.. కెనీషా దూరం జరగడం.. ఆర్తీ `మదర్ లయన్` అంటూ ఇండైరెక్ట్ వార్నింగ్ ఇవ్వడం.. వీటన్నింటికీ తోడు జయం రవి ఓపెన్‌గా కన్నీళ్లు పెట్టుకోవడం చూస్తుంటే కోలీవుడ్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన సెలబ్రిటీ బ్రేకప్ స్టోరీగా ఇది మారుతోంది. ఈ `ఇడ్లీ నటి` మ్యాటర్ సినిమా లవర్స్ లో పెద్ద చర్చగా మారుతోంది. ఆ మూడు అక్షరాల నటి ఎవరో బయటపెట్టాలని ఎవరికి వారు ప్రయత్నాలలో ఉన్నారు.