ఘట్టమనేని వారసుడి మొదటి కథ.. ఎలా ఉంటుందంటే..
టైటిల్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు కానీ, ఇన్ సైడ్ టాక్ ప్రకారం స్టోరీ మాత్రం మైండ్ బ్లోయింగ్ గా ఉండబోతోంది. ఈ సినిమా కథ మొత్తం తిరుపతి నేపథ్యంలో సాగుతుందని సమాచారం.;
టాలీవుడ్ లో ఘట్టమనేని ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ స్టార్ కృష్ణ గారు వేసిన బాటలో మహేష్ బాబు ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతున్నారు. అయితే ఇప్పుడు ఆ వంశం నుంచి మరో వారసుడు వెండితెరపైకి దూసుకొస్తున్నాడు. కృష్ణ గారి మనవడు, రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఎంట్రీలో ఎలాంటి కథతో వస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ గ్రాండ్ ఎంట్రీ రొటీన్ గా కాకుండా, ఒక వైవిధ్యమైన కాన్సెప్ట్ తో ఉండబోతోందట.
సాధారణంగా వారసుల ఎంట్రీ అంటే సేఫ్ జోన్ లో లవ్ స్టోరీనో, మాస్ మసాలా సినిమానో ఎంచుకుంటారు. కానీ జయకృష్ణ కోసం దర్శకుడు అజయ్ భూపతి ఒక డిఫరెంట్ రూట్ ను ఎంచుకున్నాడు. 'ఆర్ఎక్స్ 100', 'మంగళవారం' లాంటి సినిమాలతో తన మార్క్ చూపించిన అజయ్, ఈసారి కూడా ఆడియన్స్ ఊహకు అందని కథను సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
టైటిల్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు కానీ, ఇన్ సైడ్ టాక్ ప్రకారం స్టోరీ మాత్రం మైండ్ బ్లోయింగ్ గా ఉండబోతోంది. ఈ సినిమా కథ మొత్తం తిరుపతి నేపథ్యంలో సాగుతుందని సమాచారం. తిరుమల పుణ్యక్షేత్రానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పురాతన ఆలయం చుట్టూ ఈ కథ తిరుగుతుందట. ఆ ఆలయం చరిత్ర, అక్కడి వాతావరణం సినిమాకు ప్రధాన బలం కానున్నాయి. డివోషనల్ టచ్ ఇస్తూనే, దర్శకుడు తనదైన శైలిలో ఒక క్రైమ్ యాంగిల్ ను దీనికి జోడించాడని తెలుస్తోంది.
ఆ పురాతన ఆలయంలో జరిగే ఒక భారీ దొంగతనం, దాని చుట్టూ అల్లుకున్న మిస్టరీనే ఈ సినిమా మెయిన్ పాయింట్ అని తెలుస్తోంది. ఆ దొంగతనానికి, హీరో పాత్రకు ఉన్న లింక్ ఏంటి? అసలు హీరో పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? అనే అంశాలతో ఈ సినిమాను ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా మలిచారట. కేవలం ట్విస్టులే కాకుండా, గుండెను తాకే ఎమోషనల్ డ్రామా కూడా ఈ కథలో పుష్కలంగా ఉంటుందని టాక్.
ఈ సినిమాలో జయకృష్ణకు జోడీగా బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని నటిస్తోంది. ఇదే ఆమెకు తెలుగులో డెబ్యూ సినిమా కావడం విశేషం. గ్లామర్ పరంగానే కాకుండా, నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో ఆమె కనిపించనుందట. ఘట్టమనేని వారసుడు, బాలీవుడ్ బ్యూటీ కూతురు.. ఇలా ఇద్దరు స్టార్ కిడ్స్ ఒకే సినిమాతో పరిచయం అవుతుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్ పై జెమిని కిరణ్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కొత్త హీరో అయినా సరే, కథపై నమ్మకంతో రాజీపడకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మొత్తానికి ఘట్టమనేని కాంపౌండ్ నుంచి వస్తున్న ఈ థ్రిల్లర్, బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో వేచి చూడాలి.