ఘట్టమనేని వారసుడితో అజయ్ భూపతి..!
జయకృష్ణ హీరోగా అజయ్ భూపతి డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాను వైజయంతి బ్యానర్ సమర్పిస్తుంది.;
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కొత్త తరం మొదలు కాబోతుంది. సూపర్ స్టార్ కృష్ణ తర్వాత రమేష్ బాబు, మహేష్ బాబు తండ్రి వారసత్వాన్ని కొనసాగించారు. రమేష్ బాబు తనయుడు జయకృష్ణ కూడా ఇప్పుడు తెరంగేట్రం చేస్తున్నాడు. తండ్రి దూరమైన ఆ ఫ్యామిలీకి బాబాయ్ మహేష్ అండగా ఉన్నాడు. జయకృష్ణకు నటనలో ఆసక్తి ఉందని తెలుసుకుని ఆ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఫ్యామిలీ బ్లడ్ లోనే యాక్టింగ్ ఉంది.. దానికి తోడు నటనలో శిక్షణ, యాక్షన్ సీక్వెన్స్ ట్రైనింగ్ తీసుకున్నాడు జయ కృష్ణ.
ఘట్టమనేని లెగసీ కొనసాగించేందుకు..
ఘట్టమనేని లెగసీ కొనసాగించేందుకు 3వ తరం వస్తుంది. జయకృష్ణ తన మొదటి సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి తో చేస్తున్నాడు. ఆరెక్స్ 100, మంగళవారం సినిమాలతో అజయ్ భూపతి డైరెక్టర్ గా తన మార్క్ చూపించాడు. మధ్యలో మహా సముద్రం కాస్త అంచనాలను అందుకోలేదు. ఐతే మంగళవారం తర్వాత అజయ్ భూపతి కాస్త గ్యాప్ తీసుకుని ఘట్టమనేని యువ హీరో జయ కృష్ణతో సినిమా చేస్తున్నాడు.
జయకృష్ణ హీరోగా అజయ్ భూపతి డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాను వైజయంతి బ్యానర్ సమర్పిస్తుంది. సూపర్ స్టార్ కృష్ణతో అగ్నిపర్వతం తీసి బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ బ్యానర్ మహేష్ తొలి సినిమా రాజ కుమారుడు కూడా ఈ బ్యానర్ నుంచే వచ్చింది. అదే సెంటిమెంట్ తో అశ్వనిదత్ ఈ సినిమాకు సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమాను చందమామ కథలు బ్యానర్ లో పి. కిరణ్ నిర్మిస్తున్నారు.
అజయ్ భూపతితో ఘట్టమనేని జయకృష్ణ..
ఇక సినిమా అనౌన్స్ మెంట్ చేస్తూ ఎత్తైన కొండలు.. తిరుమల గుడిని చూపించారు. సో ఈ సినిమా కథ తిరుపతి నేపథ్యంతో వస్తుందని అనిపిస్తుంది. అజయ్ భూపతి సినిమా అంటే సంథింగ్ క్యూరియస్ గా ఉండేలా ఇంపాక్ట్ ఏర్పరచుకున్నాడు. జయకృష్ణతో అజయ్ భూపతి భారీ ప్రయత్నమే చేస్తున్నాడని అనిపిస్తుంది. ఈ నెలలోనే షూటింగ్ మొదలు కాబోతున్న ఈ సినిమాలో మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది. ఘట్టమనేని యువ హీరో సినిమా అజయ్ భూపతి డైరెక్షన్ చేయడం అనౌన్స్ మెంట్ పోస్టర్ తోనే ఆడియన్స్ లో మంచి క్రేజ్ తీసుకొచ్చారు. మరి సినిమా డీటైల్స్ ఇంకెంత షాకింగ్ అనిపిస్తాయో చూడాలి.
అజయ్ భూపతి మంగళవారం తర్వాత మంగళవారం 2 సినిమా చేస్తాడని అనుకున్నారు. మంగళవారం 2 చేసే ఆలోచన ఉన్నా కూడా జయకృష్ణతో ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేసేందుకు రెడీ అయ్యాడు అజయ్ భూపతి. సినిమా కథ ఏంటన్నది తెలియదు కానీ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ తోనే ఒక డిఫరెంట్ వైబ్ క్రియేట్ చేశాడు అజయ్ భూపతి.