డైలాగులు మార్చ‌డంపై స్టార్ రైట‌ర్ అసంతృప్తి!

50 వ‌సంతాలు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా బాలీవుడ్ క్లాసిక్ `షోలే`: ది ఫైనల్ కట్' పేరుతో 4K ఎడిషన్‌లో మ‌రో మూడు రోజుల్లో రీ-రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-12-09 13:30 GMT

50 వ‌సంతాలు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా బాలీవుడ్ క్లాసిక్ `షోలే`: ది ఫైనల్ కట్' పేరుతో 4K ఎడిషన్‌లో మ‌రో మూడు రోజుల్లో రీ-రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. దాదాపు 1500 థియేట‌ర్లలో చిత్రం రిలీజ్ అవుతుంది. దేశ‌, విదేశాల్లో స్పెష‌ల్ ప్రీమియ‌ర్స్ ప్లాన్ చేసారు. రీ-రిలీజ్ లోనూ ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతిని పంచేలా? చాలా ప్ర‌త్యేక‌త‌లే ఉన్నాయి. `షోలే` క్లైమాక్స్ ను పూర్తిగా మార్చేసారు. మునుప‌టి `షోలే` క్లైమాక్స్ లో రీ-రిలీజ్ లో ఉండ‌దు.

తొలుత రాసుకున్న క్లైమాక్స్ తో రీ-రిలీజ్ అవుతుంది. 1975 లో `షోలే` రిలీజ్ అయిన స‌మ‌యంలో అప్ప‌టి ఎమ‌ర్జెన్సీ కార‌ణ‌గా సెన్సార్ బోర్డ్ నుంచి అభ్యంత‌రం వ్య‌క్త‌మ‌వ్వ‌డంతో క్లైమాక్స్ మార్చి రిలీజ్ చేసారు.

కానీ ఇప్పుడు ఆ పాత క్లైమాక్స్ తో రీ-రిలీజ్ అవ్వ‌డం విశేషం. దీంతో ఈసినిమాను ప్రేక్ష‌కాభిమానులు ఫ్రెష్ గా ఫీల‌య్యే అవ‌కాశం ఉంది. అంతే కాదు ప‌రిచ‌య స‌న్నివేశాల్లో డైలాగుల్లోనూ కొన్ని ర‌కాల మార్పులు చేసిన‌ట్లు తెలుస్తోంది.

హేమా మాలిని తొలి వెర్ష‌న్ లో `బడే నిషాంచీ లగ్దే హో` అనే డైలాగ్ చెబుతారు. దానికి బ‌ధులుగా అమితా బ‌చ్చ‌న్..`హాన్ జేమ్స్ బాండ్ కే పోటే హై హే` అని స‌మాధానం ఇస్తారు. ఇప్పుడిదే డైలాగ్ ను `హాన్ టాటియా టోప్కే పోటే హైన్ యే`గా మార్చారు. అయితే ఇలా సంభాష‌ణ‌లు మార్చ‌డంపై రైట‌ర్ జావేద్ అక్త‌ర్ అసంతృప్తిని వ్య‌క్తం చేసారు. సినిమాలో ప్ర‌తీ డైలాగ్ ఎంతో అద్భుతంగా ఉంటుంద‌ని..అలాంటి డైలాగ్ లు రీ-రిలీజ్ లో మార్చ‌డంపై సంతృప్తిగా లేరు. మొద‌టి వెర్ష‌న్ లో ప్ర‌తీ డైలాగ్ ఎంతో ఆక‌ర్ష‌ణ‌గా ఉంటుంద‌ని..ఆ డైలాగుల‌న్నీ త‌న హృద‌యంలో ఇప్ప‌టికీ స‌జీవంగా ఉన్నాయ‌ని జావేద్ అక్త‌ర్ పేర్కొన్నారు. మ‌రి ఈ మార్పుని ప్రేక్ష‌కులు ఎలా తీసుకుంటారు? అన్న‌ది రిలీజ్ త‌ర్వాత తేలుతుంది.

ఈ సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే రామ్‌గఢ్ అనే కల్పిత గ్రామంలో ఇద్దరు స్నేహితులైన మోసగాళ్లు జై (అమితాబ్ బచ్చన్), వీరు (ధర్మేంద్ర) లను రిటైర్డ్ పోలీసు ఠాకూర్ బల్దేవ్ సింగ్ (సంజీవ్ కుమార్)..బందీపోటు నాయకుడు గబ్బర్ సింగ్ (అమ్జాద్ ఖాన్) ను పట్టుకోవడానికి నియమించుకుంటాడు. ఈ క్రమంలో జరిగే సంఘటనలు, హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ, కథానాయకుల మధ్య స్నేహం, విలన్ పై పోలీస్ అధికారి సహా బాధిత ప్రజల ప్రతీకారం, వారికి లభించిన న్యాయం వంటి అంశాలతో అనేక ఉత్కంఠభరితమైన మలుపులు, పోరాటాలతో సినిమా కథ సాగుతుంది. కర్ణాటకలోని రామ్ నగర్‌‌‌‌ అనే ప్రాంతంలో రెండున్నరేళ్ల పాటు ఈ చిత్రాన్ని రూపొందించారు.

Tags:    

Similar News