• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విజయ్ వారసుడితో టాలీవుడ్...

విజయ్ వారసుడితో టాలీవుడ్ హీరో.. వ్వాటే కాంబినేషన్!

| అయితే కొంతమంది స్టార్స్ వారసులు మాత్రం తండ్రి బాటలో హీరోగా మారకుండా తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని వేరే రంగంలో బిల్డ్ చేసుకోవాలని అనుకుంటారు.

By - Tupaki Desk
Update: 2024-09-09 14:55 GMT

స్టార్ హీరోల కొడుకులు నెక్స్ట్ జెనరేషన్ లో హీరోలుగా ఎంట్రీ ఇస్తే చూడాలని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటారు. చాలా మంది స్టార్ హీరోల పిల్లలు తండ్రి వారసత్వంతో హీరోలుగా తెరంగేట్రం చేస్తారు. వారిలో కొంతమంది సక్సెస్ అవుతారు. మరికొంత మంది మాత్రం మామూలు హీరోలుగా మిగిలిపోతారు. అయితే కొంతమంది స్టార్స్ వారసులు మాత్రం తండ్రి బాటలో హీరోగా మారకుండా తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని వేరే రంగంలో బిల్డ్ చేసుకోవాలని అనుకుంటారు.


అలాగే కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ తనయుడు జేసన్ విజయ్ కూడా వెళ్తున్నాడు. దళపతి విజయ్ సినిమాలకి రిటైర్ట్మెంట్ ఇవ్వనున్న నేపథ్యంలో అతని తనయుడు జేసన్ హీరోగా ఎంట్రీ ఇస్తే చూడాలని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. అయితే జేసన్ మాత్రం హీరో అవ్వాలని అనుకోవడం లేదు. దర్శకుడిగా ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడంట. ఇప్పటికే పలు సినిమాలకి దర్శకత్వ విభాగంలో జేసన్ పనిచేసాడంట.

లైకా ప్రొడక్షన్స్ జేసన్ విజయ్ ని దర్శకుడిగా పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే జేసన్ మొదటి సినిమాని టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ తో ప్లాన్ చేస్తున్నాడనే టాక్ ఇప్పుడు వినిపిస్తోంది. సందీప్ కిషన్ తెలుగుతో పాటు తమిళంలో కూడా మూవీస్ చేస్తూ వస్తున్నాడు. లోకేష్ కనగరాజ్ మొదటి సినిమా సందీప్ కిషన్ తోనే చేశారు. నగరం టైటిల్ తో ఈ మూవీ తెలుగులో డబ్ అయ్యింది. దీనికంటే ముందు తమిళంలో సందీప్ కిషన్ ఒక సినిమా చేశాడు.

ఈ మధ్యకాలంలో తమిళ్ మూవీ కెప్టెన్ మిల్లర్ లో సందీప్ కిషన్ కనిపించాడు. అలాగే ఈ ఏడాది రిలీజ్ అయిన రాయన్ మూవీలో ధనుష్ తమ్ముడిగా నటించాడు. ఈ సినిమాలో సందీప్ కిషన్ పెర్ఫార్మెన్స్ కి మంచి గుర్తింపు వచ్చింది. దీంతో తన కథకి సందీప్ కిషన్ కరెక్ట్ గా సెట్ అవుతాడని జేసన్ విజయ్ భావించాడంట. త్వరలో ఈ సినిమాకి సంబందించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందంట.

అయితే జేసన్ విజయ్ ని దళపతి అభిమానులు మాత్రం హీరోగానే వెండితెరపై చూడాలని అనుకుంటున్నారు. సరైన కథలు ఎంచుకుంటూ నెక్స్ట్ కోలీవుడ్ కి మరో స్టార్ హీరో దొరికినట్లే అని జేసన్ ని చూసినవారు అంటున్నారు. కానీ అతని ఛాయస్ మాత్రం వేరే విధంగా ఉంది. మరి భవిష్యత్తులో ఏమైనా తన నిర్ణయం మార్చుకొని హీరోగా మారుతాడేమో వేచి చూడాలి. సందీప్ కిషన్, జేసన్ కలయికలో సినిమా రావడం నిజమైతే మాత్రం కచ్చితంగా దానికి భారీ హైప్ వచ్చే ఛాన్స్ ఉంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Tags:    
  • Kollywood 
  • Tollywood 
  • Filmindustry 
  • GOAT 
  • VijayThalapathy 
  • JasonSanjay 
  • Director 
  • NewFilm 
  • CaptainMiller 
  • Raayan 
  • SundeepKishan 
  • Dhanush 

Similar News

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

Copyright @2026

Powered by Blink CMS