బాహుబలి డైలాగ్ తెలుగులో అదరగొట్టేసిన జపాన్ మహిళ.. గూస్ బంప్స్ గ్యారంటీ.!
అయితే అలాంటి బాహుబలి ది ఎపిక్ సినిమా డిసెంబర్ 12న జపాన్లో విడుదల కాబోతున్న సంగతి మనకు తెలిసిందే.;
బాహుబలి సినిమాకి ఫ్యాన్స్ ఏ లెవెల్ లో ఉంటారో చెప్పనక్కర్లేదు. తెలుగు దర్శకుడు తెరకెక్కించినప్పటికీ క్రేజ్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉంది. ప్రపంచ నలుమూలల నుండి ఈ సినిమాకి క్రేజ్ వచ్చింది. ఒక సినిమా ఎంత అద్భుతంగా ఉంటే.. ఆ సినిమాకి ప్రపంచ దేశాల నుండి ఫాలోయింగ్ వస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి అద్భుతమైన సినిమానే బాహుబలి..రాజమౌళి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా.నటించిన ఈ సినిమాలో విలన్ గా ప్రభాస్ కి ఏమాత్రం తీసిపోని పాత్రలో రానా దగ్గుబాటి నటించారు. అలాగే రాజమాతగా శివగామి అనే పవర్ఫుల్ రోల్ లో రమ్యకృష్ణ నటించగా.. దేవసేనగా అనుష్క శెట్టి..కట్టప్ప గా సత్యరాజ్..అవంతిక పాత్రలో తమన్నా లు కీలక పాత్రల్లో నటించారు. బాహుబలి-1, బాహుబలి- 2 రెండు సినిమాలు కూడా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ సంపాదించుకున్నాయి. పైగా ఈ రెండు చిత్రాలను కలిపి బాహుబలి ది ఎపిక్ అంటూ ఒకే మూవీగా ఎడిట్ చేసి మరీ అక్టోబర్ 31న రిలీజ్ చేశారు. దీనికి అనూహ్యస్పందన లభించిన విషయం తెలిసిందే.
అయితే అలాంటి బాహుబలి ది ఎపిక్ సినిమా డిసెంబర్ 12న జపాన్లో విడుదల కాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే చిత్ర యూనిట్ అక్కడ ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు.అయితే తాజాగా జపాన్ కి సంబంధించిన ఓ మహిళ బాహుబలి డైలాగ్ చెప్పింది. అది కూడా తెలుగులో.. ప్రస్తుతం జపాన్ మహిళ తెలుగులో బాహుబలి డైలాగ్ చెప్పిన వీడియో నెట్టింట చక్కర్లు కొట్టడంతో చాలామంది నెటిజన్లు ఆ వీడియో చూసి షాక్ అయిపోతున్నారు. ఇదేంటి బాహుబలి క్రేజ్ మరీ ఇంతలా ఉంది అని షాక్ అవుతున్నారు.మరి ఇంతకీ ఆ జపాన్ మహిళ చెప్పిన బాహుబలి డైలాగ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.
తాజాగా జపాన్లో బాహుబలి ది ఎపిక్ విడుదల కాబోతున్న వేళ కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లు అక్కడికి వచ్చిన వారిని కొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ జపాన్ మహిళను మీ పేరేంటి అని తెలుగులో ప్రశ్నించగా..నా పేరు రీనా అని సమాధానం చెప్పింది.ఆ తర్వాత మీరు తెలుగు నేర్చుకుంటున్నారా అని అడగగా.. అవును నేను బాహుబలి నుండి తెలుగు నేర్చుకున్నాను. ఏదైనా ఓ డైలాగ్ చెప్పమని అడగగా.. "అమరేంద్ర బాహుబలి అను నేను..అశేషమైన మాహిష్మతి ప్రజల ధన , మాన, ప్రాణ సంరక్షకుడిగా.. మహారాజా భల్లాలదేవ సర్వసైన్యాధ్యక్షుడిగా అహర్నిశలు అప్రమత్తుడనై విధి నిర్వహణలో ప్రాణ త్యాగానికైనా వెనకాడబోనని రాజమాత శివగామి దేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను బాహుబలి జయహో".. అంటూ భారీ డైలాగ్ చెప్పింది.
అయితే బాహుబలి మూవీలోని డైలాగ్ ని తెలుగులో జపాన్ మహిళ చెప్పడంతో ఆ వ్యక్తి సైతం ఆశ్చర్యపోయి.. అమేజింగ్ అద్భుతంగా చెప్పారు అని పొగిడారు. ఆ తర్వాత ఇప్పటివరకు మీరు ఎన్నిసార్లు బాహుబలి సినిమాను చూశారని ప్రశ్నించగా..100 సార్లు అని అన్సర్ ఇచ్చింది. ఇక జపాన్ మహిళ ఇచ్చిన ఆన్సర్ కి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు ఏంటి 100 సార్లా అని ఆశ్చర్యపోగా.. అవును థియేటర్లో 100 సార్లు చూసాను అని ఆ జపాన్ మహిళా సమాధానం ఇచ్చింది. ఏంటి 100 సార్లు అది కూడా థియేటర్లోనా అని ఆ వ్యక్తి నోరెళ్లబెట్టారు. ఎవ్రీ డే.. ఎవ్రీ నైట్..బాహుబలి సినిమా చూశాను అంటూ ఆ జపాన్ మహిళా చెప్పిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. జపాన్లో ప్రభాస్ మహిళా అభిమాని చేసిన పనికి తెలుగు వాళ్లు సైతం షాక్ అవుతున్నారు. అంత పెద్ద డైలాగ్ ని ఎలాంటి తడబాటు లేకుండా చెప్పి అందర్నీ ఆకర్షించింది. ఈ వీడియోతో ప్రభాస్ సినిమాల రేంజ్ ప్రపంచ నలుమూలల ఏ విధంగా వ్యాప్తి చెందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.