వైట్ డ్రెస్ లో అందాలతో ఆకట్టుకుంటున్న జాన్వీకపూర్!

సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత హీరోయిన్స్ ఎక్కువగా సోషల్ మీడియా లోనే కనిపిస్తూ ప్రేక్షకులకు, అటు అభిమానులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు;

Update: 2025-09-26 14:43 GMT

సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత హీరోయిన్స్ ఎక్కువగా సోషల్ మీడియా లోనే కనిపిస్తూ ప్రేక్షకులకు, అటు అభిమానులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా తమ వ్యక్తిగత విషయాలతో పాటు సినిమా విషయాలను కూడా ఇలా సోషల్ మీడియా ద్వారానే పంచుకుంటున్నారు. అంతేకాదు సినిమా ప్రమోషన్స్ ను కూడా ఇలా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో షేర్ చేస్తూ సినిమాకి కావాల్సిన ప్రమోషన్ కూడా చేసేస్తున్నారు. పైగా లేటెస్ట్ అప్డేట్ల కోసం ఈ సెలబ్రిటీలను ఫాలో అయ్యేవారు కూడా లేకపోలేదు.క్రమంగా వారికి ఫాలోవర్స్ పెరగడమే కాకుండా ఈ ఫాలోవర్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఆదాయం కూడా భారీగానే లభిస్తోంది. వీటి ద్వారా పలు బ్రాండ్లకు ప్రమోషన్ చేస్తూ కూడా ఆదాయాన్ని సంపాదిస్తున్నారు.

ఒకరకంగా చెప్పాలి అంటే.. ఈ సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ హీరోయిన్స్ క్రేజ్ కి, ఆదాయానికి అతిపెద్ద పీట వేస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు. ఇదిలా ఉండగా.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. తన గ్లామర్ ఫోటోలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న హీరోయిన్స్ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా ఒకరు. నటనతోనే కాదు అందంతో కూడా ఆకట్టుకుంటున్న జాన్వీ కపూర్ శ్రీదేవి కూతురు అనిపించుకుంటోంది. తల్లికి తగ్గ అందంతో క్రేజ్ తో భారీ పాపులారిటీ సంపాదించుకున్న జాన్వీ కపూర్ తాజాగా వైట్ బాడీ కాన్ డ్రెస్ ధరించి అందాలతో మెస్మరైజ్ చేసింది.

ముఖ్యంగా ఎద అందాలను హైలెట్ చేస్తూ ధరించిన ఈ డ్రెస్ అభిమానులలో హీట్ పుట్టిస్తోంది అని చెప్పవచ్చు. అమ్మడి అందాలకు కుర్రాళ్ళు హీటెక్కిపోతున్నారు. ప్రస్తుతం జాన్వీ కపూర్ కి సంబంధించిన ఈ లేటెస్ట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జాన్వీ కపూర్ విషయానికి వస్తే.. ఇటీవల పరమ్ సుందరి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె.. ఈ సినిమాతో ఫర్వాలేదు అనిపించుకుంది. ఇప్పుడు సన్నీ సంస్కారీకి తులసి కుమారీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలలో జోరుగా పాల్గొంటోంది జాన్వీ కపూర్.

ఈ సినిమా విషయానికి వస్తే.. కామెడీ రొమాంటిక్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రానికి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్, మెంటల్ డిసిపుల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, అపూర్వ మెహతా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో వరుణ్ ధావన్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా సన్యా మల్హోత్రా, రోహిత్ సరాఫ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. వీరితోపాటు మనీష్ పాల్, అక్షయ్ ఒబెరాయ్ సహాయక పాత్రలు పోషిస్తూ ఉండడం గమనార్హం. దసరా సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Tags:    

Similar News