పాలరాతి శిల్పంలా మెరిసిపోతున్న జాన్వీ కపూర్!
ఇటు అందాల తార జాన్వీ కపూర్ మాత్రం సోషల్ మీడియా వేదికగా లేటెస్ట్ ట్రెండీ ఔట్ఫిట్స్ తో అటు ఫ్యాషన్ ప్రియులను ఇటు ప్రమోషన్స్ తో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
దివంగత నటీమణి..అందాలతార అతిలోకసుందరి శ్రీదేవి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో నటనతో యావత్ దేశ ప్రజలను తన అభిమానులుగా మార్చుకుంది.. అలాంటి ఈమె మన మధ్య లేకపోయినా ఆమె లేని లోటును ఆమె కూతురు జాన్వీ కపూర్ భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. అలా నటనతోనే కాదు అందాలతో ఆకట్టుకుంటూ తల్లిని తలపిస్తూ అభిమానులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ.
బాలీవుడ్లో పలు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన జాన్వీ కపూర్ తెలుగులో కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర చిత్రం ద్వారా తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించి.. తెలుగు అభిమానుల హృదయాలను దోచుకుంది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన జాన్వి కపూర్.. ప్రస్తుతం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమాలో హీరోయిన్గా అవకాశం దక్కించుకుంది.ఇందులో అచ్చియమ్మ అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటిస్తోంది జాన్వీ కపూర్.
జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో వరుస ప్రమోషనల్ కార్యక్రమాలను చేపట్టారు చిత్ర బృందం. అందులో భాగంగానే ఎవరికి వారు సినిమా విశేషాలను పంచుకుంటూ ఆకట్టుకుంటున్నారు. ఒకవైపు అప్పలసూరి పాత్రతో మరోసారి తనను తాను నిరూపించుకోవడానికి సిద్ధమైన జగపతిబాబు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తుంటే.. ఇటు అందాల తార జాన్వీ కపూర్ మాత్రం సోషల్ మీడియా వేదికగా లేటెస్ట్ ట్రెండీ ఔట్ఫిట్స్ తో అటు ఫ్యాషన్ ప్రియులను ఇటు ప్రమోషన్స్ తో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
అలా తాజాగా మరో ట్రెండీ ఔట్ఫీట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది జాన్వీ కపూర్.. తాజాగా అనామికా ఖన్నా డిజైన్ చేసిన తెలుపు రంగు ఐవరీ చీరను ధరించింది. తెల్లని పలుచని వస్త్రంపై చక్కటి హెవీ ఎంబ్రాయిడరీ డిజైన్ చేశారు. స్కాల్డప్ లేస్ డీటెయిల్ తో ఈ చీరను పూర్తి చేశారు. దీనికి కాంబినేషన్లో అంతే హెవీగా డిజైన్ చేసిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి ఆకట్టుకుంది. ఇక జుట్టును వేవ్ చేసిన ఈమె.. వైట్ గోల్డెన్ మిక్స్ చెవి దిద్దులను ధరించింది. నెక్ ను సింపుల్గా, బోసిగా ఉంచేసిన ఈమె.. ఈ లుక్కులో చూస్తుంటే పాలరాతి శిల్పం లా చెక్కబడిందేమో అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఈ వైట్ చీరలో తన బుగ్గలు బ్లష్ అవుతుంటే.. తన అందమైన మోముతో అభిమానులను ఆకట్టుకుంది జాన్వీ కపూర్. ఒక జాన్వీ కపూర్ లేటెస్ట్ ఔట్ ఫిట్ చూసిన అభిమానులు ఏంజెల్, బ్యూటిఫుల్ అంటూ ఇలా ఎవరికి వారు తమకు అనిపించిన రీతిలో తమ హావ భావాలను కామెంట్ రూపంలో వ్యక్తపరుస్తున్నారు.
జాన్వీ కపూర్ విషయానికొస్తే.. ప్రస్తుతం తెలుగు , హిందీలో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది. అందులో బాగానే తెలుగులో నటిస్తున్న పెద్ది సినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.