బాలీవుడ్ నుంచి సౌత్ వరకు… జాన్వీ మాస్టర్ ప్లాన్ ఇదేనా?

బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కెరీర్‌ను గమనిస్తే, అది కేవ‌లం ఒక హీరోయిన్ భాషలు మారుస్తున్న జ‌ర్నీలా కనిపించదు.

Update: 2026-08-13 06:35 GMT

బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కెరీర్‌ను గమనిస్తే, అది కేవ‌లం ఒక హీరోయిన్ భాషలు మారుస్తున్న జ‌ర్నీలా కనిపించదు. ఆమె సెలెక్ష‌న్స్ చూస్తే, సౌత్ ఇండియ‌న్ మార్కెట్ ను లాంగ్ టైమ్ లో టార్గెట్ పెట్టుకున్న స్ట్రాట‌జీ క‌నిపిస్తుంద‌నే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. తెలుగు సినిమాలతో ప్రారంభమైన ఆమె సౌత్ జ‌ర్నీ, ఇప్పుడు తమిళ కంటెంట్ వైపు మళ్లుతున్నట్లు డిస్క‌ష‌న్ జరుగుతోంది. ఇందులో ముఖ్యంగా ఓటీటీకు ప్రాధాన్యం ఇవ్వడం మరింత ఆసక్తికర అంశంగా మారింది.

తెలుగు సినిమాల్లో స్టార్ హీరోల సరసన కనిపించిన జాన్వీ, సౌత్ ఆడియ‌న్స్ కు తన పరిచయాన్ని వేగంగా విస్తరించుకుంది. కమర్షియల్ సినిమాల ద్వారా మాస్ రీచ్ సాధించిన తర్వాత, ఇప్పుడు తమిళంలో లేడీ ఓరియెంటెడ్ కథతో ఓటీటీ ప్రాజెక్ట్ వైపు అడుగులు వేస్తోందన్న ప్రచారం యాదృచ్ఛికంగా చూడలేమనే అభిప్రాయం వినిపిస్తోంది. ఒకవైపు పెద్ద సినిమాలు, మరోవైపు కంటెంట్ డ్రివెన్ పాత్రలు అనే రెండు ట్రాక్‌లపై కెరీర్‌ను నిర్మించుకునే ప్రయత్నంగా దీనిని విశ్లేషిస్తున్నారు.

తమిళ ఓటీటీలో గత కొంతకాలంగా లేడీ ఓరియెంటెడ్ స్టోరీల‌కు మంచి ఆదరణ పెరుగుతోంది. గ్రామీణ నేపథ్యాలు, సామాజిక అంశాలు, అణగారిన వర్గాల జీవితాల చుట్టూ తిరిగే కథలు ఆడియ‌న్స్ లో డిస్క‌ష‌న్ కు దారి తీస్తున్నాయి. అలాంటి వాతావరణంలో స్టార్ హీరోయిన్ ఒక ఉమెన్ సెంట్రిక్ స్టోరీని ఎంచుకోవడం, కేవలం మార్కెట్ విస్తరణ మాత్రమే కాకుండా నటిగా తన పరిధిని పెంచుకునే ప్రయత్నంగా కూడా కనిపిస్తోంది.

మ‌రో ఇంట్రెస్టింగ్ అంశం తమిళ వెబ్ సిరీస్‌లలో పెరుగుతున్న స్టార్ పవర్. ఒకప్పుడు వెబ్ సిరీస్‌లు కొత్త నటులకు అవకాశాల వేదికగా ఉండేవి. ఇప్పుడు పరిస్థితి మారింది. సినిమా స్టార్‌లు కూడా ఓటీటీ ప్రాజెక్ట్‌లను సమాన ప్రాధాన్యంతో చూస్తున్నారు. కారణం పాత్రల బలం, కథలకు లభించే స్వేచ్ఛ, మరియు పాన్ ఇండియా డిజిటల్ ఆడియ‌న్స్. ఈ మార్పు తమిళ కంటెంట్‌కు కొత్త స్థాయిని తీసుకొస్తోంది.

ఇది జాన్వీ ఒక్కరి కథ కాదు. కియారా అద్వానీ, దీపికా ప‌దుకొణె, తాప్సీ వంటి హీరోయిన్లు కూడా సౌత్ ప్రాజెక్టులపై ఆసక్తి చూపించడం ఈ ట్రెండ్‌కు సంకేతం. సౌత్ ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ల‌కు సెకండ్ మార్కెట్ కాదు, మెయిన్ మార్కెట్ గా మారుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలుగు తర్వాత తమిళం, కమర్షియల్ సినిమా తర్వాత కంటెంట్ ఓరియెంటెడ్ ఓటీటీ, మాస్ రీచ్ తర్వాత యాక్టింగ్ కు ప్రాధాన్యం ఉన్న పాత్రలు.. ఈ క్రమాన్ని చూస్తే జాన్వీ కపూర్ సౌత్ స్ట్రాటజీ ఒక లాంగ్ టర్మ్ ప్లాన్‌లా కనిపిస్తోంది. బాలీవుడ్‌లో కంటిన్యూ అవుతూనే సౌత్ లో బలమైన స్థానం సంపాదించుకోవడం ఆమె అసలు లక్ష్యమా అనే ప్రశ్న ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News