రెమ్యునరేషన్.. జాన్వీ కాస్త తగ్గితే బెటర్

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చిన జాన్వీ కపూర్ వరుసగా భారీ ప్రాజెక్టులనే ఎంచుకుంటోంది.

Update: 2026-06-12 02:15 GMT

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చిన జాన్వీ కపూర్ వరుసగా భారీ ప్రాజెక్టులనే ఎంచుకుంటోంది. దేవర, పెద్ది అంటూ ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలతో ఇక్కడ తన మార్క్ చూపించే ప్రయత్నం చేసింది. అయితే భారీ బడ్జెట్ సినిమాలు, కమర్షియల్ రోల్స్ తో పాటు నటిగా తనను తాను ప్రూవ్ చేసుకునే కథల మీద కూడా ఆమె దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కేవలం స్టార్ హీరోల పక్కన చేస్తే వచ్చే ఇమేజ్ కంటే నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేస్తే వచ్చే గుర్తింపు చాలా కాలం నిలబడుతుంది. ఇప్పటికే తంగం, అచ్చియమ్మ పాత్రలకు పెద్దగా పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు.

అయితే ప్రస్తుతం జాన్వీ తీసుకుంటున్న పారితోషికం 8 కోట్ల వరకు ఉన్నట్లు ఇండస్ట్రీలో ఒక టాక్ నడుస్తోంది. భారీ ప్రాజెక్టులు కాబట్టి ఆ రేంజ్ రెమ్యునరేషన్ ఇవ్వడానికి మేకర్స్ వెనకాడటం లేదు. కానీ చిన్న బడ్జెట్ లో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేయాలంటే మాత్రం ఆమె తన ఫీజును కాస్త తగ్గించుకోక తప్పదు. రేటు విషయంలో పట్టింపులకు పోకుండా క్యారెక్టర్ కు ఉన్న వెయిట్ ను బట్టి డెసిషన్ తీసుకుంటే ఆమె కెరీర్ కు ఎంతో ప్లస్ అవుతుంది.

ఈ విషయంలో మిగతా స్టార్ హీరోయిన్లను చూసి జాన్వీ కొంత నేర్చుకోవాల్సి ఉంది. నేషనల్ క్రష్ గా క్రేజ్ తెచ్చుకున్న రష్మిక మందన్న కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా లేడీ ఓరియెంటెడ్ కథలను కూడా ఎంకరేజ్ చేస్తోంది. గర్ల్ ఫ్రెండ్ లాంటి సినిమా కోసం ఆమె తన పారితోషికాన్ని పక్కనపెట్టి నటిగా కొత్తగా ప్రెజెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. కంటెంట్ నచ్చితే బడ్జెట్ గురించి ఆలోచించకుండా సినిమాలు చేస్తోంది.

అలాగే సమంత ట్రాక్ రికార్డ్ చూసినా ఇదే విషయం అర్థమవుతుంది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు కూడా కేవలం క్యారెక్టర్ నచ్చి, కథలో దమ్ము ఉందనుకున్నప్పుడు ఆమె రెమ్యునరేషన్ తగ్గించుకుని నటించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే సమంతకు నటిగా ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. స్టార్డమ్ తో పాటు యాక్టింగ్ స్కిల్స్ ను బ్యాలెన్స్ చేయడం వల్లే వీళ్ళు ఇండస్ట్రీలో ఇన్నేళ్లుగా టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నారు.

ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతున్న చాలా మంది స్టార్ హీరోయిన్స్ కెరీర్ స్టార్టింగ్ లో చిన్న సినిమాలతోనే యాక్టింగ్ పరంగా ప్రూవ్ చేసుకున్నారు. భారీ ప్రాజెక్టుల్లో హీరోల డామినేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హీరోయిన్లకు నటించడానికి పెద్దగా స్కోప్ దొరకదు. అదే చిన్న సినిమాల్లో అయితే క్యారెక్టర్ చుట్టూ కథ తిరుగుతుంది. జాన్వీ కూడా ఈ ఫార్ములాను ఫాలో అయితే టాలీవుడ్ లో ఆమెకు మరింత మంచి పేరు వచ్చే అవకాశం ఉంది.

ప్రతీసారి భారీ ఆఫర్లు, పాన్ ఇండియా ప్రాజెక్టులు వస్తాయనే గ్యారెంటీ లేదు. అందుకే సౌత్ లో ముఖ్యంగా తెలుగులో మంచి కథలను ఆమె సొంతంగా వెతుక్కోవాలి. కొత్త దర్శకులు చెప్పే స్క్రిప్ట్స్ వినాలి. కంటెంట్ బాగుంటే ఫీజు లాంటి లెక్కలు పక్కనపెట్టి సినిమాలు చేయాలి. అప్పుడే కేవలం ఒక కమర్షియల్ హీరోయిన్ లా కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో లాంగ్ రన్ కొనసాగించగలుగుతుంది.

Tags:    

Similar News