జాన్వీ క‌పూర్ అప్పుడే బ్ర‌హ్మాస్త్రం!

అతిలోక సుందరి శ్రీదేవి తనయగా జాన్వీ కపూర్ దక్షిణాది చిత్ర పరిశ్రమలోకి భారీ అంచనాల మధ్య అడుగు పెట్టింది.;

Update: 2026-04-18 22:30 GMT

అతిలోక సుందరి శ్రీదేవి తనయగా జాన్వీ కపూర్ దక్షిణాది చిత్ర పరిశ్రమలోకి భారీ అంచనాల మధ్య అడుగు పెట్టింది. యంగ్ ఎన్టీఆర్ సరసన `దేవర` సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన అమ్మ‌డికి ఆ చిత్రం ఆశించిన స్థాయిలో మైలేజ్ ఇవ్వలేకపోయిందనేది వాస్తవం. సినిమాలో ఆమె స్క్రీన్ టైమ్ చాలా తక్కువగా ఉండటం, పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో జాన్వీ గ్లామర్ సాంగ్స్‌కే పరిమితమైందన్న విమర్శలు వ్య‌క్త‌మ‌య్యాయి. దీంతో తొలి ప్రయత్నంలోనే జాన్వీ త‌న‌కంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకోవడంలో కొంత తడబడింది.

ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన `పెద్ది` చిత్రంలో జాన్వీ నటిస్తోంది. ఇంత గొప్ప ప్రాజెక్ట్‌లో అమ్మ‌డు భాగ‌మైనా? ఇండస్ట్రీలో ఆమె పేరు అంతగా మారుమ్రోగడం లేదు. సాధారణంగా ఒక స్టార్ కిడ్ సినిమా చేస్తు న్నప్పుడు ఉండే హైప్ జాన్వీ విషయంలో ఎక్క‌డా క‌నిపించడం లేదు. అంతా స్తబ్దుగా ఉంది. షూటింగ్ పూర్తి చేసుకుని సినిమా రిలీజ్ కు రెడీ అవుతున్నా? జాన్వీ హ‌డావుడి ఎక్క‌డా సోష‌ల్ మీడియాలోనూ చ‌ర్చ‌కు రాలేదు. ఈ సినిమా త‌ర్వాత జాన్వీ ఏ హీరోతో న‌టిస్తోంది? అనే చ‌ర్చ ఎక్క‌డా జ‌ర‌గ‌లేదు. క‌నీసం గాసిప్స్ కూడా తావు లేకుండా పోయింది.

ఈ పరిణామాల నేపథ్యంలో జాన్వీ క‌పూర్ ప్రాధాన్యతను పెంచుకునేందుకు కొత్త మార్గాలను వెతుకుతోందా? అనే చ‌ర్చ నెట్టింట మొద‌లైంది. దక్షిణాది ప్రేక్షకులకు చేరువయ్యేందుకు జాన్వీ కపూర్ తన తల్లి శ్రీదేవికి ఉన్న ఎమోషనల్ బాండింగ్‌ను ఓ బ్రహ్మాస్త్రం గా ప్ర‌యోగిస్తుంద‌ని తెలుస్తోంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తన తల్లికి దక్షిణాది సినిమాలంటే ఉన్న గౌరవాన్ని, తమిళ , తెలుగు ప్రేక్షకులు ఆమెను ఏ విధంగా ఆదరించారో పదే పదే గుర్తు చేస్తోంది. రెండు రాష్ట్రాల్లో ఉండే కొన్ని ప్ర‌త్యేక‌మైన పాత్రాల‌ను సైతం ప్ర‌స్తావించింది. అలాగే మామ్ న‌టించిన ఎలాంటి చిత్రాల‌కు ఇక్క‌డ జ‌నాలు ఎక్కువ‌గా క‌నెక్ట్ అయ్యారు? వంటి అంశాల గురించి కూడా మాట్లాడిన‌ట్లు తెలుస్తోంది.

దీంతో శ్రీదేవి వారసురాలిగా ఆ ఎమోషనల్ కనెక్టివిటీని వాడుకోవడం ద్వారా ఇక్కడి ఆడియన్స్ మనసు గెలవాలని జాన్వీ ప్ర‌య‌త్నిస్తుందా? అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే తల్లి పేరు చెప్పుకోవడం , ఎమోషనల్ సెంటిమెంట్ పండించడం ద్వారా సౌత్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంత సుల‌భం కాదు. వ‌ర్కౌట్ అయినా అది ఎంతో కాలం నిల‌బ‌డ‌దు. లాంచింగ్ స‌హా మ‌హా అయితే రెండు..మూడు సినిమాల వ‌ర‌కే .ఆ త‌ర్వాత సొంత ట్యాలెంట్ తో ఎద‌గ‌లేక‌పోతే ప‌ట్టించుకునే ప‌రిస్థితి ఉండ‌దు. ఇప్పటికే అనేక మంది ప్రతిభావంతులైన హీరోయిన్లు పోటీలో ఉన్నారు. వాళ్ల‌ను దాటుకు జాన్వీ క‌పూర్ అవ‌కాశాలు..వాళ్ల‌ను మించిన గొప్ప పెర్పార్మ‌ర్ అని రుజువు చేసుకుంటేనే తెలుగు ఆడియ‌న్స్ బ్ర‌హ్మ‌ర్ధం ప‌ట్టేది. చెట్టు పేరో...కొమ్మ పేరో చెప్పుకుని కొన‌సాగ‌డం అన్న‌ది కొంత కాలమే అన్న‌ది స్టార్ కిడ్స్ గ‌మ‌నించాల్సిన విష‌యం.

Tags:    

Similar News