జాన్వీ కపూర్‌పై విమర్శల వెనుక అసలు కథ ఇదేనా? నార్త్-సౌత్ కల్చర్ క్లాష్!
ఈ వివాదం వెనుక ఒక విచిత్రమైన మైండ్ సెట్ కనిపిస్తోంది. ఒక సిటీ బ్యాక్‌డ్రాప్ సినిమాలో హీరో, హీరోయిన్లు హద్దులు దాటినా దాన్ని "మోడ్రన్ రిలేషన్‌షిప్స్" అంటూ విశ్లేషకులు మెచ్చుకుంటారు.
టాలీవుడ్ బిగ్ మూవీ పెద్ది లో జాన్వీ కపూర్ పోషించిన 'అచ్చియమ్మ' పాత్రపై సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా బాలీవుడ్ క్రిటిక్స్ ఈ పాత్రపై నీతి పాఠాలు చెప్పడం అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. 'యానిమల్'లో రణ్‌బీర్ బట్టల్లేకుండా తిరిగినా, 'అర్జున్ రెడ్డి'లో హీరో బెడ్‌రూమ్ సీన్లు చేసినా రాని అభ్యంతరాలు, ఒక సౌత్ సినిమాలో హీరోయిన్ పైట ఎగరేస్తే ఎందుకు వస్తున్నాయి? ఈ విమర్శల వెనుక అసలు కథేంటి? నార్త్-సౌత్ కల్చరల్ క్లాష్ దీనికి కారణమా? అనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం.
ముంబై గ్లామర్ ఓకే.. పల్లెటూరి రొమాన్స్ తప్పా?:
ఈ వివాదం వెనుక ఒక విచిత్రమైన మైండ్ సెట్ కనిపిస్తోంది. ఒక సిటీ బ్యాక్‌డ్రాప్ సినిమాలో హీరో, హీరోయిన్లు హద్దులు దాటినా దాన్ని "మోడ్రన్ రిలేషన్‌షిప్స్" అంటూ విశ్లేషకులు మెచ్చుకుంటారు. కానీ అదే బోల్డ్‌నెస్ ఒక పల్లెటూరి నేపథ్యంలో, మాస్ ఆడియన్స్ కోసం చూపించినప్పుడు మాత్రం దాన్ని "జుగుప్స" అని ముద్ర వేస్తారు. నగరాల్లో జరిగే శృంగారానికి లేని అభ్యంతరం, పల్లెటూరి రొమాన్స్‌కు ఎందుకు ఉండకూడదనేది ఇక్కడ పెద్ద ప్రశ్న.
బాలీవుడ్ స్టార్ కిడ్.. సౌత్ మాస్ క్యారెక్టర్:
ఇందులో మరో ముఖ్యమైన కోణం ఏమిటంటే, జాన్వీ కపూర్ ఒక బాలీవుడ్ స్టార్ కిడ్. ఆమె ముంబై కల్చర్‌లో గ్లామరస్‌గా ఫోటోషూట్లు చేస్తే ఆహా ఓహో అనే క్రిటిక్స్, సౌత్ రూరల్ కల్చర్‌లోకి వచ్చి పక్కా లోకల్ క్యారెక్టర్‌లో కాస్త ఘాటుగా కనిపించేసరికి తట్టుకోలేకపోతున్నారు. "మా బాలీవుడ్ హీరోయిన్‌ను మీ సౌత్ మాస్ సినిమాల్లో అలా ఎలా చూపిస్తారు?" అనే ఒక రకమైన ఈగో కూడా ఇలాంటి విమర్శల వెనుక ఉందేమో అని టాక్.
గతంలో లేనిది.. ఇప్పుడే కొత్తగా జరిగిందా?:
తెలుగు సినిమాల్లో రొమాన్స్, మాస్ ఎలిమెంట్స్ కొత్తేమీ కాదు. ఇండ్రస్ట్రీ లో దర్శకులు ఎందరో సినిమాల్లో టీనేజ్ యువత మధ్య రొమాన్స్‌ను ఘాటుగానే చూపించారు. సింహాద్రి లో హీరోయిన్ ఒంటి మీద చీమను పరిగెత్తించడం వెనుక ఉన్నది మాస్ వర్గాలను మెప్పించే లక్ష్యమే. ఇక బాలీవుడ్‌లో ఆషిక్ బనాయా ఆప్నే, మస్తీ, గ్రాండ్ మస్తీ వంటి సినిమాల్లో నేరుగా బూతులు, బోల్డ్ కంటెంట్ ఉన్నా అవన్నీ సెన్సార్ దాటుకుని థియేటర్లలో డబ్బులు కురిపించినవే, ఇక గతంలో ఎవరూ చేయనట్టు ఇప్పుడు 'పెద్ది' లోనే ఏదో ఘోరం జరిగిపోయిందని ఎక్స్ హ్యాండిల్స్ నీతులు చెప్పడం నిజంగానే హాస్యాస్పదం.
'పెద్ది' సినిమాలో ఎమ్మెల్యే క్యాండిడేట్ కూతురి పాత్రను అలా చూపించడాన్ని సమర్థించలేం, దర్శకుడు కూడా ఇప్పటికే క్షమాపణ చెప్పారు. కానీ, బాలీవుడ్ క్రిటిక్స్ చేస్తున్న విమర్శలు కేవలం 'సెలెక్టివ్ పబ్లిసిటీ' మరియు సౌత్ సినిమాపై ఉన్న అసహనమే అనిపిస్తోంది. ఇక ఓటిటిలలో బెడ్‌రూమ్ సీన్లు నిత్యకృత్యమైపోయిన ఈ రోజుల్లో, థియేట్రికల్ మాస్ సినిమాలో వచ్చే చిన్న సీన్‌కే ఇంతలా రియాక్ట్ అవ్వడం ముమ్మాటికీ డబుల్ స్టాండర్డ్స్ మాత్రమే. భవిష్యత్తులో రాబోయే సినిమాల్లో ఇలాంటివి రిపీట్ అయినప్పుడు ఇదే క్రిటిక్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.