జాన్వీ కపూర్ పై అక్కసు వెళ్లగక్కిన మలయాళ సింగర్.. వీడియో డిలీట్ చేయడం పై ఫైర్!
అంతేకాదు జాన్వీ కపూర్ తీరుని, ఆమె దుస్తులని విమర్శిస్తూ మాట్లాడడంతో ఈ వీడియో కాస్త నెట్టింట్లో వైరల్ అయింది.;
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఓవైపు నార్త్ సినిమాలతో అలరిస్తూనే.. మరోవైపు సౌత్ సినిమాల్లో కూడా నటిస్తూ దూసుకుపోతుంది. ఇప్పటికే స్టార్ హీరోల సరసన చేస్తూ నటిగా తన కెరీర్ ను బిల్డ్ చేసుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. అయితే జాన్వీ కపూర్ తాజాగా విమర్శలకు గురైంది.ఓ మలయాళ సింగర్ జాన్వీ కపూర్ ని విమర్శించింది. మరి ఇంతకీ జాన్వీ కపూర్ ని విమర్శించిన ఆ సింగర్ ఎవరు? ఎందుకు జాన్వీ కపూర్ ని అవమానించినట్లుగా మాట్లాడింది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
జాన్వీ కపూర్ పై తన అక్కసు వెళ్లగక్కిన పవిత్ర మీనన్..
జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన తాజా మూవీ పరమ్ సుందరి.. ఈ సినిమా ఆగస్టు 29న విడుదల కాబోతోంది. ఇప్పటికే చిత్ర యూనిట్ ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ విడుదల చేయడమే కాకుండా ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. అయితే రీసెంట్ గా ఈ చిత్ర ట్రైలర్ విడుదలయ్యాక మలయాళ నటి, సింగర్ అయినటువంటి పవిత్ర మీనన్ జాన్వీ కపూర్ పై తన అక్కసు వెల్లగక్కింది. దానికి కారణం.. పరమ్ సుందరి మూవీలో ఢిల్లీకి చెందిన అబ్బాయి, మలయాళీ అమ్మాయి మధ్య లవ్ ట్రాక్ ఉంటుంది. అయితే పరమ్ సుందరి మూవీలో జాన్వీ కపూర్ పాత్రలో నటించడానికి మలయాళీ నటి మీకు దొరకలేదా.. మలయాళంలో హీరోయిన్లు లేరా అంటూ సింగర్ పవిత్ర మీనన్ విమర్శించింది. అంతేకాదు పరమ్ సుందరి మూవీలో మలయాళీగా తన భాష వేషధారణతో అద్భుతంగా నటించింది అని చాలామంది జాన్వీ కపూర్ ని మెచ్చుకుంటే పవిత్ర మీనన్ మాత్రం జాన్వీ కపూర్ కంటే మలయాళీ నటి అద్భుతంగా చేసేదని విమర్శించింది.
అభిమాని కోరిక మేరకు వీడియో డిలీట్ చేసిన టెక్నికల్ టీం..
అంతేకాదు జాన్వీ కపూర్ తీరుని, ఆమె దుస్తులని విమర్శిస్తూ మాట్లాడడంతో ఈ వీడియో కాస్త నెట్టింట్లో వైరల్ అయింది. దీంతో జాన్వీ కపూర్ నటనని విమర్శించిన పవిత్ర మీనన్ కి షాకిచ్చారు ఓ మలయాళీ అభిమాని. వెంటనే పవిత్ర మీనన్ పెట్టిన వీడియోని డిలీట్ చేయాలంటూ ఇంస్టాగ్రామ్ లో రిపోర్ట్ చేశారు. అయితే ఆ అభిమాని ఇచ్చిన రిపోర్ట్ కి స్పందించిన టెక్నికల్ టీం జాన్వీని విమర్శిస్తూ పెట్టిన పవిత్ర మీనన్ వీడియోని డిలీట్ చేసారు.
స్క్రీన్ షాట్ తో మళ్లీ వార్తల్లో నిలిచిన పవిత్రమైన..
ఇక ఈ విషయాన్ని పవిత్ర మీనన్ స్వయంగా స్క్రీన్ షాట్ తీసి మళ్లీ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకుంది. ప్రస్తుతం పవిత్ర మీనన్ షేర్ చేసుకున్న స్క్రీన్ షాట్ వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్లు పవిత్ర మీనన్ పై ఫైర్ అవుతున్నారు. ఒక మహిళ అయి ఉండి మరో మహిళని విమర్శిస్తూ మాట్లాడడం ఏమాత్రం సరికాదు అంటూ మండి పడుతున్నారు.
పరమ్ సుందరి సినిమా విశేషాలు..
ఇక పరమ్ సుందరి మూవీ విషయానికి వస్తే.. దినేష్ విజన్ నిర్మాతగా.. తుషార్ జలోటా దర్శకత్వంలో ఆగస్టు 29న వస్తున్న ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ లు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ విడుదలైన సమయంలో చర్చిలో రొమాన్స్ చేసిన సీన్ వైరల్ అవ్వగా ఆ సీన్ తీసేయాలంటూ పెద్ద ఎత్తున క్రిస్టియన్స్ డిమాండ్ చేశారు.