ఫోటో స్టోరి: బ్ర‌హ్మ ఉలి వేసి చెక్కాడా?

అవును.. ఇక్క‌డ అందాల ఆడ బొమ్మ‌ను ఇలా చూడ‌గానే, సాక్షాత్తూ సృష్టిక‌ర్త‌ బ్ర‌హ్మ ఉలి వేసి చెక్కాడా? అనిపించ‌క మాన‌దు.;

Update: 2025-08-21 04:45 GMT

అవును.. ఇక్క‌డ అందాల ఆడ బొమ్మ‌ను ఇలా చూడ‌గానే, సాక్షాత్తూ సృష్టిక‌ర్త‌ బ్ర‌హ్మ ఉలి వేసి చెక్కాడా? అనిపించ‌క మాన‌దు. అంత అందంగా క‌నిపిస్తోంది జాన్వీక‌పూర్. బాలీవుడ్ స్టైల్ ఐకాన్ ల‌లోనే యూనిక్ స్టైల్ తో దూసుకుపోతున్న జాన్వీ క‌పూర్ దుస్తుల ఎంపిక ఎప్పుడూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూనే ఉంటుంది.

జాన్వీ ప్ర‌తి ఎంపిక యువ‌త‌రం దృష్టిని ఆక‌ర్షిస్తుంది. ఇప్పుడు అతిలోక సుంద‌రి గారాల త‌న‌య‌ అంద‌మైన ఫ్లోర‌ల్ ఫ్రాక్‌లో ఎంతో అందంగా త‌న‌ను తాను ప్రెజెంట్ చేసుకుంది. హాఫ్ షోల్డ‌ర్ ఫ్రాక్ లో జాన్వీ అంద‌చందాలు మ‌తులు చెడ‌గొడుతున్నాయి. ఇది చిట్టి పొట్టి మిడీ డ్రెస్ కాదు. ప్ర‌త్యేకంగా డిజైన్ చేసిన అంద‌మైన ఫ్రాక్. దీనిని ధ‌రించి స్టూడియోలో జాన్వీ చిరున‌వ్వులు చిందిస్తూ ఫోజులిచ్చిన తీరు ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌స్తుతం ఈ స్పెష‌ల్ ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా దూసుకెళుతోంది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే, జాన్వీక‌పూర్ ప్ర‌స్తుతం హిందీ-తెలుగు ప‌రిశ్ర‌మ‌ల్లో బిజీ క‌థానాయిక‌. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న బుచ్చిబాబు దర్శ‌క‌త్వం వ‌హిస్తున్న క్రీడా నేప‌థ్య చిత్రం `పెద్ది`లో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇందులో విలేజీ అమ్మాయిగా జాన్వీ న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌నుంది. మ‌రోవైపు బాలీవుడ్ లో ప‌రమ్ సుంద‌రి త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. సిద్ధార్థ్ మ‌ల్హోత్రా ఈ చిత్రంలో క‌థానాయ‌కుడిగా న‌టించాడు. ఇటీవ‌లే ప‌ర‌మ్ సుంద‌రి ట్రైల‌ర్ విడుద‌లై వెబ్ లో దూసుకెళ్లింది. కొన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా జాన్వీలోని ఈజ్, సిద్ధార్థ్ తో ల‌వ్వాయ‌ణం, రొమాన్స్ ఈ సినిమా ఫ‌లితాన్ని కాపాడతాయ‌నే భావిస్తున్నారు.

Tags:    

Similar News