• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జనక అయితే గనక రిలీజ్...

జనక అయితే గనక రిలీజ్ ట్రైలర్.. ఎలా ఉందంటే..

| సుహాస్ హీరోగా సందీప్ బండ్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘జనక అయితే గనక’ మూవీ అక్టోబర్ 11న థియేటర్స్ లోకి రాబోతోంది.

By - Tupaki Desk
Update: 2024-10-09 06:27 GMT

సుహాస్ హీరోగా సందీప్ బండ్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘జనక అయితే గనక’ మూవీ అక్టోబర్ 11న థియేటర్స్ లోకి రాబోతోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ ‘వేట్టయన్’ సినిమాకి పోటీగా సుహాస్ మూవీ రిలీజ్ కాబోతూ ఉండటం విశేషం. అయితే నిర్మాత దిల్ రాజు మాత్రం ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కచ్చితంగా ఈ చిత్రం మంచి కమర్షియల్ సక్సెస్ అందుకుంటుందని భావిస్తున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్ర కథాంశం ఉండబోతోంది.


ఇదిలా ఉంటే ఇప్పటికే ‘జనక అయితే గనక’ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. పిల్లలకి గొప్ప లైఫ్ ఇవ్వాలని ఆశపడే ఒక మిడిల్ క్లాస్ యువకుడిగా సుహాస్ ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. సినిమాలో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ప్రీరిలీజ్ ట్రైలర్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు.

ఈ మధ్యకాలంలో ప్రతి సినిమా నుంచి రెండు ట్రైలర్స్ రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ కి రెండు, మూడు రోజుల ముందు ఇంటరెస్టింగ్ ట్రైలర్ ని మేకర్స్ విడిచిపెడుతున్నారు. ఈ ట్రైలర్ తో సినిమాపై హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ‘జనక అయితే గనక’ ప్రీరిలీజ్ ట్రైలర్ కూడా యునిక్ ప్రెజెంటేషన్ తో ఉంది. కోర్టు సీన్ ద్వారా ట్రైలర్ ని స్టార్ట్ చేశారు. తరువాత సుహాస్ జాబు ఇంటర్వ్యూకి అటెండ్ కావడం చూపించారు. ఆపై వెన్నెల కిషోర్ సీన్ తో బార్ సీక్వెన్స్ ని ప్రెజెంట్ చేశారు.

తరువాత హీరో, హీరోయిన్ మధ్యలో పిల్లల కోసం జరిగే ఫ్యామిలీ డ్రామా ఎపిసోడ్స్ చూపించారు. ఆపై హీరోయిన్ ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని రివీల్ చేశారు. అక్కడి నుంచి కథని కోర్టు రూమ్ డ్రామాలోకి తీసుకొని వెళ్ళారు. హీరో పిల్లలు కనకపోవడానికి, కోర్టుకి రూమ్ కి మధ్య లింక్ ఏంటి అనేది ఇంటరెస్టింగ్ గా ఈ మూవీ కథనం నేరేట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో కామెడీ ఎంటర్టైన్మెంట్ కథలకి తెలుగులో మంచి ఆదరణ లభిస్తోంది.

ఈ నేపథ్యంలో ‘జనక అయితే గనక’ మూవీ కూడా కచ్చితంగా ప్రేక్షకులని మెప్పిస్తుందని భావిస్తున్నారు. కంటెంట్ కూడా కొత్తగా ఉండటంతో దసరా ఫెస్టివల్ కి ఫ్యామిలీ ఆడియన్స్ ని మూవీ కచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాకి విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ అందించారు. హర్షిత్ రెడ్డి, హన్సిత రెడ్డి దిల్ రాజు ప్రొడక్షన్స్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు

Full View
Tags:    
  • Suhass 
  • Dilraju 
  • Svc 
  • Janakaayiteganaka 
  • Trailer 
  • Gorrepuranam 
  • Familymovie 
  • Tollywood 
  • Filmindustry 

Similar News

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

Copyright @2026

Powered by Blink CMS