బాలయ్య మూవీ ట్రెండింగ్‌కు కారణం అదే!
అనిరావిపూడి డైరెక్షన్‌లో నందమూరి బాలకృష్ణ నటించిన మూవీ ఇది. 2023లో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.;
దళపతి విజయ్ కథానాయకుడిగా నటించిన భారీ యాక్షన్ డ్రామా `జన నాయకుడు`. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ భారీ స్థాయిలో ప్రారంభించారు. జనవరి 9న భారీగా రిలీజ్ కాబోతోంది. హీరో విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన అనంతరం విడుదలవుతున్న సినిమా కావడం, విజయ్ చివరి సినిమా కావడంతో `జన నాయకుడు` హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ టైమ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో బాలయ్య సినిమా ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో నందమూరి బాలకృష్ణ నటించిన మూవీ ఇది. 2023లో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తొలి సారి బాలయ్య తన వయసుకు తగ్గ పాత్రలో నటించడం, క్యారెక్టర్ పవర్‌ఫుల్‌గా సాగడంతో ఫ్యాన్స్ ఎంజాయ్‌చేశారు. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించారు. రెండేళ్ల క్రితం విడుదలైన ఈ మూవీ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్‌ప్రైమ్ వీడియోలో టాప్‌లో ట్రెండ్ అవుతుండటం చర్చనీయాంశంగా మారింది. కారణం విజయ్ `జన నాయకుడు`.
విజయ్ నటించిన చివరి సినిమా ఇది. ఈ మూవీ బాలయ్య 'భగవంత్ కేసరి'కి రీమేక్ అని గత కొన్ని రోజులుగా వార్తలు షికారు చేసిన విషయం తెలిసిందే. దీనిపై రెండు చిత్రాలకు సంబంధించిన దర్శకులు ఒకే విధంగా స్పందించి సస్పెన్స్‌కు తెరదించకపొవడంతో ఆ ప్రచారం కంటిన్యూ అవుతూ వచ్చింది. అయితే సినిమా రిలీజ్ నేపథ్యంలో విడుదల చేసిన ట్రైలర్ `జన నాయకుడు` పక్కాగా తెలుగు హిట్ ఫిల్మ్ `భగవంత్ కేసరి` రీమేక్ అంటూ క్లారిటీ ఇచ్చేసింది.
దీంతో ప్రేక్షకులు రెండు సినిమాల మధ్య ఉన్న పోలికలని నిశితంగా పరిశీలిస్తున్నారు. కొంత మంది ఎలాంటి మార్పులు చేయకుండా కాపీ చేశారని కామెంట్‌లు చేస్తుంటే మరి కొంత మంది మాత్రం కొన్ని మార్పులు చేసినప్పటికీ రెండు సినిమాల మధ్య ఎలాంటి వ్యత్యాసం కనిపించడం లేదంటున్ఆరు. అయితే బాలయ్య క్యారెక్టర్‌ని మలిచిన తీరు, ఆ స్వాగ్ మాత్రం ఇందులో మిస్ అయిందని, ఆ విషయంలో `జన నాయకుడు` వెనకబడ్డాడని సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు.
విజయ్ పోలిటికల్ ఎంట్రీకి ఉపయోగపడే విధంగా కథలో మార్పులు చేశారని, అదే విధంగా పొలిటికల్ పంచ్‌లు బాగా దట్టించారని, కోర్ స్టోరీలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదని నెట్టింట పెద్ద చర్చ జరుగుతోంది. `భగవంత్ కేసరి` చూడని వాళ్లు `జన నాయకుడు` కోసం ఎదురు చూస్తున్న వాళ్లు ఇప్పుడు `భగవంత్ కేసరి`ని ఓటీటీలో తెగ చూసేస్తున్నారు. దీంతో ఈ మూవీ ట్రెండింగ్‌లో టాప్‌లో నిలిచింది. 2023 అక్టోబర్‌లో విడుదలై `భగవంత్ కేసరి` 71వ జాతీయ పురస్కారాల్లో ఉత్తమ తెలుగు సినిమా విభాగంలో అవార్డుని దక్కించయుకున్న విషయం తెలిసిందే.