సూపర్ స్టార్ మూవీలో డర్టీ పిక్చర్..!
జైలర్ 2 సినిమా గురించి రోజుకో వార్త చొప్పున వైరల్ అవుతోంది. అదుగో ఇదుగో అంటూ జైలర్ 2 సినిమాకి హైప్ పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి.;
తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందిన కూలీ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ రూపొందిన కూలీ సినిమా కమర్షియల్‌గా పర్వాలేదు అనిపించుకుంది. కానీ అభిమానుల అంచనాలను అందుకోలేదు అంటూ విమర్శలు ఎదుర్కొంది. అంతే కాకుండా తమిళ బాక్సాఫీస్ వద్ద కాకుండా ఇతర బాక్సాఫీస్ వద్ద సినిమా పెద్దగా ఆడలేదు. అంతే కాకుండా రజనీకాంత్ ఫ్యాన్స్ సైతం ఇదెక్కడి మూవీ అంటూ లోకేష్ కనగరాజ్ ను విమర్శించారు. లోకేష్ కనగరాజ్ మార్క్ ఈ సినిమాలో కనిపించలేదు అంటూ చాలా మంది చాలా రకాలుగా విమర్శించారు. ఈ విషయమై రజనీకాంత్ సైతం ఒకింత అసంతృప్తితో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. రజనీకాంత్ అభిమానులను సంతృప్తి పరచే విధంగా జైలర్ 2 రాబోతుందని తమిళ మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
రజనీకాంత్ జైలర్ సినిమా...
నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా వచ్చిన జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. చాలా కాలం తర్వాత రజనీకాంత్ నుంచి ఒక మంచి సాలిడ్ మూవీ వచ్చిందని అభిమానులు అనుకున్నారు. జైలర్ రాకుంటే ఖచ్చితంగా సినిమాలకు రజనీకాంత్ గుడ్ బై చెప్పేవాడు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో జైలర్ సినిమాకు సంబంధించిన డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కామెడీ సీన్స్ ఇలా ప్రతి ఒక్కటీ బాగా వైరల్ అయ్యాయి. అందుకే జైలర్ కి సీక్వెల్‌ను తీసుకు రావాలని దర్శకుడు నెల్సన్ దిలీప్ నిర్ణయించుకున్నాడు. అప్పటి నుంచి సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ఎప్పటిలాగే ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి.
శివ రాజ్ కుమార్ మరోసారి...
జైలర్ 2 సినిమా గురించి రోజుకో వార్త చొప్పున వైరల్ అవుతోంది. అదుగో ఇదుగో అంటూ జైలర్ 2 సినిమాకి హైప్ పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జైలర్ 2 లో ప్రముఖ నటీ నటులు చాలా మంది కనిపించబోతున్నారు. అంతే కాకుండా స్టార్ కాస్ట్‌ను పెంచడం కోసం స్టార్స్‌ను, సూపర్ స్టార్స్‌ను ఈ సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ సమాచారం అందుతోంది. మొదటి పార్ట్‌లో ఉన్న సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ఈ సినిమాలో నటించబోతున్నాడు అంటున్నారు. అంతే కాకుండా మిర్నా మీనన్, రమ్యకృష్ణ, యోగి బాబుతో పాటు ప్రముఖ నటీ నటులు కొందరు స్టార్స్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గెస్ట్ అప్పియరెన్స్ గురించి ప్రస్తుతం ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఖచ్చితంగా అంతా సర్‌ప్రైజ్ అవుతారని అంటున్నారు.
జైలర్ 2 లో విద్య బాలన్..
కోలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యా బాలన్ కనిపించబోతుంది. డర్టీ పిక్చర్ సినిమాతో సౌత్‌లోనూ విద్యా బాలన్‌కి మంచి గుర్తింపు దక్కింది. అందుకే జైలర్ 2 లో ఆమె నటిస్తే ఖచ్చితంగా సినిమా స్థాయి అమాంతం పెరగడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ మధ్య కాలంలో విద్యా బాలన్ కాస్త తక్కువ సినిమాలు చేస్తుంది. ఇలాంటి సమయంలో సౌత్ సినిమాను ఆమె కమిట్ అయిందా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ సినిమాలో ఆమె ఉంటే ఖచ్చితంగా బజ్ అమాంతం పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.