జై హనుమాన్.. వర్మ సెలెక్షన్ వర్త్ మామ వర్తూ!
హనుమాన్ మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ.. ఇప్పుడు తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం జై హనుమాన్.
హనుమాన్ మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ.. ఇప్పుడు తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం జై హనుమాన్. ఆ సినిమాకు సంబంధించి ఒక్కో అప్డేట్ బయటకు వస్తున్న కొద్దీ అంచనాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా క్యాస్టింగ్ సెలక్షన్ చూస్తే.. ప్రశాంత్ వర్మ ఆ ప్రాజెక్టును ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేశారో అర్థమవుతోందని టాక్ వినిపిస్తోంది.
సినిమా హనుమంతుడి పాత్రలో కన్నడ నటుడు రిషబ్ శెట్టి కనిపించనున్నారు. కాంతారతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రిషబ్.. డివోషనల్, ఎమోషన్స్ ఎలిమెంట్స్ తో కూడిన పాత్రలను ఎంతో నేచురల్ గా చూపించగల నటుడిగా ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నారు. అలాంటి యాక్టర్ మూవీలో హనుమంతుడి పాత్రలో కనిపించనున్నాడనే విషయం సినిమాకు ఫస్ట్ స్ట్రెంత్ గా మారింది.
మరోవైపు హనుమాన్ సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకున్న తేజ సజ్జ రోల్ ను జై హనుమాన్ లో కూడా వర్మ కొనసాగించనున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఆయన రోల్ కు ఉన్న ఇంపార్టెన్స్ దృష్ట్యా, ఈసారి మరింత పెద్ద బాధ్యతతో కనిపించే అవకాశముందని అభిమానులు భావిస్తున్నారు. ఇక రానా దగ్గుబాటి ఎంట్రీ ఆ ప్రాజెక్టుకు మరో పెద్ద ఆకర్షణగా మారింది. అధికారికంగా ఆయన రోల్ ను ఇంకా ప్రకటించకపోయినా, కథలో అత్యంత కీలకమైన పాత్రలో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది.
హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఏ పాత్రలో అయినా అదరగొట్టే రానా సినిమాకు స్పెషల్ అసెట్ గా మారతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, భారీ పర్సనాలిటీని పౌరాణిక కథలకు బాగా సరిపోతాయని అభిమానులు భావిస్తున్నారు. ఇక్కడే ప్రశాంత్ వర్మ ఆలోచన క్లియర్ గా కనిపిస్తోందని అనేక మంది సినీ ప్రియులు అంటున్నారు.
ఒకవైపు పౌరాణిక పాత్రలకు నేచురాలిటీ తీసుకురాగల రిషబ్, మరోవైపు తన యూనివర్స్ కు పరిచయమైన తేజ, ఇంకోవైపు పవర్ ఫుల్ స్క్రీన్ ఇంపాక్ట్ ఉన్న రానా.. ఇలా ముగ్గురు విభిన్న శైలుల నటులను ఒకే కథలో కలపడం సూపర్ అనే చర్చ జరుగుతోంది. హనుమాన్ తర్వాత దాదాపు రెండేళ్లపాటు స్క్రిప్ట్ పై ప్రశాంత్ వర్మ పనిచేసినట్లు సమాచారం. అందుకే క్యాస్టింగ్ సెలక్షన్ లో కూడా ఆయన ఎలాంటి రాజీ పడలేదని తెలుస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఆ సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూళ్లు ఇప్పటికే పూర్తవగా, అన్ని పనులు అనుకున్నట్లే సాగితే 2027 సెకండాఫ్ లో మూవీని విడుదల చేయాలనే ప్రణాళిక ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా జై హనుమాన్ పై అంచనాలు పెరగడానికి కారణం భారీ బడ్జెట్ లేదా విజువల్స్ మాత్రమే కాదు. క్యాస్టింగ్ ఎంపిక చేయడంలో ప్రశాంత్ వర్మ చూపిస్తున్న ఆలోచనే సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ గా మారుతోంది. అందుకే ప్రశాంత్ వర్మ సెలెక్షన్ వర్త్ మామ వర్తూ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.