క్రియేటివ్ ప్రమోషన్స్‌తో 'సహా' వైరల్!
ఇదే ట్రెండ్‌ను మరోసారి వినూత్నంగా ఉపయోగించుకుంటోంది సహా మూవీ టీమ్. తమ ఫస్ట్ సింగిల్ అనౌన్స్‌మెంట్‌ను సాధారణ పోస్టర్‌తో కాకుండా, ఫుల్ ఎంటర్టైనింగ్ కాన్సెప్ట్ వీడియోతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం సినిమా కంటెంట్‌తో పాటు ప్రమోషన్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రధాన అంశంగా మారాయి. పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు మాత్రమే కాకుండా, సోషల్ మీడియా కోసం స్పెషల్ గా రూపొందిస్తున్న క్రియేటివ్ కాన్సెప్ట్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఇదే ట్రెండ్‌ను మరోసారి వినూత్నంగా ఉపయోగించుకుంటోంది సహా మూవీ టీమ్. తమ ఫస్ట్ సింగిల్ అనౌన్స్‌మెంట్‌ను సాధారణ పోస్టర్‌తో కాకుండా, ఫుల్ ఎంటర్టైనింగ్ కాన్సెప్ట్ వీడియోతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సాధారణంగా సాంగ్ రిలీజ్ డేట్‌ను పోస్టర్ లేదా మోషన్ పోస్టర్ రూపంలో అనౌన్స్ చేస్తారు. కానీ సహా టీమ్ ఓ సరదా స్కిట్‌ను రూపొందించింది. అందులో హీరో, హీరోయిన్, డైరెక్టర్ కలిసి మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్రను ట్యూన్ ఎక్కడ? అంటూ సరదాగా బెదిరిస్తూ కనిపిస్తారు. ఆ క్రమంలోనే ఈ సాంగ్ కు పలు హిట్ సాంగ్స్ కు లిరిక్స్ అందించిన పూర్ణచారి రాశారని, అనురాగ్ కులకర్ణి పాడారని ఎంతో నేచురల్ గా రివీల్ చేసే విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఒక అనౌన్స్‌మెంట్ ను కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌గా మార్చి చెప్పవచ్చని ఈ టీమ్ నిరూపించింది.
ఒకే వీడియోలో కామెడీ, ప్రమోషన్, మ్యూజిక్ టీమ్ ఇంట్రడక్షన్, రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్.. ఇవన్నీ సమతూకంగా చూపించడం విశేషం. అందుకే ఈ ప్రమోషనల్ కాన్సెప్ట్‌పై నెటిజన్ల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ డిఫరెంట్ ప్రమోషనల్ వీడియోతో జూలై 16 ఉదయం 10 గంటలకు విడుదల కానున్న సహా ఫస్ట్ సాంగ్ పై ఇప్పటికే ఆసక్తి నెలకొంది.
ముఖ్యంగా మెలోడీలకు పేరుగాంచిన శేఖర్ చంద్ర, ఎమోషన్స్ ను తన గొంతులో పలికించే అనురాగ్ కులకర్ణి కలయిక ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి కనిపిస్తోంది. నిషాంత్ దర్శకత్వంలో రూపొందుతున్న సహా సినిమాలో కుమార్ కాసారం, శ్వేత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సుమైరా స్టూడియోస్ బ్యానర్‌పై తేజా వేల్పుచర్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమా రిలీజ్ కు ఇంకా టైమ్ ఉన్నప్పటికీ, ప్రమోషన్స్ విషయంలో మాత్రం టీమ్ వినూత్న ఆలోచనలతో ముందుకు సాగుతోంది.
ప్రస్తుతం డిజిటల్ యుగంలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం అంత సులభం కాదు. అలాంటిది కొత్త కాన్సెప్ట్స్‌తో ప్రమోషన్స్ చేయడం సినిమాకు మంచి బజ్‌ను తీసుకురావడంలో కీలకంగా మారుతోంది. ఆ దిశగా సహా టీమ్ వేసిన ఈ క్రియేటివ్ స్టెప్ సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకుంటుండగా, రాబోయే రోజుల్లో ఈ సినిమా ప్రమోషన్స్ ఇంకెంత కొత్తగా ఉండబోతాయో అనే ఆసక్తిని కూడా పెంచుతోంది.