మెగాస్టార్ మైండ్ లో ఏముంది? ఆయన ప్లానేంటి?
మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రాల రిలీజ్ విషయంలో ఇంకా క్లారిటీ లేని సంగతి తెలిసిందే. ఇప్పటికే విశ్వంభర షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.
మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రాల రిలీజ్ విషయంలో ఇంకా క్లారిటీ లేని సంగతి తెలిసిందే. ఇప్పటికే విశ్వంభర షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. కొన్ని నెలలుగా టీమ్ గ్రాఫిక్స్ పనుల్లోనే నిమగ్నమేందిజ రిలీజ్ విషయంలో రకరకాల ప్రచారం జరుగుతోంది? తప్ప ఎప్పుడు రిలీజ్ అవుతుందన్నది క్లారిటీ లేదు. దసరా పండగ నేపథ్యంలో 'విశ్వంభర' రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయని బలంగా వినిపిస్తోంది. దర్శక, నిర్మాతలు కూడా అదే సరైన సమయంగా భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే చిరంజీవి 158వ సినిమా కూడా సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. అదే జరిగితే? ఈ రెండు సినిమాలకు మధ్య నాలుగు నెలల గ్యాప్ ఉంటుంది.
అయితే రిలీజ్ నిర్ణయాలు దర్శక, నిర్మాతల చేతుల్లోనే లేదనేది అంతే వాస్తవం. నేటి సినీ ప్రపంచంలో ఓటీటీ వేదికల ప్రభావం ఉంది. సినిమా నిర్మాణ దశ నుండే డిజిటల్ రైట్స్ , థియేట్రికల్ విండోస్ గురించి ఒప్పందాలు జరుగుతున్నాయి. ఓటీటీ సంస్థలు కేటాయించే స్లాట్లు, బాక్సాఫీస్ వద్ద ఇతర భారీ చిత్రాల రాక, డిజిటల్ స్ట్రీమింగ్‌కు అనువైన గ్యాప్‌లను పరిగణనలోకి తీసుకుని మాత్రమే విడుదల తేదీలను ఖరారు చేయాల్సి ఉంటుంది.
ఇక్కడ చిరంజీవి వ్యక్తిగత నిర్ణయం అత్యంత కీలకం. తన కెరీర్ గ్రాఫ్‌ను, బాక్సాఫీస్ వద్ద తన క్రేజ్‌ను బ్యాలెన్స్ చేయడంలో ఆయనకు దశాబ్దాల అనుభవం ఉంది. 'విశ్వంభర' వంటి గ్రాఫిక్స్ ప్రధాన చిత్రానికి ఎంతటి ప్రమోషన్ అవసరమో? 158వ చిత్రానికి అంతటి కమర్షియల్ హంగులు? అవసరమని అన్నయ్య భావిస్తున్నారు. వరుసగా రెండు పెద్ద సినిమాలు పండగ సీజన్లలో రావడం వల్ల కలిగే లాభనష్టాలను ఆయన క్షుణ్ణంగా విశ్లేషించు కుంటారన్నది అంతే వాస్తవం.
నిర్మాతలు వాణిజ్య కోణంలో ఆలోచిస్తే.. మెగాస్టార్ కంటెంట్ .. క్వాలిటీ కోణంలో నిర్ణయాలు తీసుకుంటారు. రెండు విడుదలల మధ్య తగినంత విరామం లేకపోతే ప్రమోషన్ల భారం పెరగడమే కాకుండా ప్రేక్షకులు కూడా ఒకేసారి రెండు చిత్రాల విషయంలో అలసిపోయే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో షూటింగ్ పూర్తి చేయడం కంటే? సరైన రిలీజ్ విండోను ఎంచుకోవడంపై చిరంజీవి మేనేజ్‌మెంట్ టీమ్ దృష్టి సారించే అవకాశం ఉంది. ఓటీటీ నిబంధనలకు అనుగుణంగా డేట్స్ సెట్ చేయడం అనేది అగ్నిపరీక్షగా మారే ఛాన్స్ లేకపోలేదు.
గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో రిలీజ్ క్యాలెండర్ మొత్తం మారిపోయింది. ఒకప్పుడు నిర్మాతలే నిర్ణయించే తేదీలు, ప్రస్తుతం థియేటర్ల లభ్యత , ఓటీటీ ఒప్పందాల ప్రకారం మారుతున్నాయి. సంక్రాంతి వంటి పెద్ద సీజన్‌లో 158వ చిత్రాన్ని నిలపడం ద్వారా మెగాస్టార్ న మార్కెట్‌ను పదిలపరుచుకోవాలని చూస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో పోటీ కూడా తీవ్రంగా ఉంది. దీంతో ఏ స్టార్ అయినా పోటీ పడటం కంటే? ఆరోగ్య కరమైన వాతావరణంలోనే రిలీజ్ చేసుకుంటున్నారు. మరి ఈ రెండు పండగల పోటీ నడుమ మెగాస్టార్ మనసులో అసలేముంది? అన్నది తెలియాల్సి ఉంది.