ప్రశాంత్ వర్మ 'మహాకాళి'.. పెద్ద ప్లస్ పాయింట్ ఇదే..
ఇప్పుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి వస్తున్న మహాకాళి మూవీ విషయంలో కూడా ఇదే అంశం స్పెషల్ అట్రాక్షన్ గా మారుతోంది.
ఒక సినిమా కథ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా.. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ఎలిమెంట్స్ లో విజువల్ ఎక్స్పీరియెన్స్ కూడా ఇప్పుడు కీలకంగా మారింది. ముఖ్యంగా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న సినిమాలకు ఐమ్యాక్స్, 3డీ వంటి ఫార్మాట్లు ఎక్స్ ట్రా స్ట్రెంత్ గా నిలుస్తున్నాయి. ఇప్పుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి వస్తున్న మహాకాళి మూవీ విషయంలో కూడా ఇదే అంశం స్పెషల్ అట్రాక్షన్ గా మారుతోంది.
హనుమాన్ మూవీతో భారీ విజయాన్ని అందుకున్న ప్రశాంత్ వర్మ.. తన సినిమాటిక్ యూనివర్స్ ను మరింత ఎలబొరేట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. అందులో భాగంగా రూపొందుతున్న మహాకాళి ప్రస్తుతం చివరి దశ షూటింగ్ లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే 125 రోజుల పాటు షూటింగ్ పూర్తయిందని, కీలక నటులు అక్షయ్ ఖన్నా, రోహిత్ సరాఫ్ తమ పాత్రలకు సంబంధించిన షూటింగ్ ను కంప్లీట్ చేశారని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే రిలీజ్ డేట్ తోపాటు మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నట్లు తెలిపింది.
అయితే ఆ అప్డేట్ లో ఎక్కువగా చర్చకు వస్తున్న అంశం మాత్రం ఐమ్యాక్స్ ఫార్మాట్ లో షూటింగ్. సాధారణంగా పురాణ నేపథ్యం, భారీ విజువల్ ఎఫెక్ట్స్, సూపర్ హీరో ఎలిమెంట్స్ ఉన్న సినిమాలను బిగ్ స్క్రీన్ పై చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంటుంది. అలాంటి ఎక్స్పీరియన్స్ ను మరింత గ్రాండ్ గా అందించాలనే ఉద్దేశంతో మహాకాళిని ఐమ్యాక్స్ లో రూపొందిస్తున్నారు. ఇదే సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మహాకాళి కేవలం మరో సూపర్ హీరో సినిమా మాత్రమే కాదు. లేడీ ఓరియెంటెడ్ లీడ్ రోల్ లో దైవిక శక్తి నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఆ చిత్రానికి పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తుండగా.. కథ, స్క్రీన్ ప్లేను ప్రశాంత్ వర్మ అందిస్తున్నారు. టైటిల్ రోల్ లో భూమి శెట్టి నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా శుక్రచార్య పాత్రలో కనిపించనున్నారు. రోహిత్ సరాఫ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ప్రశాంత్ వర్మ మార్క్ విజువల్స్, డార్క్ టోన్, దేవతా నేపథ్యంతో కూడిన ప్రెజెంటేషన్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. భూమి శెట్టి లుక్, అక్షయ్ ఖన్నా విలన్ గెటప్ కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ యూనివర్స్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో ఆ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి.
అలాంటి సమయంలో కథ, విజువల్స్ తో పాటు ఐమ్యాక్స్ ఫార్మాట్ లో సినిమాను తీసుకురావడం ప్రేక్షకులకు కొత్త ఎక్స్పీరియన్స్ ను అందించే ప్రయత్నమని చెప్పాలి. ఇప్పుడు షూటింగ్ లాస్ట్ స్టేజ్ కు చేరుకోవడంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ మహాకాళి మూవీపై అంచనాలు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.