జెర్సీ డిజాస్టర్ అవుతుందని రిజెక్ట్ చేశాడట
టాలీవుడ్‌లో నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన జెర్సీ సినిమాకి ప్రత్యేక స్థానం ఉంది. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో ఫాదర్ సన్ ఎమోషన్‌తో తెరకెక్కిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.;
టాలీవుడ్‌లో నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన జెర్సీ సినిమాకి ప్రత్యేక స్థానం ఉంది. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో ఫాదర్ సన్ ఎమోషన్‌తో తెరకెక్కిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. నాని, శ్రద్ధా శ్రీనాథ్ నటన సినిమాకి బలమయ్యాయి. ఓ వర్గం యూత్ ఆడియెన్స్‌లో ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చినా, బాక్సాఫీస్ వద్ద మాత్రం పెద్ద స్థాయిలో విజయం సాధించలేకపోయింది.
ఇక బాలీవుడ్‌లో షాహిద్ కపూర్ తో రీమేక్‌గా వచ్చిన జెర్సీ అక్కడ డిజాస్టర్‌గా నిలిచింది. హిందీలో కూడా అదే ఎమోషన్, అదే కథనం రిపీట్ చేసినా, ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపలేదు. తెలుగు వెర్షన్‌లో ఓ వర్గం ఆడియెన్స్‌ను బలంగా కనెక్ట్ చేసిన ఈ కథ, హిందీలో మాత్రం విఫలమైంది. అయినప్పటికీ జెర్సీ సినిమాకు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు.
ఇలాంటి క్లాసిక్ మూవీలో నటించే అవకాశం తనకు కూడా వచ్చిందని ఇటీవల ఒక షోలో జగపతి బాబు వెల్లడించారు. నాని అతిథిగా హాజరైన ఆ షోలో జగ్గూభాయ్ ఓ ఆసక్తికరమైన విషయం షేర్ చేశారు. ఆయన చెప్పిన విషయమే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
జగపతి బాబు మాట్లాడుతూ “జెర్సీ సినిమా డిజాస్టర్ అవుతుందని నాకు అనిపించింది. గౌతమ్ తిన్ననూరి ఆ చిత్రంలో సత్యరాజ్ పోషించిన పాత్రకు మొదట నన్నే సంప్రదించారు. కానీ కథపై నాకంత నమ్మకం రాలేదు. అందుకే ఆ పాత్ర చేయలేదని చెప్పాను. కానీ సినిమా రిలీజ్ అయ్యాక చూసాక ఆశ్చర్యపోయాను. అప్పటినుంచి ఎందుకు రిజెక్ట్ చేశానా అని ఇప్పటికీ బాధపడుతుంటాను” అని తెలిపారు.
అలాగే ఇకపై నాని సినిమాల విషయంలో ఎలాంటి అవకాశమొచ్చినా వదులుకోనని కూడా ఆయన స్పష్టం చేశారు. “అది నాని నటించే సినిమా అయినా, నాని నిర్మించే సినిమా అయినా తప్పకుండా చేస్తా. ఎందుకంటే జెర్సీ రిజెక్ట్ చేసిన తప్పు మళ్లీ చేయకూడదు” అని జగ్గూభాయ్ నేరుగా చెప్పారు. హీరోగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన జగపతి బాబు, లెజెండ్ తరువాత విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొత్త ఇమేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు టీవీ హోస్ట్‌గా కూడా తన మూడవ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు.