ఈసారి సినిమా తీస్తే ఏం కట్ చేస్తావ్ బుచ్చిబాబు?

సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బుచ్చిబాబు సానా.. తనకంటూ ఒక సెపరేట్ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు.

Update: 2026-06-12 07:47 GMT

సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బుచ్చిబాబు సానా.. తనకంటూ ఒక సెపరేట్ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. అతను రాసుకునే స్క్రీన్ ప్లే చాలా డేరింగ్ గా ఉంటుంది. ముఖ్యంగా తన సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్ విషయంలో ఆయన తీసుకునే డెసిషన్స్ ఆడియన్స్ కు షాక్ ఇస్తుంటాయి. తన మొదటి సినిమాలో హీరోకి ఒక పెద్ద లోటు పెట్టి ఎమోషన్ పండించిన బుచ్చిబాబు.. లేటెస్ట్ గా వచ్చిన 'పెద్ది' సినిమాలో కూడా క్యారెక్టర్ పరంగా అలాంటి ఒక సాక్రిఫైస్ కే వెళ్లాడు.

హీరోల శరీరంలో ఏదో ఒక భాగం కోల్పోయేలా కథ రాయడం అనేది బుచ్చిబాబు సెంటిమెంట్ లాగా మారిపోయిందని సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వస్తున్నాయి. కథలో ఇంటెన్సిటీ పెంచడానికి ఆయన ఈ ఫార్ములాను వాడుతున్నప్పటికీ, ఆడియన్స్ మాత్రం దీనిపై ఫన్నీగా చర్చించుకుంటున్నారు. లేటెస్ట్ గా ఈ టాపిక్ పై సీనియర్ నటుడు జగపతిబాబు కూడా నేరుగా బుచ్చిబాబునే ఒక రేంజ్ లో ఆడుకోవడం విశేషం.

'పెద్ది' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జగపతిబాబు, డైరెక్టర్ బుచ్చిబాబును ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడికి ఉన్న కటౌట్స్, క్రేజ్ చూసి "నెక్స్ట్ నువ్వు హీరోనా ఏంటి?" అని జగపతిబాబు సరదాగా అడిగారు. దానికి బుచ్చిబాబు సిగ్గుపడుతుండగానే.. సరే నువ్వు హీరో అయితే ఈసారి ఏం కట్ చేస్తావ్ అంటూ జగపతిబాబు ఊహించని పంచ్ వేశారు. ఈ ప్రశ్న అడగగానే బుచ్చిబాబు నవ్వు ఆపుకోలేకపోయాడు.

హీరోగా నటించడంపై బుచ్చిబాబు చాలా ఓపెన్ గా తన ఒపీనియన్ చెప్పాడు. తనకు యాక్టింగ్ రాదని, సైడ్ లో నిలబడమని చిన్న క్యారెక్టర్ ఇచ్చినా తనకు చేతకాదని చాలా క్లియర్ గా ఒప్పేసుకున్నాడు. నటన అనేది తన కప్ ఆఫ్ టీ కాదని ఒక సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎలాంటి మొహమాటం లేకుండా ఒప్పుకోవడం హైలెట్.

ఇక జగపతిబాబు అడిగిన 'కట్' ప్రశ్నకు కూడా బుచ్చిబాబు బదులిచ్చాడు. ఈసారి అలాంటి కోతలు ఏమీ ఉండవని, ఫుల్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ తోనే సినిమా ఉంటుందని నవ్వుతూనే క్లారిటీ ఇచ్చాడు. దీన్ని బట్టి చూస్తే బుచ్చిబాబు తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కోసం ఈ సెంటిమెంట్ ను పక్కనపెట్టి, పక్కా కమర్షియల్ స్క్రీన్ ప్లేను ట్రై చేయబోతున్నాడని అర్థమవుతోంది.

హీరో పాత్రలకు ఇలాంటి లోపాలు పెట్టడం వల్ల ప్రేక్షకుల్లో సింపతీ ఈజీగా వస్తుంది. కథలోని ఎమోషన్ కు బాగా కనెక్ట్ అవుతారు. కానీ అదే ఫార్ములాను రిపీట్ చేస్తే రొటీన్ అయిపోతుంది. జగపతిబాబు లాంటి సీనియర్ నటుడే ఈ పాయింట్ ను హైలైట్ చేశాడంటే, ఇండస్ట్రీలో కూడా బుచ్చిబాబు మార్క్ స్క్రీన్ ప్లేపై ఎలాంటి డిస్కషన్స్ జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా తన తదుపరి ప్రాజెక్ట్ తో బుచ్చిబాబు ఎలాంటి మాస్ మ్యాజిక్ చేస్తాడో చూడాలి.



Tags:    

Similar News