స్క్రీన్ చూడలేనంత ఎమోషన్… ‘పెద్ది’లో అప్పలసూరి మ్యాజిక్!
సినిమా ఇండస్ట్రీలో కొన్ని పాత్రలు మాత్రమే నటుడి వ్యక్తిత్వాన్ని దాటి, ప్రేక్షకుడి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి.
సినిమా ఇండస్ట్రీలో కొన్ని పాత్రలు మాత్రమే నటుడి వ్యక్తిత్వాన్ని దాటి, ప్రేక్షకుడి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. వైవిధ్యభరితమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న దర్శకుడు బుచ్చిబాబు, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ కలయికలో వచ్చిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ చిత్రంలో జగపతి బాబు పోషించిన ‘అప్పలసూరి’ పాత్ర థియేటర్లలో ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టిస్తోంది. ఈ పాత్ర విశేషాలు, సినిమా విజయంపై జగపతి బాబు, బుచ్చిబాబు తాజాగా ఓ చిట్‌చాట్‌లో పంచుకున్నారు. ఆ విశేషాలు చూద్దాం..
నా కెరీర్‌లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్:
జగపతి బాబు తన క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ .."నేను నా 35 ఏళ్ల కెరీర్‌లో వందల సినిమాలు చేశాను. కమర్షియల్ సక్సెస్‌లు చూశాను. కానీ, ఆర్టిస్ట్‌గా నా లైబ్రరీలో, నా గుండెల్లో దాచుకునే సినిమాలు కొన్ని మాత్రమే ఉంటాయి. ‘పెద్ది’ ఖచ్చితంగా ఆ 200 సినిమాల్లో ఒకటిగా నిలిచిపోతుంది. అప్పలసూరిగా నాకు లభించిన ఈ అవకాశం నా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్. ఒక ఆర్టిస్ట్‌గా ఆ ప్రైడ్, ఆ తృప్తి నాకు లభించాయి."అని అన్నారు.
అప్పలసూరిగా జగపతి బాబు.. బుచ్చిబాబు ‘ఏఐ’ మ్యాజిక్:
ఇంకా అయన మాట్లాడుతూ .."నిజం చెప్పాలంటే, బుచ్చిబాబు నా దగ్గరకు వచ్చి కథ చెప్పకముందు నాకే ఒక డౌట్ ఉండేది. నన్ను చూస్తే అందరికీ ఒక రాయల్టీ కనిపిస్తుంది. కానీ అప్పలసూరి పాత్రలో ఒక 75 ఏళ్ల పల్లెటూరి వృద్ధుడి పేదరికం, ఆ వేదన, ఆ స్ట్రగుల్ కనిపించాలి. నా వల్ల అవుతుందా అని నేను కొంచెం ఆలోచించా. కానీ బుచ్చిబాబు ‘ఏఐ’ టెక్నాలజీ సాయంతో నా లుక్‌ని డిజైన్ చేయించి తెచ్చాడు. ఇక ఆ ఫోటో చూడగానే నేను షాక్ అయ్యా. ఇక ఆఫీసులో డ్రెస్ వేసుకుని ఫస్ట్ కెమెరా క్లిక్ అవ్వగానే... అక్కడ జగపతి బాబు లేడు, కేవలం అప్పలసూరి మాత్రమే ఉన్నాడని అందరికీ అర్థమైపోయింది. ఇక నా క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా నన్ను గుర్తుపట్టలేనంతగా ఆ పాత్రలో లీనమైపోయాను." అని తెలిపాడు.
థియేటర్లను సైలెంట్ చేసిన క్లైమాక్స్ ఎమోషన్:
ఇక సినిమాలో నా పాత్ర ఫస్టాఫ్‌కే పరిమితం కాకుండా, సెకండాఫ్‌లో, క్లైమాక్స్ వరకు వెంటాడుతూనే ఉంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్‌లో రామ్‌చరణ్ నోటి ద్వారా మళ్లీ నా క్యారెక్టర్ పేరు వచ్చినప్పుడు, ఆ వాయిస్ ఓవర్ పడినప్పుడు థియేటర్ మొత్తం సైలెంట్ అయిపోతుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా లేని ఆ నిశ్శబ్దంలో అప్పలసూరి పేరు వినబడగానే ప్రేక్షకుల నుంచి వచ్చే అరుపులు, కేకలు డైరెక్టర్ విజన్‌కు నిదర్శనం. ఆ సీన్ వల్లనే అప్పలసూరి పాత్ర అంతలా పండింది.అని అయన ఆనందం వ్యక్తం చేసారు.
స్క్రీన్ చూడలేనంత ఎమోషన్.. జనాలు ఏడుస్తున్నారు:
ఇక బుచ్చి బాబు మాట్లాడుతూ "ఈ మధ్యనే నేను థియేటర్‌కు వెళ్లి ఆడియన్స్ రెస్పాన్స్ చూశాను. ముఖ్యంగా ఎమ్మెల్యే కాళ్లు పట్టుకునే సీన్ వస్తున్నప్పుడు, థియేటర్లలో ఉన్న మహిళలు, ఫ్యామిలీ ఆడియన్స్ కళ్లు తుడుచుకుంటూ ఏడుస్తున్నారు. ఇక ఆ ఎమోషన్ చూడలేక నేను స్క్రీన్ వైపు కూడా చూడకుండా కేవలం వారి రియాక్షన్స్ వింటూ ఉండిపోయాను. ఒక కమర్షియల్ సినిమాలో హీరో 50 మందిని కొడితే విజిల్స్ వేయడం ఈజీ, కానీ ఒక క్యారెక్టర్ పడే బాధకు ఆడియన్ ఏడ్చాడంటే అది మామూలు విషయం కాదు. ఇక జగపతి బాబుగా చంపడాలు, నరకడాలు చాలా సినిమాల్లో చేశాను కానీ, ఈ సినిమాలో చనిపోతూ ప్రాణదానం చేయడం, ఆత్మగౌరవం గురించి చెప్పడం నాకే గూస్‌బంప్స్ తెప్పించింది."అని తెలిపారు.
కమర్షియల్ హంగుల కోసమే కాకుండా, ఒక పల్లెటూరి మట్టి వాసనతో కూడిన ఎమోషనల్ కథను నమ్మి చేసిన ‘పెద్ది’ చిత్రం రోజురోజుకూ ప్రజాదరణ పొందుతూ క్లాసిక్‌గా నిలుస్తోంది. జగపతి బాబు కెరీర్‌లో ‘అంతఃపురం’ తర్వాత అంతటి నటన ప్రాధాన్యత ఉన్న అప్పలసూరి పాత్రను అందించినందుకు ఆయన డైరెక్టర్ బుచ్చిబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బాక్సాఫీస్ కలెక్షన్లతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయే అద్భుతమైన పాత్రగా ‘అప్పలసూరి’ తెలుగు సినిమా చరిత్రలో గుర్తుండిపోతుంది.