• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చ‌ర‌ణ్ డిమాండ్‌ను నాగి...

చ‌ర‌ణ్ డిమాండ్‌ను నాగి నెర‌వేరుస్తాడా?

| జ‌గ‌దేకవీరుడు అతిలోక సుంద‌రి సినిమాకు సీక్వెల్ వ‌స్తే బావుంటుంద‌ని ఎప్ప‌ట్నుంచో అంతా కోరుతున్నారు.

By - Tupaki Desk
Update: 2025-05-09 05:01 GMT

మే9, 1990లో టాలీవుడ్ లో రిలీజైన జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి సినిమా ఎంత‌టి బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింద‌నేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ సినిమా 35 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా మేక‌ర్స్ ఇప్పుడు దాన్ని 2డీ, 3డీ వెర్ష‌న్స్ లో రీరిలీజ్ చేస్తున్నారు. రీరిలీజ్ సంద‌ర్భంగా ఈ సినిమాకు బాగానే హ‌డావిడి చేసి స్పెష‌ల్ హోర్డింగ్స్ తో పాటూ చిరంజీవి, రాఘ‌వేంద్ర రావు, అశ్వినీదత్ ఓ ప్ర‌త్యేక ఇంట‌ర్య్వూ ఇచ్చి దాన్ని రిలీజ్ చేశారు.

జ‌గ‌దేకవీరుడు అతిలోక సుంద‌రి సినిమాకు సీక్వెల్ వ‌స్తే బావుంటుంద‌ని ఎప్ప‌ట్నుంచో అంతా కోరుతున్నారు. ఈ సీక్వెల్ విషయంలో డైరెక్ట‌ర్ రాఘ‌వేంద్ర‌రావు ఇంట్రెస్టింగ్ గా లేక‌పోయిన‌ప్ప‌టికీ ఈ సీక్వెల్ పై నిర్మాత అశ్వినీద‌త్ మాత్రం ముందు నుంచి ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉన్నారు. రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్ తో ఆ సీక్వెల్ చేస్తే బావుంటుంద‌ని చిరంజీవికి కూడా మ‌న‌సులో ఉంది.

అయితే రీసెంట్ గా రిలీజ్ చేసిన ఇంట‌ర్వ్యూలో ఓ వీడియోలో టీమ్ తో రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ జ‌గ‌దేక‌వీరుడు అతిలోక‌సుంద‌రిలో ఆ రింగ్ ఏమైంది, చేప ఏమైంది లాంటి ప్ర‌శ్న‌ల‌కు ఆన్స‌ర్ చెప్పాల‌ని తాను నాగ్ అశ్విన్ ను డిమాండ్ చేస్తున్నాన‌ని చెప్ప‌డంతో ఒక్క‌సారిగా ఈ సీక్వెల్ పై అంద‌రికీ ఆస‌క్తి పెరిగిపోయింది.

జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి డైరెక్ట‌ర్ రాఘ‌వేంద్ర రావు ఆ సినిమా సీక్వెల్ కు రెడీగా లేక‌పోయిన‌ప్ప‌టికీ చ‌ర‌ణ్ సీక్వెల్ గురించి అడ‌గ‌డం, డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ పేరును ప్ర‌స్తావించ‌డం చూస్తుంటే తెర వెనుక ఈ సీక్వెల్ కు సంబంధించిన ఆలోచ‌న ఉంద‌ని అర్థ‌మ‌వుతుంది. చ‌ర‌ణ్ నాగ్ అశ్విన్ ను డిమాండ్ చేస్తున్నా అని అన్నాడంటే ఆ సీక్వెల్ కు అత‌న్ని డైరెక్ట్ చేయ‌మ‌ని ఇన్‌డైరెక్ట్ గా అడ‌గ‌డ‌మే.

రాజు, ఇంద్ర‌జ‌ల‌కు సంతానం క‌లిగి వాళ్లు రామ్ చ‌ర‌ణ్‌, జాన్వీ అయితే ఆ కాంబినేష‌నే చాలా కొత్త‌గా ఎంతో ఎగ్జైటింగ్ గా ఉంటుంది. రామ్ చ‌ర‌ణ్ మాట‌ల్ని నాగ్ అశ్విన్ సీరియ‌స్ గా తీసుకుని దానిపై వ‌ర్క‌వుట్ చేస్తాడేమో చూడాలి. ప్ర‌స్తుతం క‌ల్కి2 స్క్రిప్ట్ వ‌ర్క్ తో బిజీగా ఉన్న నాగ్ అశ్విన్ ఈ సీక్వెల్ ను తెర‌కెక్కిస్తే ఈ సినిమా సెన్సేష‌న్ సృష్టించ‌డం ఖాయం.

Tags:    
  • JagadekaVeeruduAthilokaSundari 
  • RamCharan 
  • NagAshwin 
  • JanhviKapoor 
  • TeluguCinema 
  • JVASSequel 
  • Chiranjeevi 
  • AshwiniDutt 
  • Tollywood 
  • VyjayanthiMovies 
  • Filmindustry 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS