డ్రాగన్ స్పెషల్ సాంగ్ కోసం క్రేజీ బ్యూటీ
గతేడాది కొరటాల శివతో కలిసి దేవర సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.;
గతేడాది కొరటాల శివతో కలిసి దేవర సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఓ వైపు హృతిక్ రోషన్ తో కలిసి అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ లో వార్2 సినిమా చేస్తున్న తారక్, ఆ సినిమాతోనే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఎన్టీఆర్ బాలీవుడ్ లో చేస్తున్న మొదటి సినిమా కావడంతో వార్2 పై మంచి అంచనాలున్నాయి.
మరోవైపు కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఫిల్మ్ చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. కెజిఎఫ్, సలార్ లాంటి భారీ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి రాబోతున్న సినిమా కావడం, అందులో మాస్ హీరో ఎన్టీఆర్ నటిస్తుండటంతో డ్రాగన్ సినిమాపై ముందు నుంచే భారీ అంచనాలున్నాయి.
నీల్ కూడా ఆ హైప్ కు ఏ మాత్రం తగ్గకుండా డ్రాగన్ ను తెరకెక్కిస్తున్నాడు. డ్రాగన్ సినిమాలో తారక్‌ను నీల్ సరికొత్త అవతారంలో ప్రెజెంట్ చేయబోతున్నాడట. ఈ సినిమాలో ఎన్టీఆర్ మునుపెన్నడూ లేని విధంగా ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. భారీ స్టార్ క్యాస్టింగ్ ఉన్న ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉందని తెలుస్తోంది. ఆ స్పెషల్ సాంగ్ గురించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది.
డ్రాగన్ లోని స్పెషల్ సాంగ్ లో ఓ క్రేజీ బ్యూటీ తారక్ తో కలిసి కాలు కదపనున్నట్టు తెలుస్తోంది. ఆ క్రేజీ బ్యూటీ మరెవరో కాదు, కేతికా శర్మ. రీసెంట్‌గా శ్రీవిష్ణు తో కలిసి సింగిల్ సినిమా చేసి ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్న కేతికా శర్మ, ఇటీవలే నితిన్ రాబిన్‌హుడ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకునే మేకర్స్ డ్రాగన్ స్పెషల్ సాంగ్ కోసం కేతికాను సంప్రదించగా, కేతిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ వార్తలు నిజమై కేతిక ఈ సాంగ్ చేస్తే అమ్మడి క్రేజ్, ఫాలోయింగ్ మరింత పెరగడం ఖాయం.