• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డబుల్ ఇస్మార్ట్.....

డబుల్ ఇస్మార్ట్.. కిక్కిచ్చేలా ఓ ట్విస్ట్..?

| డబుల్ ఇస్మార్ట్ మూవీతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ప్రతి నాయకుడిగా తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2024-07-13 02:30 GMT

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ మూవీ ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ తెరకెక్కించారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రెడీ అవుతున్న ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ తో కలిసి ఛార్మి పూరి కనెక్ట్స్ బ్యానర్ పై నిర్మించింది. డబుల్ ఇస్మార్ట్ మూవీతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ప్రతి నాయకుడిగా తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు.

దీంతో ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయ్యింది. కచ్చితంగా డబ్బులు ఇస్మార్ట్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని పూరి జగన్నాథ్ గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. హీరో రామ్ పోతినేని కి ది వారియర్, స్కంద సినిమాలతో వరుసుగా రెండు డిజాస్టర్లు వచ్చాయి. అయితే డబుల్ ఇస్మార్ట్ మాత్రం ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ అవుతుందని రామ్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ చిత్రాన్ని హై ఎనర్జిటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా పూరి జగన్నాథ్ రెడీ చేస్తున్నారు.

మెలోడీ బ్రహ్మ మణిశర్మ డబుల్ స్మార్ట్ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అయితే ఈ సాంగ్ చెప్పుకోదగ్గ స్థాయిలో వైరల్ కాలేదు. పూరి జగన్నాథ్ డౌన్ ఫాల్ కూడా డబుల్ ఇస్మార్ట్ సినిమా సాంగ్ బజ్ క్రియేట్ చేయకపోవడానికి ఒక రీజన్ అని చెప్పొచ్చు. అయితే డైరెక్టర్ పూరి మాత్రం ఈ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆయన కెరియర్ లో షూట్ కోసం ఎక్కువ సమయం తీసుకున్న సినిమా ఇదే అని చెప్పొచ్చు.

ఇదిలా ఉంటే ఈ చిత్రంలో పూరి జగన్నాథ్ ఓ ఇంట్రెస్టింగ్ సర్ప్రైజ్ ఎలిమెంట్ ని పెట్టినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నభా నటేష్ హీరోయిన్ గా చేసింది. అయితే ఆమె పాత్ర మూవీ ఆరంభంలోనే చనిపోతుంది. నభా నటేష్ ని చంపేశారని రామ్ పోతినేని విలన్ పై రివేంజ్ తీర్చుకుంటాడు. అయితే డబుల్ ఇస్మార్ట్ సినిమాలో నభా నటేష్ క్యారెక్టర్ ని మళ్ళీ తీసుకురాబోతున్నారంట.

అదే మూవీలో ట్విస్ట్ తరహాలో సర్ ప్రైజ్ ఎలిమెంట్ గా ఉంటుందంట. పూరి జగన్నాథ్ ఇలాంటి ఇంటరెస్టింగ్ ట్విస్ట్ లని పెట్టడంలో దిట్ట. నభా నటేష్ క్యారెక్టర్ ని అయితే పూరి టీమ్ ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. ప్రేక్షకులకి సర్ప్రైజింగ్ గా ఉండటం కోసమే ఆమె క్యారెక్టర్ ని హైడ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. కావ్యా థాపర్ డబుల్ ఇస్మార్ట్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. సంజయ్ దత్ మాఫియా డాన్ గా ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. మరి ఈ మూవీ ఇటు పూరికి అటు రామ్ పోతినేనికి ఎలాంటి సక్సెస్ ఇస్తుందనేది చూడాలి.

Tags:    
  • Tollywood 
  • Kollywood 
  • Filmindustry 
  • IsmartShankar 
  • DoubleIsmart 
  • RamPothineni 
  • Nabbhanatesh 
  • SanjayDutt 
  • PuriJagannadh 
  • Manisharma 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS