ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బ్లౌజ్.. ఖరీదు , ప్రత్యేకతలు తెలిస్తే షాక్

కేవలం ఒక బ్లౌజ్ ఖరీదు ఏకంగా రూ. 200 కోట్లు అంటే నమ్మగలరా? అందులో పొందుపరిచిన వజ్రాలు, రత్నాల వెనుక ఉన్న అసలు కథ తెలిస్తే మీరు ఎవరైనా ఆశ్చర్యపోవాలిసిందే..ఆ విశేషాలు చూద్దాం..;

Update: 2026-05-06 17:30 GMT

ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్ 'మెట్ గాలా 2026'లో భారతీయ వ్యాపార దిగ్గజం ఈషా అంబానీ తన రాయల్ లుక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె ధరించిన బ్లౌజ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. కేవలం ఒక బ్లౌజ్ ఖరీదు ఏకంగా రూ. 200 కోట్లు అంటే నమ్మగలరా? అందులో పొందుపరిచిన వజ్రాలు, రత్నాల వెనుక ఉన్న అసలు కథ తెలిస్తే మీరు ఎవరైనా ఆశ్చర్యపోవాలిసిందే..ఆ విశేషాలు చూద్దాం..



 


మెట్ గాలాలో భారతీయ వెలుగులు:

మెట్ గాలా అంటేనే వింతైన, విలాసవంతమైన ఫ్యాషన్‌కు కేరాఫ్ అడ్రస్. అలాంటి వేదికపై ఈషా అంబానీ మన దేశ వారసత్వాన్ని ప్రతిబింబించేలా మెరిసిపోయారు. ఫ్యాషన్ డిజైన్ మరియు ఆభరణాల కలయికతో రూపొందించిన ఒక అద్భుతమైన గౌనులో ఆమె మెరిసిపోయారు. అయితే అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ఆమె ధరించిన ఆ ఖరీదైన బ్లౌజ్.



 


1,800 క్యారెట్ల వజ్రాల తళతళలు:

ఇక ఈ బ్లౌజ్ ప్రత్యేకత ఏమిటంటే, దీనిపై ఏకంగా 1,800 క్యారెట్లకు పైగా బరువున్న అత్యంత నాణ్యమైన వజ్రాలను పొందుపరిచారు. సాధారణంగా ఆభరణాలను ఒంటిపై ధరిస్తాం, కానీ ఈ డ్రెస్ విషయంలో నగలే నేరుగా బ్లౌజ్‌కు కుట్టేయడం విశేషం. ఇక వజ్రాలతో పాటు విలువైన పచ్చలు, కుందన్ రాళ్లను కూడా ఇందులో వాడటం మరో విశేషం.

నీతా అంబానీ ప్రైవేట్ కలెక్షన్:

ఈ బ్లౌజ్‌లో ఉపయోగించిన నగలు కేవలం కొత్తవి మాత్రమే కావు. ఈషా అంబానీ తల్లి, నీతా అంబానీ దగ్గర ఉన్న అత్యంత అరుదైన వారసత్వ సంపద నుంచి కొన్నిటిని సేకరించి ఈ బ్లౌజ్‌లో చేర్చారు. తరతరాలుగా వస్తున్న రాజసం ఉట్టిపడేలా ఉండే ఈ నగలు, ఆధునిక ఫ్యాషన్ దుస్తులకు ఒక కొత్త కళను అద్దాయి.

200 కోట్ల ఖరీదు:

ఆమె ధరించిన చీర మొత్తం బంగారు దారాల తో నేసారు. ఇక బ్లౌజ్ వజ్రాలు, పచ్చలు మరియు అరుదైన కుందన్ తో నింపేశారు. చేతి పనితనంతో కూడిన ఈ బ్లౌజ్ విలువ దాదాపు రూ. 200 కోట్లు ఉంటుందని సమాచారం. ఒకే ఒక్క డ్రెస్ మీద ఇంత భారీ ఖర్చు చేయడం అనేది ఒక్క అంబానీ కుటుంబానికే సాధ్యమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. లగ్జరీ అంటే ఏంటో ఈషా అంబానీ మరోసారి ప్రపంచానికి రుచి చూపించారు.

వారసత్వం.. విలాసం.. రెండూ ఒక్కటే:

కేవలం ఖరీదైన బట్టలు వేసుకోవడమే కాదు, భారతీయ కళలను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించడంలో అంబానీలు ఎప్పుడూ ముందుంటారు. ఈ మెట్ గాలా లో శారీ కూడా అలాగే డిజైన్ చేశారు. పాత తరం నాటి నగలను నేటి కాలపు ఫ్యాషన్ దుస్తులతో జత చేసి, రెడ్ కార్పెట్ లగ్జరీ అనే పదానికి సరికొత్త అర్థం ఇచ్చారు. ఇక ఫ్యాషన్ ప్రపంచంలో ఎన్నో ప్రయోగాలు జరుగుతుంటాయి, కానీ ఇలా నగల్నే బట్టలుగా మార్చేయడం నిజంగా ఒక అద్భుతం.

Tags:    

Similar News