• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మోహన్‌ బాబు ఇండియాలో...

మోహన్‌ బాబు ఇండియాలో లేరా?

| అందుకే ఆయన్ను కచ్చితంగా అరెస్ట్‌ చేయాలని పోలీసులు భావిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.

By - Tupaki Desk
Update: 2024-12-24 06:18 GMT

జర్నలిస్ట్‌పై దాడి కేసులో సినీ నటుడు మోహన్‌ బాబును అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నారనే వార్తలు వస్తున్నాయి. మోహన్‌బాబును అరెస్ట్‌ చేయవద్దని కోర్టు స్టే విధించింది. ఈనెల 24 వరకు మోహన్‌ బాబును అరెస్ట్‌ చేయవద్దు అంటూ స్టేలో పేర్కొంది. స్టే గడువు పూర్తి అయ్యేప్పటి వరకు ముందస్తు బెయిల్‌ను మోహన్‌బాబు తెచ్చుకోవాలని ప్రయత్నించారు. కానీ కోర్టులో మోహన్‌ బాబు ముందస్తు బెయిల్‌ పిటీషన్‌ను కొట్టి వేయడంతో అరెస్ట్‌ తప్పదనే ప్రచారం జరుగుతోంది. హత్యాయత్నం కేసులో మోహన్ బాబుపై కేసు నమోదు అయ్యింది. అందుకే ఆయన్ను కచ్చితంగా అరెస్ట్‌ చేయాలని పోలీసులు భావిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.

స్టే గడువు పూర్తి అయ్యింది, అలాగే ఆయనకు ముందస్తు బెయిల్‌ రాకపోవడంతో డిసెంబర్‌ 25న మోహన్‌ బాబును అరెస్ట్‌ చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో మోహన్ బాబు ఇండియాలో లేరు అనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆయన దుబాయ్‌కి వెళ్లి పోయారు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ విషయమై మంచు ఫ్యామిలీ నుంచి ఎలాంటి స్పందన లేదు. సోషల్ మీడియాలో ఈ విషయమై ఎవరికి తోచిన విధంగా వారు పోస్ట్‌లు చేస్తున్నారు. దాంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

మోహన్‌ బాబు అరెస్ట్‌ కావడం ఖాయం అనే చర్చ జరుగుతున్న సమయంలో దుబాయ్‌కి వెళ్లి పోయాడు అనే విషయం నిజం అయి ఉంటుందని కొందరు భావిస్తున్నారు. కొందరు మాత్రం మోహన్‌ బాబు దుబాయ్‌కి వెళ్ళి పోయారు అనే వార్తలు కేవలం పుకార్లు అయి ఉంటాయని అంటున్నారు. ఒకవేళ దుబాయ్‌కి మోహన్‌బాబు వెళ్లి పోతే పోలీసులు ఏం చేస్తారు అనే చర్చ సైతం మొదలైంది. మరికొన్ని గంటల్లో మోహన్ బాబును అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్తారనే ప్రచారం జరుగుతుంది. అప్పుడు జరిగే పరిణామాలు ఏంటి అనేది అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.

మరో వైపు మోహన్‌ బాబు తనయుల గొడవలు కంటిన్యూ అవుతున్నాయి. తన అన్న విష్ణు కారణంగా తనకు ప్రాణహాని ఉంది అంటూ మనోజ్‌ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇలా మంచు వారి ఫ్యామిలీ గొడవలు రోడ్డున పడటంతో మీడియా వారు మోహన్‌ బాబు స్పందన అడిగిన సమయంలోనే మీడియా మైక్‌ లాక్కుని మరీ టీవీ 9 జర్నలిస్ట్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. మోహన్ బాబు స్వయంగా వెళ్లి జర్నలిస్ట్‌ను కలిసి క్షమాపణలు చెప్పారు. అయినా వివాదం కంటిన్యూ అవుతోంది. మోహన్‌ బాబు అరెస్ట్‌ అయితే కచ్చితంగా పెద్ద సంచలం.

Tags:    
  • Manchufamily 
  • Mohanbabu 
  • Manojmanchu 
  • Vishnumanchu 
  • Tv9Journalist 
  • Policecase 
  • Highcourt 
  • Anticipatarybail 
  • Dubai 

Similar News

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

టైగ‌ర్ పై ఎటాక్..కొత్త ప‌ల్ల‌వి తెర‌పైకి తెచ్చిన ఫ్యామిలీ స్టార్!

2026-11-11 06:23 GMT

టాలీవుడ్ లో అవ‌కాశాలకు స‌క్సెస్ ఒక్క‌టే ప్రామాణికం కాదు!

2026-11-11 05:59 GMT

500 కోట్ల క్లబ్.. సౌత్ హీరోల్లో టాప్ ఎవరంటే!

2026-11-11 05:58 GMT

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

Copyright @2026

Powered by Blink CMS