• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పుష్ప కోసం ఎదురు...

పుష్ప కోసం ఎదురు చూస్తున్న 'రాజాసాబ్‌' బ్యూటీ

| ఇప్పుడు ప్రభాస్ రాజాసాబ్‌ హీరోయిన్‌ మాళవిక మోహనన్ చేసిన పుష్ప వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

By - Tupaki Desk
Update: 2024-11-29 07:16 GMT

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబోలో రూపొందిన 'పుష్ప 2' సినిమా కోసం పాన్‌ ఇండియా ప్రేక్షకులు మాత్రమే కాకుండా సినిమా స్టార్స్‌ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అన్ని భాషల స్టార్స్‌ పుష్ప 2 సినిమా వైపు చూస్తున్నారు. ఆ సినిమా సాధించబోతున్న రికార్డులు ఏంటి, సినిమా ఎలా ఉండబోతుంది ఇలా ఎన్నో విషయాల పట్ల అందరికీ ఆసక్తిగా ఉంది. పుష్పరాజ్‌ రూలింగ్‌ ఎలా ఉంటుంది అంటూ సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. సమయంలో ఏ సెలబ్రెటీ పుష్ప గురించి కామెంట్స్ చేసినా అది కాస్త వైరల్‌ అవుతోంది. ఇప్పుడు ప్రభాస్ రాజాసాబ్‌ హీరోయిన్‌ మాళవిక మోహనన్ చేసిన పుష్ప వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.


సోషల్‌ మీడియాలో మాళవిక మోహనన్‌ను ఒక నెటిజన్‌ మీరు పుష్ప 2 సినిమా చూడ్డానికి వెయిట్‌ చేస్తున్నారా అంటూ ప్రశ్నించాడు. అందుకు మాళవిక మోహన్‌ సమాధానంగా... పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌ అద్భుతంగా నటించారు. ఆయన నటన చూసి నేను ఆశ్చర్యపోయాను. అతడి స్టైల్‌, స్వాగ్‌కి మతి పోయింది. అతడి డాన్స్‌ అదిరిపోయింది. పుష్ప 2 కోసం కచ్చితంగా ఎదురు చూస్తూ ఉన్నాను. తగ్గేదేలే టైమ్‌ అంటూ ఫైర్ ఈమోజీని షేర్ చేయడంతో అల్లు అర్జున్‌ ఈ అమ్మడి పోస్ట్‌ను తెగ షేర్‌ చేస్తున్నారు. పుష్ప క్రేజ్ ఏంటో ఈ ట్వీట్‌తో మరోసారి నిరూపితం అయింది అంటూ ఫ్యాన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

మాళవిక మోహనన్‌ ఇప్పటి వరకు తెలుగు సినిమాలో నటించలేదు. అయితే ఈమె గతంలో నటించిన తమిళ సినిమాలు డబ్బ్‌ అయ్యి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. గత రెండు సంవత్సరాలుగా ఈమె ప్రభాస్‌కి జోడీగా నటిస్తోంది అనే వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు నిజంగానే రాజాసాబ్‌ సినిమాలో తాను ఉన్నాను అంటూ క్లారిటీ ఇచ్చింది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజాసాబ్‌ సినిమా కోసం పాన్ ఇండియా స్థాయి ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కచ్చితంగా రాజాసాబ్‌ మరో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలుస్తుందనే నమ్మకం ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.

రాజాసాబ్‌ వంటి బిగ్గెస్ట్‌ మూవీతో ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న ఈ అమ్మడు సోషల్‌ మీడియా ద్వారా పుష్ప 2 కోసం ఎదురు చూస్తున్నాను అంటూ తెలియజేడం అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్‌ హీరోతో నటిస్తున్న కారణంగా మాళవిక సైతం పాన్‌ ఇండియా స్థాయి ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. రాజాసాబ్‌ సినిమా విడుదల తర్వాత ఈ అమ్మడు మరిన్ని సినిమాల్లో నటించే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వెయ్యి కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్ చేసిన పుష్ప 2 బాక్సాఫీస్‌ వద్ద రూ.2000 కోట్ల వసూళ్లు నమోదు చేస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. మైత్రి మూవీ మేకర్స్‌ వారు నిర్మించిన ఈ సినిమాకు సుకుమార్‌ దర్శకత్వం వహించాడు. దేవి శ్రీ ప్రసాద్‌ ఇచ్చిన సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది.

I was blown away by how fantastic Allu Arjun was in Pushpa. His swag, his style, his dance.. uff! Looking forward to #pushpa2 ! #Thaggedele time! 🔥 https://t.co/cLbjTrga7F

— Malavika Mohanan (@MalavikaM_) November 28, 2024
Tags:    
  • Tollywood 
  • Filmindustry 
  • Pushpa2 
  • Alluarjun 
  • Rashmikamandanna 
  • Sukumar 
  • Rajasaab 
  • Prabhas 
  • MalavikaMohanan 
  • Tweet 
  • Viralpost 
  • Scialmedia 

Similar News

RC17 : అప్పుడు ఆది, ఫాహద్‌ ఇప్పుడు రిషికాంత్‌..!

2026-11-10 07:52 GMT

స్పెషల్ విఐపి లతో శ్రీ లీల దీపావళి వేడుకలు.. ఫొటోస్ వైరల్!

2026-11-10 07:49 GMT

పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల మధ్య రెండు నెలల్లోనే ఏమైపోయింది?

2026-11-10 07:49 GMT

నా నోటి తిట్లు తింటే కెరీర్ సెట్ అయినట్లే!

2026-11-10 07:00 GMT

లంకేశ్వరుడి గెటప్ కోసం యష్ పడిన కష్టం ఇదే!

2026-11-10 06:56 GMT

కథల సెలక్షన్.. గేర్ మారుస్తున్న చిరు

2026-11-10 06:56 GMT

అల్లుడిని చూసి మామ గ‌ర్వంగా!

2026-11-10 06:56 GMT

రాకెట్లు కాల్చడం సంస్కృతి కాదు!

2026-11-10 06:55 GMT

'రామాయణం' బుకింగ్స్.. ఒక్క రోజులో 16 లక్షల టికెట్లు!

2026-11-10 06:39 GMT

మరో బిడ్డకు జన్మనివ్వబోతున్న కిరణ్ అబ్బవరం దంపతులు.. నిజమెంత?

2026-11-10 06:33 GMT

దర్శకుడి నుంచి నిర్మాతగా.. వెంకీ కుడుముల సినీ ప్రయాణంలో ఆసక్తికర విషయాలు!

2026-11-10 06:13 GMT

'మాయ లేడీ' ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-10 06:09 GMT

Copyright @2026

Powered by Blink CMS