ఆ ఒక్క పాత్ర.. ఇరుముడిపై మళ్ళీ సీరియస్

రవితేజకు చాలా రోజుల తర్వాత ఇరుముడి తో బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ దక్కింది. ఆగస్టు 21న విడుదలైన సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

Update: 2026-08-27 09:53 GMT

రవితేజకు చాలా రోజుల తర్వాత ఇరుముడి తో బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ దక్కింది. ఆగస్టు 21న విడుదలైన సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రవితేజ నటన, తండ్రి కూతురు ఎమోషన్, సెకండాఫ్‌లో వచ్చే సోషల్ పాయింట్ గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు. గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రవితేజకు ఈ సినిమా మంచి కమ్‌బ్యాక్‌గా మారింది. సినిమా మంచి రన్ కొనసాగిస్తున్న సమయంలో ఇప్పుడు టీచర్ పాత్రపై మళ్ళీ వివాదం మొదలైంది.

ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వ పాఠశాలలు, టీచర్లను తక్కువగా చూపించేలా సీన్లు ఉన్నాయని సంఘం ఆరోపిస్తోంది. ఆ సన్నివేశాలను తొలగించడంతో పాటు చిత్ర బృందం టీచర్లకు క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేసింది. సమాజంపై ప్రభావం చూపించే సినిమాల్లో ఇలాంటి అంశాలను జాగ్రత్తగా చూపించాలని అంటున్నారు.

ఇరుముడిలో మలయాళ నటి శ్వాసిక ప్రభుత్వ పాఠశాల టీచర్‌గా కనిపించింది. సినిమాలో ఆమె స్టూడెంట్స్ పట్ల ప్రవర్తించే సీన్స్ పై కొన్ని సీన్స్ బోల్డ్ గా ఉన్నాయి. టీచర్ పాత్రను మరీ కఠినంగా చూపించారనీ ఆరోపణలు వస్తున్నాయి. ఇదివరకే స్కూల్ పేరు గురించి కూడా విమర్శలు వచ్చాయి. సినిమాలో సీలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పేరును చూపించారని ఏపీటీఎఫ్ చెబుతోంది.

విద్యార్థులకు ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఉపయోగిస్తున్న యూనిఫామ్ తరహానే పెట్టారని కూడా పేర్కొంది. అందుకే ప్రభుత్వ స్కూల్, ఉపాధ్యాయుల గురించి ప్రేక్షకులకు తప్పు అభిప్రాయం వెళ్లే అవకాశం ఉందని సంఘం అంటోంది. ఈ సన్నివేశాలను తొలగించాలనే డిమాండ్ కూడా అక్కడి నుంచే వచ్చింది.

ఈ వివాదంపై దర్శకుడు శివ నిర్వాణ కూడా స్పందించారు. తాను ఎమ్మెస్సీ, బీఈడీ చదివి టీచర్‌గా పనిచేశానని చెప్పారు. సినిమాలో ఒక టీచర్ మాత్రమే తప్పు చేసినట్లు చూపించామని, మిగతా టీచర్లను మంచివారిగానే చూపించామని వివరించారు. సీలేరు స్కూల్ పేరు మాత్రమే వాడామని, అక్కడ షూటింగ్ చేయలేదని కూడా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వివాదంపై మేకర్స్ నుంచి మరో నిర్ణయం ఏమైనా వస్తుందా అన్నది ఇంకా తెలియలేదు.

మరోవైపు ఇరుముడి కలెక్షన్స్ మాత్రం బలంగానే ఉన్నాయి. ఆరు రోజుల్లో ఇండియా నెట్ రూ.85.25 కోట్లకు చేరగా, ప్రపంచవ్యాప్తంగా రూ.116.15 కోట్ల గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. బుధవారం ఒక్కరోజే ఇండియాలో రూ.10.20 కోట్ల నెట్ వచ్చింది. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా, బేబీ నక్షత్ర రవితేజ కుమార్తెగా నటించారు.

Tags:    

Similar News