ప్రభాస్ తో రాజుగారు పెద్ద స్కెచ్చే!
ఈ క్రేజీ ప్రాజెక్ట్ వెనుక మాలీవుడ్ 'మార్కో' సక్సెస్ ప్రధాన కారణంగా నిలుస్తోందని సమాచారం. మలయాళంలో రిలీజ్ అయిన 'మార్కో' బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.
పక్కా ప్లానింగ్‌తో ఉండే నిర్మాత దిల్ రాజు మరోసారి సంచలన నిర్ణయానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్టార్ ప్రొడ్యూసర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజుగారు రెబల్ స్టార్ ప్రభాస్‌తో భారీ ప్రాజెక్ట్‌ను సెట్ చేసే పనిలో ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఈ కాంబినేషన్‌కు సంబంధించి టాలీవుడ్ సర్కిళ్లలో రకరకాల చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ వెనుక మాలీవుడ్ 'మార్కో' సక్సెస్ ప్రధాన కారణంగా నిలుస్తోందని సమాచారం. మలయాళంలో రిలీజ్ అయిన 'మార్కో' బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.
తెలుగులోనూ డబ్ అయిన చిత్రం ఇక్కడా మంచి వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో ఆ చిత్ర దర్శకుడు హనీఫ్ అదేని ప్రతిభ టాలీవుడ్ ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా సినిమాలో యాక్షన్ సీక్వెన్సులు, మేకింగ్ స్టైల్ నిర్మాత దిల్ రాజును ఎంతగానో ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో హనీఫ్ అదేనిని ఇప్పటికే తన బ్యానర్ లో లాక్ చేసారు. హనీఫ్ తో ఓపవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్లాన్ చేస్తున్నారట. హనీఫ్ రాసిన కథకు ప్రభాస్ అయితేనే సరిగ్గా సరిపోతాడని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయం ప్రభాస్ దృష్టికి వెళ్లిందని..ఆయన కూడా సానుకూలంగానే స్పందించారని తెలిసింది.
అయితే ఈ ప్రాజెక్ట్ ఇప్పటికిప్పుడు పట్టాలెక్కేది కాదు. అందుకు సయయం పడుతుంది. ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు. అయితే విభిన్నమైన దర్శకులతో కొత్త తరహా కథలను ఎంచుకోవడానికి ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఈ నేపథ్యంలో హనీఫ్ అదేని చెప్పిన లైన్ ప్రభాస్‌కు కూడా నచ్చిందనే టాక్ వినిపిస్తోంది. ఈ కాంబినేషన్ కనుక అధికారికంగా సెట్ అయితే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు లను సృష్టించడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.
దిల్ రాజు కొంతకాలంగా సేఫ్ జోన్ లోనే సినిమాలు చేస్తున్నారు. `గేమ్ ఛేంజర్` దెబ్బతో జాగ్రత్తగా ఉంటున్నారు. అయినా ప్రభాస్‌తో సినిమా అంటే సాధారణ స్థాయిలో ఉండదు. నిర్మాణ విలువలు, టెక్నికల్ పరంగా అత్యున్నత ప్రమాణాలతో సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉంటుంది. ఇద్దరు హ్యుజ్ క్రేజ్ ఉన్న వ్యక్తులు కలవడం వల్ల సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకడం సహజం. దానికి తగ్గట్టు బడ్జెట్ అవుతుంది. ఆ విషయంలో రాజు గారు ఎప్పుడు రాజీ పడరు. అయితే తాజాగా టాక్సిక్ చిత్రాన్ని దిల్ రాజు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమాకు టాక్ నెగిటివ్ గా వస్తోంది. రివ్యూలు కూడా సానుకూలంగా లేవు. ఈ నేపత్యంలో ఈ సినిమా ఎఫెక్ట్ రాజుగారిపై పడుతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.