వైరల్ వీడియో : 10 సెకన్ల డాన్స్ తో ఓవర్‌ నైట్‌ స్టార్‌

ఆ అమ్మాయి చాలా ఊపుతో సంతోషంతో డాన్స్ చేస్తుంది. పది సెకన్ల పాటు ఉన్న ఆమె డాన్స్ కు ఇప్పుడు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

Update: 2024-05-20 07:20 GMT

సోషల్‌ మీడియా యుగంలో మనం ఉన్నాం. అప్పటి వరకు ఇంటి పక్కన వరకు కూడా తెలియని వారు ఏదైనా యాక్ట్‌ తో లేదా డాన్స్ మూమెంట్‌ తో సోషల్‌ మీడియా దృష్టిలో పడితే ఓవర్‌ నైట్‌ లో సెన్షేషన్‌ స్టార్‌ అవ్వడం మనం చూస్తూ ఉంటాం.

ఎంతో మంది సింగర్స్, డాన్సర్స్‌, యాక్టర్స్‌ ను సోషల్‌ మీడియా లో జనాలు ఇప్పటికే చూశారు. ఓవర్ నైట్‌ లో స్టార్‌ సెలబ్రిటీ హోదా దక్కించుకున్న వారు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఒక అమ్మాయి సోషల్‌ మీడియాను ఊపేస్తుంది.

ఇటీవల జరిగిన ఐపీఎల్‌ సీఎస్‌కే వర్సెస్ ఆర్‌సీబీ మ్యాచ్ ఎంత రసవత్తరంగా సాగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మ్యాచ్‌ లో చెన్నై 36 బంతుల్లో 76 పరుగులు చేయాల్సి ఉండగా కెమెరా మెన్ ఒక అమ్మాయి పైకి కెమెరా ను ఫోకస్ చేశాడు.

ఆ అమ్మాయి చాలా ఊపుతో సంతోషంతో డాన్స్ చేస్తుంది. పది సెకన్ల పాటు ఉన్న ఆమె డాన్స్ కు ఇప్పుడు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఆమె నవ్వుకు, ఆమె డాన్స్ కి, ఆమె అందంకు ఇలా వేరు వేరుగా లక్షల్లో నెటిజన్స్ ఫిదా అవుతూ ఆ వీడియోను తెగ షేర్‌ చేస్తున్నారు. ఆ వైరల్‌ వీడియోను మీరు చూడండి. ఇంతకు ఆమె సీఎస్‌కే ఫ్యాన్‌ అయ్యి ఉంటుందా లేదంటే కోహ్లీ టీం ఫ్యాన్ అయ్యి ఉంటుందా అనే చర్చ కూడా జరుగుతుంది.

Read more!
Full View
Tags:    

Similar News