అప్పుడు రాజమౌళి.. ఇప్పుడు వంగా!

దీపికా పదుకునేని తప్పించిన నేపథ్యంలో సందీప్ వంగా మరో ఫ్రెష్ ఫేస్ లేదా తెలుగు భాషతో అనుబంధం ఉన్న నటిని ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.;

Update: 2025-05-22 10:11 GMT

తెర వెనకజరిగే చర్చలు, ఘటనలు ఒక్కోసారి కథలకన్నా ఎక్కువ ఆసక్తికరంగా హాట్ టాపిక్ గా మారతాయి. స్టార్ దర్శకులు, స్టార్ నటీనటుల మధ్య ఎంతో సహకార భావంతో పనులు జరిగిపోతాయనుకునే వాళ్లకూ, ఒప్పందాల వెనక ఉండే బిజినెస్ డిమాండ్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. గతంలో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఇదే అనుభవాన్ని బాహుబలి సినిమా విషయంలో ఎదుర్కొన్నారు.

మొదట శివగామిగా శ్రీదేవిని భావించిన రాజమౌళి, ఆమె అన్‌రీసనబుల్ డిమాండ్ల వల్ల చివరకు రమ్యకృష్ణనే ఎంచుకున్నారు. ఇదే తరహాలో ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా ‘స్పిరిట్’ సినిమా కోసం దీపికా పదుకునేను తప్పించినట్టు కథనాలు వస్తున్నాయి. బాహుబలి సమయంలో శ్రీదేవి రెమ్యూనరేషన్, బిజినెస్ క్లాస్ టికెట్లు, లగ్జరీ హోటల్స్, లాభాల్లో వాటా వంటి వాటిని డిమాండ్ చేసినట్లు రాజమౌళి ఓపెన్ హార్ట్ విత్ RK ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

ఆ తర్వాత శ్రీదేవి కూడా స్పందించి అలా ఏమీ అడగలేదు అని ఏదైనా మిస్ కమ్యూనికేషన్ అయ్యి ఉండవచ్చు అని చెప్పింది అప్పట్లో అది రెండు వైపులా నెగిటివ్ కామెంట్స్ కు దారి తీసింది. ఇక లేటెస్ట్ గా అదే ఇప్పుడు వంగా ఎదుర్కొన్న పరిస్థితి కావొచ్చు. ఇన్‌సైడ్ టాక్ ప్రకారం, దీపికా పదుకునే స్పిరిట్ చిత్రబృందానికి రోజుకు ఆరు గంటలకు మించి పనిచేయలేనని, 100 రోజుల్లో తన పార్ట్ పూర్తవ్వాలని, అతిగా వేతనం ఇవ్వాలంటూ డిమాండ్లు పెట్టినట్లు తెలుస్తోంది.

అంతేకాదు, ఆమె వ్యక్తిగత సిబ్బందికి ముంబై నుంచి ప్రయాణ ఖర్చులు, వసతి వంటి అంశాలను కూడా ప్రస్తావించిందట. అయితే ఇలాంటి డిమాండ్లను సమర్థించలేనన్న భావనతో వంగా బృందం ఆమెను చిత్రబృందం నుంచి తప్పించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటివరకు అధికారికంగా ఎవరూ స్పందించకపోయినా, ఇండస్ట్రీలో అయితే వంగా తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించే స్వరం ఎక్కువగా వినిపిస్తోంది.

దీపికా పదుకునేని తప్పించిన నేపథ్యంలో సందీప్ వంగా మరో ఫ్రెష్ ఫేస్ లేదా తెలుగు భాషతో అనుబంధం ఉన్న నటిని ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక్కడ అసలైన ఆసక్తికర విషయం ఏమిటంటే.. రాజమౌళి స్పందించిన విధానం ఒకప్పుడు వివాదంగా మారింది. కానీ ఇప్పుడు అదే పనిని వంగా చేస్తున్నా విమర్శలు పెద్దగా రావడం లేదు. దీని వెనక ఒకటే కారణం. ఇప్పటి దర్శకులు తమ బిజినెస్ లిమిటేషన్లు బేస్ చేసుకొని హీరోయిన్స్ ఎంపికపై స్పష్టతను చూపుతున్నారు.

అలాగే దీపికా గత ఏడాది కొన్ని కమర్షియల్ సినిమాల్లో అప్ టు మార్క్ ఫలితాలు రాకపోవడం కూడా మేకర్స్ జాగ్రత్తలు తీసుకునేలా చేసిందని అంటున్నారు. ఇక సందీప్ వంగా స్పిరిట్ కోసం మరో స్టార్ నటిని ఎంపిక చేయడంలో బిజీగా ఉన్నాడట. మొత్తానికి అప్పట్లో రాజమౌళి తీసుకున్న నిర్ణయం.. ఇప్పుడు అదే దిశలో వంగా తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్స్ గా మారాయి. హై లెవెల్ డిమాండ్ లో ఉన్న స్టార్స్ కు కూడా రిజెక్షన్స్ తప్పవని చెప్పవచ్చు. ఇక వంగా ఈ తరహా విషయంపై భవిష్యత్తులో స్పందిస్తారో లేదో చూడాలి.

Tags:    

Similar News