స్టార్ హీరోల్లో బెస్ట్ లైనప్ ఎవరిది?
భారత సినీ ఇండస్ట్రీలో రాబోతున్న సినిమాలు ఆడియన్స్ ఎగ్జైట్‌మెంట్ తో పాటూ మారుతున్న ఇండియన్ సినిమా పరిస్థితులను కూడా ప్రతిబింబిస్తోంది.;
భారత సినీ ఇండస్ట్రీలో రాబోతున్న సినిమాలు ఆడియన్స్ ఎగ్జైట్‌మెంట్ తో పాటూ మారుతున్న ఇండియన్ సినిమా పరిస్థితులను కూడా ప్రతిబింబిస్తోంది. దేశంలోని స్టార్ హీరోలందరూ ప్రస్తుతం భారీ లైనప్స్ ను కలిగి ఉండటంతో వారి సినిమాలపై అందరికీ భారీ అంచనాలున్నాయి. అయితే స్టార్ పవర్, ఫ్రాంచైజ్ సామర్థ్యం బలంగా ఉన్నప్పటికీ, సక్సెస్ మాత్రం సీక్వెల్స్, స్టార్లపైనే డిపెండ్ అయిందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఇండియన్ సినిమాలో స్టార్లుగా కొనసాగుతున్న రణ్‌బీర్ కపూర్, హృతిక్ రోషన్, షారుఖ్ ఖాన్, ప్రభాస్, జూ. ఎన్టీఆర్ టాప్ డైరెక్టర్లతో మంచి లైనప్ ను కలిగి ఉన్నారు. వారిలో ముందుగా రణ్‌బీర్ గురించి చెప్పుకుంటే అతని చేతిలో లవ్ అండ్ వార్, రామాయణ్, ధూమ్4, యానిమల్ పార్క్ లాంటి భారీ భారీ ప్రాజెక్టులున్నాయి. హృతిక్ రోషన్ వార్2, క్రిష్4 సినిమాలను లైన్ లో పెట్టాడు.
ఇక బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కింగ్ మరియు పఠాన్2 సినిమాలతో బాలీవుడ్ కు రూ.1000 కోట్ల సినిమాలను అందించాలని చూస్తున్నాడు. సౌత్ ఇండియన్ స్టార్ హీరోలైన ప్రభాస్, జూ. ఎన్టీఆర్ కూడా పలు భారీ ప్రాజెక్టుల్లో భాగమయ్యారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్‌లో ది రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్, కల్కి2, సలార్2 లాంటి పెద్ద సినిమాలున్నాయి.
జూ. ఎన్టీఆర్ చేతిలో వార్2, డ్రాగన్ తో పాటూ దేవర2 కూడా ఉంది. మరోవైపు కార్తీక్ ఆర్యన్ వరుస సీక్వెల్స్, రొమాంటిక్ డ్రామాలతో దూసుకెళ్తున్నాడు. అయితే ఎంత భారీ లైనప్ ఉన్నప్పటికీ సినిమాలు హిట్ అవాలంటే ఆడియన్స్ కు కంటెంట్ కనెక్ట్ అవాలి. లేకపోతే ఎంత పెద్ద భారీ ప్రాజెక్టు అయినా సరే ఫెయిలవడం ఖాయం. అలా అని వీరిపై ఒత్తిడి లేదా అంటే దానికేం తక్కువ లేదు. ఒక స్టార్‌డమ్ వచ్చిన తర్వాత వారి నుంచి వచ్చే ప్రతీ సినిమా హిట్ అవుతుందనే నమ్మకంతోనే ప్రేక్షకులుంటారు. వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గకూడదు, పైగా సినిమా సినిమాకీ కొత్తదనం ఉండాలనుకుంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో సదరు హీరోలు ఆడియన్స్ ను ఏ మేరకు ఆకట్టుకోగలరో చూడాలి.