• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇండియన్ 2.. మధ్యలో...

ఇండియన్ 2.. మధ్యలో టెన్షన్ పెట్టేలా ఉంది

| కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఇండియన్ 2 మూవీపైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

By - Tupaki Desk
Update: 2024-01-30 04:45 GMT

కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఇండియన్ 2 మూవీపైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తమిళంలో ప్రేస్టేజియస్ ప్రాజెక్ట్ గా ఈ మూవీ సిద్ధం అవుతోంది. ఈ సినిమాని ఏప్రిల్ లో రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే పెర్ఫెక్షన్ ఎక్కువ కోరుకునే శంకర్ మూవీ అవుట్ పుట్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాడు.

పోస్ట్ ప్రొడక్షన్ ఏప్రిల్ నాటికి పూర్తికాకుంటే సినిమా రిలీజ్ వాయిదా వేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. కమల్, శంకర్ కలయికలో వచ్చిన ఇండియన్ కి సీక్వెల్ గా ఈ మూవీ సిద్ధం అవుతోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే దీంతో పాటు రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ మూవీ కూడా శంకర్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది.

ఇండియన్ 2 మూవీ ఏప్రిల్ లో రిలీజ్ అయితే గేమ్ చేంజర్ ని సెప్టెంబర్ లో రిలీజ్ ప్లాన్ చేయాలని దిల్ రాజు ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు ఇండియన్ 2 షెడ్యూల్ మారడంతో గేమ్ చేంజర్ కూడా వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది. ఇలా అయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఈ మూవీ కోసం మరికొంత కాలం ఎదురుచూడక తప్పదు. ఇండియన్ 2 ఏప్రిల్ రిలీజ్ వాయిదా పడితే ఆగష్టు 15న విడుదల చేయాలని అనుకుంటున్నారంట.

పుష్ప 2 మూవీ రిలీజ్ వాయిదా పడితే ఆ డేట్ ని ఇండియన్ 2 ఉపయోగించుకోవాలని అనుకుంటుంది. అయితే పుష్ప 2 రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం లేదని తాజాగా మరోసారి చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేసింది. ఈ పరిస్థితిలో శంకర్ ఇండియన్ 2 రిలీజ్ విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇండియన్ 2 రిలీజ్ అయిన వెంటనే ఇండియన్ 3 మూవీ పెండింగ్ షూటింగ్ కంప్లీట్ చేయడంపై శంకర్ దృష్టి పెట్టబోతున్నారు.

మొత్తానికి పాన్ ఇండియా కల్చర్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత సినిమాల మధ్య పొతే కేవలం ఒక్క భాషకి మాత్రమే పరిమితం కాలేదు. అన్ని ఇండస్ట్రీలపైన పడింది. డిసెంబర్ లో సలార్, డంకీ మూవీస్ ఒకే సారి రిలీజ్ అయ్యాయి. డంకీ సినిమాపై సలార్ స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అందుకే పాన్ ఇండియా సినిమాలన్నింటికి కూడా సోలో డేట్ ఉండేలా ఆయా చిత్ర నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు.





 


Tags:    
  • Indian2 
  • Kamalhasan 
  • Shankar 
  • Gamechanger 
  • Ramcharan 
  • Dilraju 
  • Release 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS