• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  థియేటర్లకు...

థియేటర్లకు పండగొచ్చిందహో..

| అప్పుడప్పుడూ ఓ సినిమా కాస్త సందడి తీసుకురావడం.. అంతలోనే మళ్లీ థియేటర్లు ఖాళీ అయిపోవడం.. ఇదీ వరస.

By - Garuda Media
Update: 2025-08-14 07:30 GMT

కొత్త సినిమాలు రిలీజైనా ప్రేక్షకులు లేక థియేటర్లు వెలవెలబోవడం.. వచ్చే డబ్బులు థియేటర్ల మెయింటైనెన్స్‌కు కూడా సరిపోకపోవడం.. షోలు వేస్తే చేతి నుంచి డబ్బులు పెట్టుకోవాల్సిన పరిస్థితి రావడం.. ఇలా వెండి తెరల పరిస్థితి రోజు రోజుకూ దుర్భరంగా మారుతోంది. తరచూ పెద్ద సినిమాలు రాక థియేటర్లను మెయింటైన్ చేయడమే పెద్ద టాస్కుగా మారిపోతోంది.

అప్పుడప్పుడూ ఓ సినిమా కాస్త సందడి తీసుకురావడం.. అంతలోనే మళ్లీ థియేటర్లు ఖాళీ అయిపోవడం.. ఇదీ వరస. ఇలాంటి టైంలో ఇండిపెండెన్స్ డే వీకెండ్ దేశవ్యాప్తంగా థియేటర్లలో పండుగ వాతావరణం తీసుకొస్తోంది. ఈ ఏడాది ఈ స్థాయిలో ఒకేసారి ఇండియా మొత్తం సందడి నెలకొనడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇటు సౌత్ సినిమా అయిన 'కూలీ'.. అటు బాలీవుడ్ మూవీ అయిన ‘వార్-2’.. రెండూ దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాయి.

హృతిక్‌కు ఉత్తరాదిన ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు. పైగా ‘వార్’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ చేశాడు. హృతిక్‌కు దక్షిణాదిన కూడా ఫాలోయింగ్ లేకపోలేదు. అతడికి ఎన్టీఆర్ తోడవడంతో తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. ‘వార్-2’ దేశవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజవుతోంది. ఇక ‘కూలీ’ సినిమాకు గత కొన్ని వారాల్లో క్రేజ్ మల్టిప్లై అవుతూ వచ్చింది. సౌత్ జనాలు సినిమా కోసం ఊగిపోతున్నారు. రిలీజ్ టైంకి నార్త్ ఇండియాలో సైతం ఈ చిత్రానికి క్రేజ్ పెరిగిపోయింది.

ఇలా రెండు చిత్రాలూ మాంచి హైప్ మధ్య రిలీజవుతున్నాయి. రెంటికీ కలిపి అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజిలో జరిగాయి. రిలీజ్ రోజైన గురువారం దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం చూడబోతున్నాం. శుక్రవారం ఎలాగూ ఇండిపెండెన్స్ డే. థియేటర్లు కోలాహలంగా ఉంటాయి. శని, ఆదివారాలూ వెండితెరలు కళకళలాడే అవకాశమే ఉంది. రెండు చిత్రాలకూ పాజిటివ్ టాక్ వస్తే.. ఈ ఏడాది లోటును చాలా వరకు భర్తీ చేసే స్థాయిలో ఇండియన్ బాక్సాఫీస్ షేకైపోవడం ఖాయం.

Tags:    
  • War2 
  • Coolie 
  • IndependenceDayWeekend 
  • BoxOfficeBuzz 
  • Tollywood 
  • Bollywood 
  • TheatreRevival 
  • IndianCinema 
  • War2 Review 
  • Coolie Review 
  • TheatricalMovies 
  • Filmindustry 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS