డైరెక్టర్ కి కూడా పట్టు ఉంటేనే సాధ్యం!
అలాంటి వారిలో అనంత శ్రీరామ్ కూడా ఒకరు. ఇప్పటి వరకూ ఎన్నో సినిమాలకు పాట కట్టారు. తనదైన కలంతో ఎన్న గొప్ప గొప్ప పాటలు రాసారు.;
చిత్ర పరిశ్రమలో గీత రయితల ప్రత్యేకత గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎంతో మంది గొప్ప సాహిత్య రచయితలు తెలుగు పరిశ్రమకు సేవలందిస్తున్నారు. సంగీతంలో వారి పాత్ర అత్యంత కీలకమైంది. గొప్ప సంగీతం రావాలంటే? పాట కూడా అంతే కీలకం. అలాంటప్పుడే సినిమాలో పాటలు మ్యూజికల్ గా మంచి విజయం సాధిస్తుంటాయి. అందుకే దర్శకుడు తన అభిరుచికి తగ్గట్టు గీత రచయితల్ని ఎంచుకుం టారు. పాటల రచయితల మధ్య కూడా మంచి పోటీ కనిపిస్తుంది. ఎంతో మంది రచయితలు ఉండటంతో? ఎవరు ఫాంలో ఉంటే అవకాశాలు కూడా వారికే అన్నట్లు పరిశ్రమ కల్పిస్తుంది.
అలాంటి వారిలో అనంత శ్రీరామ్ కూడా ఒకరు. ఇప్పటి వరకూ ఎన్నో సినిమాలకు పాట కట్టారు. తనదైన కలంతో ఎన్న గొప్ప గొప్ప పాటలు రాసారు. తాజాగా ఇండస్ట్రీలో ఆయన అనుభవం... పాట విషయంలో డైరెక్టర్ ప్రాధాన్యత ఎలా ఉండాలన్నది చెప్పే ప్రయత్నం చేసారు. `నేను సినిమాల్లోకి వచ్చి కొన్ని మంచి పాటలు రాస్తున్నా? దర్శక, నిర్మాతలకు నేను ఎవరో తెలియడానికి ఆరేళ్లు సమయం పట్టిందన్నారు. ప్రేమ పాటలతో పాటు మాస్ పాటలు కూడా రాసి హిట్లు ఇచ్చానన్నారు.
కానీ అందరూ ప్రేమ పాటలు బాగా రాస్తానని అందరూ అలాంటి పాటలే ఇచ్చేవారన్నారు. ఆ తర్వాత తానే లవ్ పాటలు రాయడం మానేసానని, మాస్ సాంగ్స్ పైనే దృష్టి పెట్టి పనిచేసినట్లు తెలిపారు. దాదాపు 1500 పాటలు రాసిన తర్వాత 19 ఏళ్ల కెరీర్ తర్వాత తాను అనుకున్న స్థాయికి చేరినట్లు తెలిపారు. మంచి పాట రావాలంటే కొత్త పదాలతోనే అది సాధ్యమవుతుందన్నారు. ఈ విషయంలో డైరెక్టర్ ఇన్వాల్వ్ మెంట్ కూడా ఎంతో కీలకం అన్నారు. సాహిత్యంపై కాస్తో కూస్తో దర్శకుడికి కూడా పట్టు ఉంటేనే గొప్ప పాట రాయడానికి అవకాశం ఉంటుందన్నారు.
తన కథకు ఎలాంటి పాట అయితే బాగుంటుందో ? డైరెక్టర్ కి కాస్త క్లారిటీ ఉంటే? రాసే రచయికు బాగా వివరించగలరు. అప్పుడే రచయిత కూడా బాగా రాయడానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం పాటల రచయిత పరిస్థితి కూడా దీనంగా ఉందన్నారు. దిన దిన గండంగా ఉండాల్సి వస్తోంది. రకరకాల విభాగాల్లో ప్రయత్నించి చివరికి పాట రాయాలని కూడా సీన్ లోకి కొంత మంది వస్తున్నారు. పాటలు రాయాలనుకునే వాళ్లు తక్కువ.. అలా అనుకుని పాటల రచయితలు అయ్యేవాళ్లు తక్కువ కాబట్టే తమ లాంటి వారు ఇంకా పరిశ్రమలో కనిపిస్తున్నారన్నారు.