• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రభాస్ తో మూవీ.. ఆమెకు...

ప్రభాస్ తో మూవీ.. ఆమెకు జాక్ పాట్ రెమ్యునరేషన్

| అయితే ఎప్పుడైతే ప్రభాస్ సినిమాలో ఛాన్స్ అందుకుందో అప్పటి నుంచి అమ్మడి క్రేజ్ మరింత పెరిగింది.

By - Tupaki Desk
Update: 2024-08-22 11:30 GMT

ప్రభాస్, హను రాఘవపూడి కలయికలో కొత్త సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం దర్శకుడు లొకేషన్స్ ను వెతికే పనిలో బిజీగా ఉన్నాడు. ఇక ఫౌజీ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో సోషల్ మీడియా స్టార్ ఇమాన్వీ ఇస్మాయిల్ ప్రధాన కథానాయికగా ఎంపికైంది. సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇమాన్వీకి ముందుగానే మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఎప్పుడైతే ప్రభాస్ సినిమాలో ఛాన్స్ అందుకుందో అప్పటి నుంచి అమ్మడి క్రేజ్ మరింత పెరిగింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకి ఇప్పటి వరకు 8 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. కెరీర్ మొదట్లోనే ప్రభాస్ తో ఛాన్స్ రావడం జాక్ పాట్ అనే చెప్పాలి. సీనియర్లు సైతం ప్రభాస్ తో నటించేందుకు పోటీ పడుతుండగా ఇప్పుడు హఠాత్తుగా ఇమాన్వి ఛాన్స్ కొట్టేసింది. దీంతో ఆమె ప్రతీ సినిమా ఇండస్ట్రీలో ఫోకస్ అవుతోంది. ప్రభాస్ సినిమా కంటే ముందు యూట్యూబ్ ద్వారా అమ్మడు సుమారు 2 లక్షల రూపాయల ఆదాయం పొందుతున్నట్లు పలు మీడియా నివేదికలు వెల్లడించాయి.

అయితే ఇప్పుడు ఆమె ఒక సినిమా రెమ్యునరేషన్ లెక్క ఏకంగా 1 కోటి రూపాయలకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ సినిమాకు గాను కోటి వరకు రెమ్యునరేషన్ అందుతున్నట్లు టాక్. టాలీవుడ్‌లో కొత్తగా ప్రవేశించిన నటీమణులలో ఇంత భారీ మొత్తాన్ని పొందిన వాళ్లలో ఇమాన్వీ టాప్ లిస్టులో నిలిచింది. అప్పట్లో కత్రినా కైఫ్ ‘మల్లీశ్వరి’ సినిమాకు మొదటి 1 కోటి రూపాయలు తీసుకున్నట్లు ఒక టాక్ అయితే వచ్చింది.

అలాగే ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లలో కొందరు 2 కోట్ల కంటే తక్కువనే తీసుకుంటున్నారు. ఎన్నో హిట్స్ దక్కితే గాని ఇలాంటి ఆఫర్స్ రావు. కానీ ఇమాన్వీ సోషల్ మీడియా ఫాలోయింగ్ మరియు యూట్యూబ్ ప్రెజెన్స్ కారణంగానే ఈ స్థాయిలో రెమ్యునరేషన్ పొందిందని అంటున్నారు. అలాగే ప్రభాస్ సరసన నటించడం ద్వారా ఆమెకు పెద్ద నిర్మాణ సంస్థలు, దర్శకులు మంచి అవకాశాలు ఇస్తారన్న నమ్మకం కలుగుతోంది.

రాబోయే సినిమాలకు కూడా అమ్మడు రెమ్యునరేషన్ కోటి కంటే ఎక్కువగానే డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఇక ప్రభాస్ హను సినిమా ఏమాత్రం క్లిక్కయినా ఇమాన్వీ కెరీర్ త్వరలోనే ఊపందుకుంటుందనేది ఖాయంగా భావిస్తున్నారు. అయితే ముందుగానే ఇమాన్వీ తన భవిష్యత్ చిత్రాల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలని మరికొందరు సలహా ఇస్తున్నారు. కేవలం స్టార్ హీరోలతో మాత్రమే కాకుండా, పాత్రల ఎంపికలో విశిష్టతను కాపాడుకుంటేనే ఆమె కెరీర్ సుదీర్ఘంగా సాగుతుందని భావిస్తున్నారు.

Tags:    
  • Imanviesmail 
  • Imanvi 
  • Fauji 
  • Tollywood 
  • Prabhas 
  • Hanuraghavapudi 
  • Imanviesmailremuneration 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS