అమ్మా నా వల్ల కాదు... ఇలియానా ఏడుపు!

టాలీవుడ్‌లో 'దేవదాస్‌' సినిమాతో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ ఇలియానా తక్కువ సమయంలోనే టాప్‌ స్టార్‌ హీరోయిన్‌గా పేరు దక్కించుకుంది.;

Update: 2025-07-15 03:15 GMT

టాలీవుడ్‌లో 'దేవదాస్‌' సినిమాతో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ ఇలియానా తక్కువ సమయంలోనే టాప్‌ స్టార్‌ హీరోయిన్‌గా పేరు దక్కించుకుంది. తెలుగులో స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా సినిమాలు చేస్తున్న సమయంలోనే బాలీవుడ్‌లో ఆఫర్లు దక్కించుకుని అటు వెళ్లింది. బాలీవుడ్‌లో మూడు నాలుగు ఏళ్ల పాటు బిజీ బిజీగా సినిమాలు చేసింది. అక్కడ సినిమా ఆఫర్లు తగ్గడంతో మళ్లీ సౌత్‌కు వచ్చే ప్రయత్నం చేసింది. తెలుగులో ఈమె రీ ఎంట్రీ ఇచ్చి నటించిన సినిమా నిరాశపరచడంతో ఆ తర్వాత ఆఫర్లు రాలేదు. బాలీవుడ్‌లోనూ సినిమాల ఆఫర్లు లేకపోవడంతో పెళ్లి చేసుకుని కొత్త జీవితంను మొదలు పెట్టింది. ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తుంది.

ఇటీవల తల్లి అయిన ఇలియానా మాతృత్వం ని ఎంజాయ్ చేస్తున్నాను అంటూ ఆ మధ్య సోషల్‌ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది. తన సినీ ప్రస్థానం గురించి, తాను గతంలో నటించిన సినిమాల గురించి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండే ఇలియానా తాజాగా ఒక ఇంటర్వ్యూలో కెరీర్‌ ఆరంభంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సమయంలో ఎవరైనా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని ఇలియానా కూడా ఎక్స్‌పీరియన్స్ చేసిందట. ఇటీవల ఇంటర్వ్యూలో తన మొదటి సినిమా కష్టాల గురించి చెప్పింది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఆ విషయాలు వైరల్‌ అవుతున్నాయి.

ఇలియానా మాట్లాడుతూ... సినిమా ఇండస్ట్రీలో తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. అంతే కాకుండా భావోద్వేగాలతో నిండి ఉంటుంది. దేవదాసు సినిమా షూటింగ్‌ సమయంలో నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మొదటి సినిమా కావడంతో సెట్స్‌లో ఎవరితోనూ మాట్లాడలేక పోయేదాన్ని, ఒకవేళ ఏమైనా మాట్లాడాలి అనుకున్నా భాషతో ఇబ్బంది. నా భాష వాళ్లకు రాదు, వాళ్ల భాషలో నేను కమ్యూనికేట్‌ చేయడం సాధ్యం అయ్యేది కాదు. దాంతో అమ్మకు ఫోన్‌ చేసి చాలా సార్లు అమ్మా నా వల్ల కాదు, సినిమాను వదిలేసి వస్తాను. సినిమాల్లో నటించడం నా వల్ల కాదు, ఇక్కడ నాకు ఏం అర్థం కావడం లేదు, ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదని ఏడ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి అంది.

ఆ సమయంలో అమ్మ నాకు అండగా నిలిచింది. పలు సార్లు మోటివేషన్ చేసింది. తనకు వీలున్నప్పుడు వచ్చి నా వెంట ఉండేది. ఒంటరిగా ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల యొక్క మద్దతు చాలా అవసరం అని ఆ సమయంలో నాకు అర్థం అయింది. చాలా సార్లు నేను లో గా ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడటం వల్ల కాస్త రిలాక్స్ అయ్యేదాన్ని అంది. దేవదాస్‌ సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన ఇలియానా తక్కువ సమయంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంది. టాలీవుడ్‌లో మొదటి రూ.కోటి పారితోషికం తీసుకున్న హీరోయిన్‌గా ఇలియానా నిలిచింది. తరుణ్ సినిమాలో నటించినందుకు గాను ఇలియానా అప్పట్లోనే కోటి పారితోషికం తీసుకుంది.

Tags:    

Similar News