ఇళయరాజా కామెంట్స్.. అపార్థం చేసుకోవడం కరెక్ట్ కాదేమో!
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటలంటే ఇష్టపడని వారు బహుశా ఉండరేమో.;
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటలంటే ఇష్టపడని వారు బహుశా ఉండరేమో. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన పాటలు అందించారు. తన సంగీతంతో మ్యూజిక్ లవర్స్ ను కట్టిపడేశారు. కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆయన పాటలు వింటుంటే తెలియని అనుభూతి కలగడం పక్కా.
మనసుకు వచ్చే ప్రశాంతతే వేరు. అలా తన పాటలతో మ్యాజిక్ చేశారు మ్యూజిక్ మ్యాస్ట్రో. అయితే ఇప్పుడు సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న ఆయన.. తాజాగా షష్టిపూర్తి మూవీకి గాను వర్క్ చేశారు. సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఆ మూవీ.. మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన సాంగ్స్ సూపర్ హిట్ గా నిలిచాయి. ఎంతో ఆకట్టుకున్నాయి. అయితే ప్రమోషన్స్ కు ఎప్పుడూ దూరంగా ఉండే ఇళయరాజా.. ఈసారి షష్టిపూర్తి మూవీ విషయంలో మాత్రం మినహాయింపు ఇచ్చినట్లే. రిలీజ్ కు ముందు పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు వైరలయ్యాయి.
అదే సమయంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన 'నా లాంటి సంగీత దర్శకుడు ప్రపంచంలోనే లేడు, ఇంతకుముందు పుట్టలేదు, ఇకపైన పుట్టడు' అని అన్నారు. కావాలంటే ఎవరితోనైనా పోల్చండని చెప్పారు. మొత్తం వీడియో చూడకుండా, ఆ వ్యాఖ్యలను సరిగ్గా అర్థం చేసుకోకుండా అనేక మంది ఇళయరాజా వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారు.
సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా చేశారు. కానీ అసలు విషయం అది కాదు. మొత్తం విషయం చూస్తే పూర్తి విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఆ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగతంతోపాటు వృత్తి జీవితం గురించి మాట్లాడారు. ఆ సమయంలో ఎవరి హెల్ప్ లేకుండా తాను ఇంత స్థాయికి ఎదిగానని చెప్పారు. అదే ఆయన ఉద్దేశ్యం తప్ప వేరేది కాదు.
"ఒక కు గ్రామం నుండి వచ్చి ఎంతో మంది సంగీత పెద్దల వద్ద వర్క్ చేసి.. ఒక్కో సంగీత దర్శకుడి వద్ద ఒక్కో క్వాలిటీ నేర్చుకుని.. సంగీత దర్శకుడిగా మారాను. నాలా అంతకు ముందు ఎవరూ లేరు.. ఆ తర్వాత ఎవరూ కూడా రారు" అని ఆ సందర్భంలో ఆయన వ్యాఖ్యానించారు. తెలుగులో దాన్ని వ్యక్తపరిచే తీరులో భాష ఇబ్బంది వల్ల మొత్తం అర్థం మారిపోయిందని చెప్పాలి. ఏదేమైనా క్లియర్ గా తెలుసుకోకుండా అపార్థం చేసుకోవడం కరెక్ట్ కాదేమో.